ఫేస్‌బుక్ డేటా మొత్తాన్ని ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా ?
కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్ ఇచ్చిన షాక్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే.
కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్ ఇచ్చిన షాక్ ప్రపంచాన్ని కుదిపేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ స్కామ్ ఫేస్‌బుక్‌పై మాయని మచ్చ వేసింది. సామాజిక మాధ్యమాల్లో మన సమాచారం ఎంత వరకూ సురక్షితం అన్న అనుమానాలను రేకేత్తించింది. ఈ నేపధ్యంలో డేటాను కాపాడుకోవడం చాలా ముఖ్యమైన భాగమైపోయింది.మరి ఈ డేటాను అంతా మీరు ఒకే చోట చూసుకోవాలని ఉందా? మీరే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదెలాగు ప్రాసెస్ ఏంటో దీని ద్వారా తెలుసుకుందాం.

స్టెప్ 1:
ఫేస్‌బుక్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘డౌన్‌లోడ్ ఎ కాపీ ఆఫ్ ఫేస్‌బుక్ డేటా' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. మొత్తం మీ డేటాను జిప్ ఫైల్‌గా మార్చి, మీ ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపిస్తుంది.

స్టెప్ 2:
మీ మెయిల్‌కు రెండు ఈ-మెయిల్స్ వస్తాయి. ఒకటి ‘కన్‌ఫర్మేషన్ మెయిల్', రెండు ‘యాక్చువల్ లింక్'.

స్టెప్ 3:
ఈ ‘యాక్చువల్ లింక్'ను క్లిక్ చేస్తే మళ్లీ ఫేస్‌బుక్‌లోకి ఎంటరవుతాం. అప్పుడు ఓ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.

స్టెప్ 4
అందులో ‘డౌన్‌లోడ్ ఆర్చీవ్' అనే పచ్చరంగు బటన్‌ను క్లిక్ చేయండి.

స్టెప్ 5:
అంతే జిప్‌ఫైల్ ఫార్మేట్‌లో ఉన్న డేటా మీ సిస్టంలోకి డౌన్‌లోడ్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications








