Aadhaar Card పోగొట్టుకున్నారా.. చింత వ‌ద్దు, మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండిలా!

|

భార‌త దేశంలో నివ‌సించే ప్ర‌తి ఒక్క‌రికి గుర్తింపు కోసం ప్ర‌భుత్వం Aadhaar Cardల‌ను జారీ చేస్తున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అంద‌రికీ Aadhaar Card త‌ప్ప‌నిస‌రిగా మారింది. ఏ అప్లికేష‌న్ పెట్టుకోవాల‌న్నా, ప్ర‌భుత్వానికి సంబంధించి ఏదైనా ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు పెట్టుకోవాల‌న్నా ఆధార్ నంబ‌ర్ త‌ప్ప‌నిస‌రి అయింది.

 E adhar card

ఒక‌సారి మ‌నం Aadhaar Card పొందిన త‌ర్వాత అది పోగొట్టుకుపోతే మ‌ళ్లీ ఆధార్ పొంద‌డం ఎలా అని చాలా మంది ఆందోళ‌న‌కు గుర‌వుతుంటారు. కానీ, ఒక‌సారి ఆధార్ పొందిన త‌ర్వాత అది పోగొట్టుకుపోయినా చింతించాల్సిన అవ‌స‌రం లేదు. మ‌ళ్లీ Aadhaar Cardను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు డౌన్‌లోడ్ ప్ర‌క్రియ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం. మీరు కూడా మీ ఆధార్ కార్డు పోగొట్టుకున్న‌ట్ల‌యితే ఈ కింద మేం ఇచ్చే ప్ర‌క్రియ‌ను అనుస‌రించి మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేసుకోండి.

 E adhar card

Aadhaar Card డౌన్‌లోడ్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌:
* ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. లింక్: (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html)
* UIDAI వెబ్‌సైట్లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత "మై ఆధార్‌" సెక్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
* మై ఆధార్ సెక్ష‌న్‌లో కింద కొన్ని ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిలో డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఇప్పుడు మీకు లాగిన్ విత్ ఆధార్ అండ్ ఓటీపీ అని ఒక బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* అనంత‌రం మీ ఆధార్ నంబ‌ర్ టైప్ చేసిన త‌ర్వాత, రిజిస్ట‌ర్‌డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.
* లాగిన్ విజ‌య‌వంతం అయిన త‌ర్వాత మీకు మీ డౌన్‌లోడ్ ఆధార్ కార్డు ఆప్ష‌న్ క్లిక్ చేస్తే మీకు కార్డు ఓపెన్ అవుతుంది.
* అక్క‌డే డౌన్‌లోడ్ ఆధార్ కార్డు అనే ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును మీరు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
* అయితే, ఇక్క‌డ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే.. డౌన్‌లోడ్ అయిన ఆధార్ ఫైల్ ను మీరు ఓపెన్ చేయ‌డానికి పాస్‌వ‌ర్డ్ అడుగుతుంది.
* ఆ పాస్‌వ‌ర్డ్‌ ఏంటంటే.. మీ పేరులోని నాలుగు అక్ష‌రాలు, మీరు పుట్టిన సంవ‌త్స‌రం అంకెలు టైప్ చేస్తే ఆ ఫైల్ ఓపెన్ అవుతుంది.
ఉదాహ‌ర‌ణ‌కు.. మీ పేరు AVINASH, పుట్టిన సంవ‌త్స‌రం 1990 అనుకుంటే, పాస్ వ‌ర్డ్ వ‌చ్చేసి.. పేరులో మొద‌టి 4 అక్ష‌రాలు.. పుట్టిన సంవ‌త్స‌రం అంకెలు క‌లిపి AVIN1990 అని టైప్ చేయాలి. ఇక మీ ఆధార్ మీకు క‌నిపిస్తుంది.
* ఇలా ఈ ప‌ద్ద‌తిని ఉప‌యోగించి ఎవ‌రైనా త‌మ ఆధార్‌కార్డు పోతే.. కొత్త‌ది మ‌ళ్లీ డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

 E adhar card

Aadhaar పీవీసీ కార్డును ఆర్డ‌ర్ చేయ‌డానికి ఈ కింది ప‌ద్ద‌తి పాటించండి:
* ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. లింక్: (https://uidai.gov.in/my-aadhaar/get-aadhaar.html)
* UIDAI వెబ్‌సైట్లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత "మై ఆధార్‌" సెక్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
* మై ఆధార్ సెక్ష‌న్‌లో కింద కొన్ని ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. వాటిలో డౌన్‌లోడ్ ఆధార్ అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఇప్పుడు మీకు లాగిన్ విత్ ఆధార్ అండ్ ఓటీపీ అని ఒక బ‌ట‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
* అనంత‌రం మీ ఆధార్ నంబ‌ర్ టైప్ చేసిన త‌ర్వాత, రిజిస్ట‌ర్‌డ్ మొబైల్ నంబ‌ర్‌కు వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.
* లాగిన్ విజ‌య‌వంతం అయిన త‌ర్వాత మీకు డాష్‌బోర్డులో ప‌లు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. అందులో రెండోది ఆర్డ‌ర్ పీవీసీ కార్డు అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోవాలి.
* ఆ ఆప్ష‌న్‌ ఎంపిక చేసుకున్న త‌ర్వాత పీవీసీ కార్డును ఆర్డ‌ర్ చేయ‌డానికి మీకు ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. అయితే ఇందుకోసం మీరు రూ.50 చెల్లించ‌వ‌ల‌సి ఉంటుంది. మీరు పేర్కొన్న అడ్ర‌స్‌కు కార్డు పోస్టు ద్వారా అందుతుంది.

Best Mobiles in India

English summary
How to Download E adhar card online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X