Facebook వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కొత్త టూల్!

200 కోట్ల పై చిలుకు యూజర్లతో శక్తివంతమైన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించిన ఫేస్‌బుక్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఫేస్‌బుక్ సేవలను నిత్యం లక్షలాది మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు.

|

200 కోట్ల పై చిలుకు యూజర్లతో శక్తివంతమైన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించిన ఫేస్‌బుక్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఫేస్‌బుక్ సేవలను నిత్యం లక్షలాది మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. ఈ సామాజిక మాద్యమం ద్వారా కొత్త ఫ్రెండ్‌లను క్రియేట్ చేసుకోవటం, ఇప్పటికే ఉన్న స్నేహితులతో టచ్‌లో ఉండటం, మెసెజ్‌లతో పాటు ఫోటోలు, వీడియోలు ఇంకా ఇతర ఉపయుక్తమైన సమాచారాన్ని షేర్ చేసుకోవటం వంటి అవసరాలను నెటిజనులు తీర్చుకుంటున్నారు.

రూ.6307కే షియోమి రెడ్‌మి 6ఎ,లాంచ్ అయిన రెడ్‌మీ 6రూ.6307కే షియోమి రెడ్‌మి 6ఎ,లాంచ్ అయిన రెడ్‌మీ 6

ఎక్కువ మొత్తంలో వీడియో కంటెంట్..

ఎక్కువ మొత్తంలో వీడియో కంటెంట్..

మరోవైపు వ్యాపార విస్తరణకు కూడా ఫేస్‌బుక్ ఉపయోగపడుతోంది. ఈ మాద్యమాన్ని ఉపయోగించుకని చిన్నచిన్న వ్యాపారులు ద్వారా టార్గెటెడ్ కస్టమర్స్‌కు రీచ్ కాగలుగుతున్నారు. ఫేస్‌బుక్ నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండటంతో ఎక్కువ మొత్తంలో వీడియో కంటెంట్ ఇక్కడ అప్‌లోడ్ అవుతోంది. ఫేస్‌బుక్‌లో మనం వీక్షించే వీడియోల్లో కొన్ని వీడియోలను మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంటుంది.

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు సింపుల్ టూల్..

ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు సింపుల్ టూల్..

అయితే, ప్రతిసారి సంబంధిత పేజీలోకి వెళ్లి ఆ వీడియోలను చూడటమనేది బోలేడంత సమయాన్ని వృధా చేసేస్తుంది కాబట్టి, నచ్చిన ఫేస్‌బుక్ వీడియోలను ఎప్పటికప్పుడు డౌన్‌లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవటమనేది ఉత్తమమైన పని. ఫేస్‌బుక్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఓ సింపుల్ ప్రొసీజర్ ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉంది. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం..

“Facebook Video Downloader” అనే ఎక్స్‌టెన్షన్‌ ద్వారా..

“Facebook Video Downloader” అనే ఎక్స్‌టెన్షన్‌ ద్వారా..

ముందుగా మీ కంప్యూటర్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి యాప్ స్టోర్‌లోకి వెళ్లాలి. అక్కడ "Facebook Video Downloader" అనే ఎక్స్‌టెన్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎక్స్‌టెన్షన్ ఇన్‌స్టాల్ అయిన తరువాత క్రోమ్ బ్రౌజర్‌కు దానిని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తరువాతి నుంచి ఫేస్‌బుక్ ఐకాన్ ఒకటి బ్రౌజర్ స్ర్కీన్ కుడి చేతి కార్నర్‌లో కనిపిస్తుంటుంది.

వీడియోకు సంబంధించిన క్వాలిటీని సెలక్ట్ చేసుకుని..

వీడియోకు సంబంధించిన క్వాలిటీని సెలక్ట్ చేసుకుని..

ఇప్పుడు మీ ఫేస్‌బుక్ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. ఆ తరువాత డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వీడియోను ప్లే చేయండి. వీడియో ప్లే అవుతోన్న సమయంలో బ్రౌజర్ కుడి చేతి కార్నర్‌లో కనిపించే Facebook Video Downloader ఐకాన్ పై క్లిక్ చేసిన వెంటనే ఓ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మీ వీడియోకు సంబంధించిన క్వాలిటీని సెలక్ట్ చేసుకుని పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. డౌన్‌లోడ్ అయిన ఫేస్‌బుక్ వీడియోలను ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వీక్షించే అవకాశం ఉంటుంది.

పాఠకులకు ముఖ్య గమనిక...

పాఠకులకు ముఖ్య గమనిక...

ఫేస్‌బుక్ వీడియో డౌన్‌లోడర్ టూల్‌ను ఉపయోగించుకుని ఫేస్‌బుక్‌లో లభ్యమవుతోన్న అన్ని వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం సాధ్యపడదు. ఓనర్ పర్మిషన్‌ను బట్టి కేవలం కొన్ని వీడియోలను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే వీలుంటుంది. వీడియోలో పేజీలో గ్లోబ్ ఐకాన్ ఉన్నట్లయితే, ఆ వీడియో డౌన్‌లోడింగ్‌కు సిద్ధమని గ్రహించాలి. ఒకవేళ వీడియో పేజీ పై లాక్ ఐకాన్ ఉన్నట్లయితే ఆ వీడియో డౌన్‌లోడింగ్‌కు అందుబాటులో లేదని గ్రహించాలి.

Best Mobiles in India

English summary
Facebook is mainly used to create new friends, connect with existing friends, share messages, videos, pictures and other useful information. It offers a convenient platform for its users to expand their social network. The site is also used by businesses to convey their messages to their target customers conveniently.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X