Home
How to

Instagram స్టోరీస్‌లోని ఫోటోలు, వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ప్రజలు తమ యొక్క ఫోటోలు, వీడియోలు మరియు అశాశ్వత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలను షేర్ చేసే సోషల్ మీడియా యాప్ లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది కొన్ని ఆసక్తికరమైన విషయాలను స్టోరీల రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని రకాల పోస్టులు ఎంతో ఆసక్తికరంగా ఉండి మళ్ళి మళ్ళి చూడటానికి ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయాలనుకుంటారు.

ఇన్‌స్టాగ్రామ్‌

ఇన్‌స్టాగ్రామ్‌లోని వీడియోలు, స్టోరీలు మరియు ఫోటోలను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చాలా మందికి తెలియకపోవచ్చు. సాధారణంగా ఇతరులు పోస్ట్ చేసిన వీడియోలు, స్టోరీలు మరియు ఫోటోలను డౌన్‌లోడ్ చేసి సేవ్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్‌ మిమ్మల్ని అనుమతించదు. శుభవార్త ఏమిటంటే ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ యొక్క స్టోరీలను కూడా ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు నచ్చినవి ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఇన్‌స్టాగ్రామ్‌-- డౌన్‌లోడ్

ఇన్‌స్టాగ్రామ్‌-- డౌన్‌లోడ్

ఇన్‌స్టాగ్రామ్‌ కు సంబంధించి ఏదైనా డౌన్‌లోడ్ చేసుకునే ముందు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. అప్‌లోడ్ చేసేవారి అనుమతి లేకుండా ఇన్‌స్టాగ్రామ్ నుండి ఏదైనా డౌన్‌లోడ్ చేయకుండా ఉండమని మేము మిమ్మల్ని కోరుతున్నాము. మీరు పబ్లిక్ అకౌంటుల నుండి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలు మరియు స్టోరీలను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు, స్టోరీలు మరియు ఫోటోలను డౌన్‌లోడ్ చేయడానికి మీరు ఎప్పుడైనా ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో స్క్రీన్‌షాట్‌లు లేదా స్క్రీన్ రికార్డింగ్‌లు తీసుకోవచ్చు. కాని ఇది ఆ ఫైళ్ళను వాటి అసలు రిజల్యూషన్‌లో సేవ్ చేయవని గుర్తుపెట్టుకోండి.

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు

మీరు ప్రైవేట్ అకౌంటుల నుండి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు మరియు వీడియోలను డౌన్‌లోడ్ చేయాలనుకునే అవకాశం లేదు. ఎవరిదైనా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్‌గా ఉంచుకోవడానికి ఎదో ఒక కారణం ఉంటుంది. అటువంటి వారి ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు లేదా స్టోరీలను డౌన్‌లోడ్ చేయడానికి మార్గాలు ఉన్నప్పటికీ ఆ మార్గంలో వెళ్ళకుండా ఉండటం చాలా మంచిది. ఈ యాప్ లు మీ స్మార్ట్‌ఫోన్ యొక్క గోప్యతను ప్రమాదంలో పడేస్తాయి. ఈ యాప్ లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఉచితం అయినప్పటికీ ఇవి కొన్ని టన్నుల ప్రకటనలతో వస్తాయి.

 

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలో కింద ఉన్న ఈ పద్దతులను పాటించండి. స్టోరీస్‌లు డౌన్‌లోడ్ కావడానికి అవి పబ్లిక్ అకౌంట్ నుండి పోస్ట్ చేయబడి ఉండాలి.


1. మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో www.storiesig.com ను ఓపెన్ చేయండి. మీరు స్టోరీస్‌లను డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న ప్రొఫైల్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌పేరును ఎంటర్ చేసి ఎంటర్ నొక్కండి.

2. తరువాత సెర్చ్ పట్టీ క్రింద క్రియాశీల స్టోరీస్‌ల జాబితాను చూస్తారు. అదనంగా మీరు హైలైట్‌లుగా సేవ్ చేసిన గత స్టోరీస్‌లను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే కూడా మీరు క్రిందికి స్క్రోల్ చేయవచ్చు.

3. ఇప్పుడు స్టోరీస్‌ > క్రిందికి స్క్రోల్ చేసి మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న ఫోటో లేదా వీడియోను ఎంచుకోండి> డౌన్‌లోడ్ బటన్ మీద నొక్కండి.

4. మీ డౌన్‌లోడ్ పూర్తయిన తర్వాత మీ ఫైల్ మీ డివైస్ లో స్వయంచాలకంగా సేవ్ చేయబడుతుంది.

 

Best Mobiles in India

English summary
How to Download Instagram Stories and Videos in Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X