Home
How to

COVID-19 Vaccine Certificate: WhatsApp ద్వారా COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా??

కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచం మొత్తం మీద ఉంది. మీరు విదేశాలకు లేదా దేశంలో ప్రయాణించే ప్రణాళికలు ఉంటే కనుక కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ ముఖ్యంగా కావలసి ఉంటుంది. ఇప్పటి వరకు COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీకు రెండు ఎంపికలు ఉన్నాయి. వాటిలో కోవిన్ పోర్టల్‌కు వెళ్లడం లేదా ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించి డౌన్‌లోడ్ చేయవచ్చు. భారత ప్రభుత్వం ఇప్పుడు వాట్సాప్‌తో కలిసి కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మరింత సులభతరం చేసింది.

How to Download COVID-19 Vaccine Certificate Via WhatsApp

మీరు ఇప్పుడు MyGov కరోనా హెల్ప్‌డెస్క్ WhatsApp చాట్‌బాట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది గత సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి వచ్చినప్పుడు భారత ప్రభుత్వం ప్రకటించింది. WhatsApp ద్వారా COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోవడానికి కింద ఉన్న ఈ దశలను అనుసరించండి.

WhatsApp ద్వారా COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి

How to Download COVID-19 Vaccine Certificate Via WhatsApp

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో MyGov కరోనా హెల్ప్‌డెస్క్ WhatsApp నంబర్‌ను సేవ్ చేయండి. ఫోన్ నంబర్: +91 9013151515

స్టెప్ 2: ఫోన్ నంబర్ ను స్టోర్ చేసిన తర్వాత WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 3: చాట్ జాబితాలో ఈ కాంటాక్ట్ నెంబర్ కోసం శోధించి చాట్ ను ఓపెన్ చేయండి.

స్టెప్ 5: తరువాత డౌన్‌లోడ్ సర్టిఫికెట్‌ అని టైప్ చేసి సెండ్ చేయండి.

స్టెప్ 6: వాట్సాప్ చాట్‌బాట్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల OTP ని పంపుతుంది.

స్టెప్ 7: OTP కోసం తనిఖీ చేసి దాన్ని వాట్సాప్ చాట్ లో నమోదు చేయండి.

స్టెప్ 8: చాట్‌బాట్ మీ COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను WhatsApp లో పంపుతుంది మరియు మీరు సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసి సురక్షితమైన ప్రదేశంలో స్టోర్ చేయవచ్చు.

మేము COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించాము కానీ మొదటి కొన్ని ప్రయత్నాలలో చాట్‌బాట్ "సర్వర్" సమస్యలను చూపించింది. దాదాపు 3-4 ప్రయత్నాల తర్వాత మేము కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను విజయవంతంగా డౌన్‌లోడ్ చేసుకున్నాము.

How to Download COVID-19 Vaccine Certificate Via WhatsApp

WhatsApp చాట్‌బాట్ సర్వర్ లోపాన్ని చూపిస్తే మీరు అధికారిక కోవిన్ పోర్టల్‌కు వెళ్లవచ్చు లేదా COVID టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆరోగ్య సేతును ఇన్‌స్టాల్ చేయవచ్చు. మీరు మొదటి టీకా జాబ్ తీసుకున్నట్లయితే మీరు పాక్షికంగా టీకాలు వేసిన సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు మీరు రెండు టీకాలను పూర్తి చేసినట్లయితే ఫైనల్ టీకా సర్టిఫికెట్‌ను పైన పేర్కొన్న ప్లాట్‌ఫారమ్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Download COVID-19 Vaccine Certificate Via WhatsApp
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X