స్మార్ట్‌ఫోన్‌లోనే ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

|

గుర్తింపు కార్డు (ఐడెంటిటీ) అనేది నేటి సమాజంలో ఖచ్చితంగా అవసరం అవుతున్నది. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎలక్షన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చాలానే ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఒకటి ఉపయోగపడుతూ ఉంటాయి. ఉదాహరణకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులకు డ్రైవింగ్ లైసెన్స్ కార్డుకు బదులు పాన్ కార్డ్ చూపిస్తే ఏమి అవుతుంది? ఫైన్ కట్టవలసి ఉంటుంది. అలాగే ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి ఆధార్ కార్డ్ చూపిస్తే ఓటు వేయలేరు. కావున ప్రతి ఒక్కరు కూడా అన్ని రకాల గుర్తింపు కార్డులను పొందడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వెళ్లే ప్రతి చోటుకి అన్ని రకాల గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం అనేది కుదరదు. కానీ నేటి స్మార్ట్ యుగంలో స్మార్ట్ ఫోన్ ని ఉపయోగించని వారు అంటూ ఎవరూ కూడా దాదాపుగా లేరనే చెప్పవచ్చు. అయితే మీ యొక్క స్మార్ట్‌ఫోన్‌లోనే ఎలక్షన్ కార్డుని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని మీరు ఆలోచిస్తుంటే కనుక కింద తెలిపే సులభమైన విధానాలను అనుసరించండి.

 

e-EPIC

భారత ఎన్నికల సంఘం (ECI) ఇప్పుడు ఎలక్షన్ ఫోటో గుర్తింపు కార్డు (e-EPIC)ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. The-EPICH అనేది ఎలక్టోరల్ ఫోటో గుర్తింపు కార్డు (EPIC) యొక్క సవరించలేని మరియు సురక్షితమైన PDF వెర్షన్. ఇది ఒరిజినల్ దానికి సమానంగా చెల్లుబాటు అవుతుంది. e-EPIC అనేది EPIC యొక్క PDF వెర్షన్. ఓటర్లు తమ కార్డులను తమ మొబైల్ ఫోన్లలో భద్రపరుచుకోవచ్చు మరియు డిజి లాకర్లకు అప్‌లోడ్ చేయవచ్చు. అంతేకాకుండా వాటిని ప్రింట్ చేసి స్వయంగా లామినేట్ కూడా చేసుకోవచ్చు.

డిజిటల్ ఎలక్షన్ కార్డును డౌన్‌లోడ్ చేసే విధానం
 

డిజిటల్ ఎలక్షన్ కార్డును డౌన్‌లోడ్ చేసే విధానం

స్టెప్ 1: https://www.nvsp.in/ ఓపెన్ చేయండి మరియు 'డౌన్‌లోడ్ e-EPIC కార్డ్'పై క్లిక్ చేయండి.

స్టెప్ 2- లాగిన్ అవ్వండి లేదా కొత్త యూజర్ గా నమోదు చేసుకోండి.

స్టెప్ 3- 'e-EPIC డౌన్‌లోడ్'పై క్లిక్ చేయండి.

స్టెప్ 4- EPIC నంబర్ లేదా ఫారమ్ రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేయండి.

స్టెప్ 5- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPని ధృవీకరించండి.

స్టెప్ 6- డౌన్‌లోడ్ e-EPICపై క్లిక్ చేయండి.

మొబైల్ నంబర్ ఈరోల్‌లో నమోదు చేయకుండా ఉంటే కనుక ఈ దశలను అనుసరించండి

స్టెప్ 7- KYCని పూర్తి చేయడానికి e-KYC పై క్లిక్ చేయండి.

స్టెప్ 8- ఫేస్ లైవ్‌నెస్ వెరిఫికేషన్‌ను పాస్ చేయండి.

స్టెప్ 9- KYCని పూర్తి చేయడానికి మీ మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేయండి.

స్టెప్ 10- e-EPICని డౌన్‌లోడ్ చేయండి.


మీరు మీ పేరును ఎలక్టోరల్ రోల్‌లో http://voterportal.eci.gov.in/ లేదా http://electoralsearch.in/ నుండి శోధించవచ్చు. మీ EPIC నంబర్‌ను ఉపయోగించి e-EPICని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 

ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ నుండి e-EPICని డౌన్‌లోడ్ చేసుకోనే విధానం

ఓటర్ హెల్ప్‌లైన్ మొబైల్ యాప్ నుండి e-EPICని డౌన్‌లోడ్ చేసుకోనే విధానం

స్టెప్ 1- ఓటర్ పోర్టల్‌లో రిజిస్టర్ అవ్వండి లేదా లాగిన్ చేయండి.

స్టెప్ 2- మెను నావిగేషన్ నుండి డౌన్‌లోడ్ e-EPICపై క్లిక్ చేయండి.

స్టెప్ 3- EPIC నంబర్ లేదా ఫారమ్ రిఫరెన్స్ నంబర్‌ను నమోదు చేయండి.

స్టెప్ 4- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTPతో ధృవీకరించండి (మొబైల్ నంబర్ ఈరోల్‌తో రిజిస్టర్ అయితే).

స్టెప్ 5- డౌన్‌లోడ్ e-EPICపై క్లిక్ చేయండి

 

Best Mobiles in India

English summary
How to Download Election Voter ID Card on Your Smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X