Google Photos లోని మొత్తం డేటాను PC / ల్యాప్‌టాప్ లో డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

గూగుల్ ఫోటోస్ ద్వారా వినియోగదారులు తమ యొక్క మధుర జ్ఞాపకాలు అయిన ఫోటోలు మరియు వీడియోలను ఆన్ లైన్ లో సేవ్ చేసుకోవడానికి వాడుతున్నారు. అయితే ఇటీవల జూన్ 1, 2021 నుండి కేవలం పరిమిత సంఖ్య వరకు మాత్రమే స్టోర్ చేసుకునే సదుపాయం కలిగి ఉన్నట్లు గూగుల్ సంస్థ ప్రకటించింది. గూగుల్ ఫోటోస్ ఇకపై ఫోటోలు మరియు వీడియోల అప్‌లోడ్ లలో ఉచితంగా అపరిమిత స్టోరేజ్ ను అందించవు. మీ ఫోటోలు మీ గూగుల్ అకౌంటుతో కేవలం 15GB వరకు మాత్రమే ఉచిత స్టోరేజ్ లో లెక్కించబడతాయి. ఇవి GMail, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్ మరియు ఇతర అన్ని రకాల గూగుల్ సర్వీసులను కలిగి ఉంటాయి.

 
How to download Google Photos Full Storage on your PC/Laptop

గూగుల్ యొక్క గూగుల్ వన్ లేదా ఆపిల్ యొక్క ఐక్లౌడ్ వంటి పేమెంట్ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ కోసం వెళ్ళడం ఒక ఎంపిక. మీరు స్టోరేజ్ కోసం ఖర్చు చేయకూడదనుకుంటే మీరు వాటిని మీ యొక్క PC / ల్యాప్‌టాప్ డ్రైవ్‌లో స్టోర్ చేయవచ్చు. గూగుల్ టేక్అవుట్ అనే టూల్ ని గూగుల్ కలిగి ఉంది. ఇది గూగుల్ ఫోటోస్ సహా గూగుల్ అకౌంట్ లలో స్టోర్ చేసిన మొత్తం డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

 

గూగుల్ ఫోటోస్ నుంచి మొత్తం డేటాను డౌన్‌లోడ్ చేసే విధానం

How to download Google Photos Full Storage on your PC/Laptop

*** ఏదైనా బ్రౌజర్ నుండి 'takeout.google.com' ని సందర్శించడం ద్వారా గూగుల్ టేక్అవుట్ ను ఓపెన్ చేయవచ్చు.

*** గూగుల్ అకౌంట్ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వండి.

*** తరువాత 'డీ-సెలెక్ట్' ఎంపిక మీద క్లిక్ చేయండి.

*** ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి గూగుల్ ఫొటోస్ ఎంపిక ముందు గల చెక్‌బాక్స్‌ ఎంపికను ఎంచుకోండి.

*** గూగుల్ ఫోటోలు ఎంపిక కింద, వినియోగదారులు ఏ ఫార్మాట్లలో ఎక్సపోర్ట్ చేయాలో తనిఖీ చేయడానికి 'మల్టిపుల్ ఫార్మాట్స్' ఎంపికపై క్లిక్ చేయవచ్చు.

*** అప్పుడు వినియోగదారులు ఎక్సపోర్ట్ చేయడానికి నిర్దిష్ట ఆల్బమ్‌లను లేదా 'అన్ని ఫోటో ఆల్బమ్‌లు' ఎంపికపై క్లిక్ చేసి నిర్దిష్ట ఆల్బమ్‌లను ఎంచుకోవచ్చు.

*** మీరు ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత అన్ని వైపులా స్క్రోల్ చేసి నెక్స్ట్ స్టెప్ బటన్‌పై క్లిక్ చేయండి.

*** అండర్ డెలివరీ పద్ధతి ఎంపికలో, 'ఇమెయిల్ ద్వారా డౌన్‌లోడ్ లింక్ పంపండి' ఎంపికను ఎంచుకోండి.

*** అండర్ ఫ్రీక్వెన్సీ, ఎక్సపోర్ట్ ఎంపికను ఒకసారి ఎంచుకోండి.

*** కింద భాగంలో ఫైల్ టైప్ & సైజు, .zip ఎంపికను ఎంచుకోండి. అలాగే 2GB నుండి 50GB వరకు కావలసిన డౌన్‌లోడ్ పరిమాణాన్ని ఎంచుకోండి. ఎంచుకున్న పరిమాణం కంటే పెద్ద ఫైల్‌లు స్వయంచాలకంగా ప్రత్యేక డౌన్‌లోడ్‌లుగా విభజించబడతాయి.

*** ఇది పూర్తయిన తర్వాత క్రీయేట్ ఎక్సపోర్ట్ బటన్ పై క్లిక్ చేయండి.

Best Mobiles in India

English summary
How to download Google Photos Full Storage on your PC/Laptop

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X