ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్‌లో నిత్యం వేల సంఖ్యలో వీడియోలు షేర్ కాబడుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలను మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంటుంది. అయితే, ప్రతిసారి సంబంధిత పేజీలోకి వెళ్లి ఆ వీడియోలను చూడటమనేది బోలేడంత సమయాన్ని వృధా చేసేస్తుంది.

నోకియా ఫోన్‌లు ఈ నెలలోనే వచ్చేస్తున్నాయ్!

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

కాబట్టి, నచ్చిన ఫేస్‌బుక్ వీడియోలను ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవటం ద్వారా నచ్చిన వీడియోలను ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్లే చేసుకుని చేసుకోవచ్చు. ఏ విధమైన థర్డ్ పార్టీ టూల్స్ అవసరం లేకుండా ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కొన్ని సింపుల్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం..

ప్రొసీజర్ 1

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వీడియో వద్దకు వెళ్లండి. ఆ వీడియో పై రైట్ క్లిక్ చేసినట్లయితే, అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో "Show Video URL" ను సెలక్ట్ చేసుకోండి. ఆ URLను కాపీ చేసుకోండి.

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

త్వరలో జియో 4జీ ల్యాప్‌టాప్?

ఇప్పుడు వేరొక ట్యాబ్‌లో https://x.facebook.com/video/video.php?v="Video ID" అనే URLను ఓపెన్ చేసి, ఆ URLలోని "Video ID" స్థానంలో మీరు ఇంతుకు ముందుకు కాపీ చేసుకున్న వీడియో ఐడీ నెంబర్‌ను పేస్ట్ చేయండి. ఉదాహరణకు మీరు https://www.facebook.com/gizbot.com/videos/1331746516855780/ లింక్‌లో గల వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారు. పైన పేర్కొన్న విధంగా "Video ID" స్థానంలో మీరు 1331746516855780 ఈ వీడియో కోడ్‌ను పేస్ట్ చేస్తే సరిపోతుంది.

Galaxy On8 ధర తగ్గింది, ఎంతో తెలుసా..?

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

ఇప్పుడు https://x.facebook.com/video/video.php?v=1331746516855780 లింక్‌లో ప్లే అవుతోన్న వీడియో పై రైట్ క్లిక్ చేసినట్లయితే, అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Save Video as ఆప్షన్‌ను సెలక్ట్ చేసకున్నట్లయితే వీడియో కావల్సిన లొకేషన్‌లో సేవ్ చేసుకోవచ్చు.

ప్రొసీజర్ 2

ముందుగా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వీడియో వద్దకు వెళ్లండి.ఉదాహరణకు మీరు https://www.facebook.com/gizbot.com/videos/1331746516855780/ యూఆర్‌ఎల్‌లో ఉన్న వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారనుకుందాం.

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

యూఆర్ఎల్‌లోని "www" స్థానాన్ని "m" అక్షరంతో రీప్లేస్ చేసి, ఈ విధంగా https://m.facebook.com/gizbot.com/videos/1331746516855780/ యూఆర్ఎల్‌ను మార్చినట్లయితే మొబైల్ వర్షన్‌లో వీడియో ఓపెన్ అవుతుంది. రైట్ క్లిక్ చేసినట్లయితే, అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో Save Video as ఆప్షన్‌ను సెలక్ట్ చేసకున్నట్లయితే వీడియో కావల్సిన లొకేషన్‌లో సేవ్ చేసుకునే వీలుంటుంది.

2జీ ఇంటర్నెట్‌లోనూ యూట్యూబ్ వీడియోలు, కొత్త యాప్ వచ్చేసింది

English summary
How To Download Facebook Videos. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot