Instagram వీడియోలను మీ స్మార్ట్‌ఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

|

ఆన్‌లైన్ ఫోటో షేరింగ్ విభాగంలో అగ్రగామి యాప్‌గా గుర్తింపుతెచ్చుకన్న ఇన్‌స్టాగ్రామ్‌కు కొత్త కస్టమర్‌ల తాకిడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. సెప్టంబర్ 2017లో టెక్‌క్రంచ్ రివీల్ చేసిన పలు రిపోర్ట్స్ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ సేవలను ప్రతి నెలా 80 కోట్ల మంది వినియోగించుకుంటున్నారు. ఇక యాక్టివ్ యూజర్ల విషయానికి వచ్చేసరికి ప్రతి రోజు ఈ యాప్‌ను 50 కోట్ల మంది యాక్టివ్‌గా వినియోగించుకుంటున్నట్లు ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.ఇన్‌స్టాగ్రామ్ ఆఫర్ చేస్తోన్న సర్వీసులు భారీ పాపులారిటీని సొంతం చేసుకున్నప్పటికి కొన్ని లోపాలు మాత్రం యూజర్లను విసిగిస్తూనే ఉన్నాయి.

 
Instagram వీడియోలను మీ స్మార్ట్‌ఫోన్లోకి డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..

ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ అలానే ఫోటోస్ డౌన్‌లోడ్ విషయంలో నెలకున్న సందిగ్థత పలువురిని తీవ్రంగా వేధిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ విధించిన ప్రైవసీ నిబంధనలు కారణంగా ఈ యాప్‌లో ఇతరులు పోస్ట్ చేసే కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలుండదు. అయితే ఓ చిన్న ట్రిక్‌ను అప్లై చేయటం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌ను మీమీ స్మార్ట్‌ఫోన్‌లలోకి భేషుగ్గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

స్టెప్ 1 :
మీరు ఆండ్రాయిడ్ యూజర్ అయినట్లయితే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి FastSave for Instagram అనే యాప్‌ను మీమీ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తరువాత ఫోన్‌లో స్టోర్ అయిన ఫోటోస్ ఇంకా మీడియా ఫైల్స్‌ను యాప్ యాక్సెస్ చేసుకునేందుకు పర్మిషన్ ఇవ్వవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల FastSave యాప్‌కు సంబంధించి ఓ పత్ర్యేకమైన ఫోల్డర్ క్రియేట్ కాబడి డేటా మొత్తం అక్కడే డౌన్‌లోడ్ అవుతుంది.

స్టెప్ 2 :
ఇన్‌స్టాల్ అయిన FastSave for Instagram యాప్‌ను మొదటి సారిగా రన్ చేసిన వెంటనే హోమ్ స్ర్కీన్ పై ల్యాండ్ అవటం జరుగుతుంది. ఈ స్ర్కీన్ పై కనిపించే స్విచ్‌ను ఎనేబుల్ చేసేుకున్నట్లయితే FastSave ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. ఈ స్విచ్‌ను ఆన్ చేసిన వెంటనే పలు సూచనలు స్ర్కీన్ పై ప్రత్యక్షమవుతాయి. వీటిని అనుసరించటం ద్వారా ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లోకి యూజర్ డైవర్ట్ కాబడతారు.

భారత ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు, H1-B visaపై ట్రంప్ కఠిన నిర్ణయం !భారత ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు, H1-B visaపై ట్రంప్ కఠిన నిర్ణయం !

స్టెప్ 3

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లోకి వెళ్లిన తరువాత, మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటోన్న పోస్ట్‌కు సంబంధంచి టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే More options ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో Copy Link ఆప్షన్ పై టాప్ చేసినట్లయితే ఆ పోస్టుకు సంబంధించి యూఆర్‌ఎల్ క్లిప్‌బోర్డ్ పైకి కాపీ కాబడుతుంది. ఆ తరువాత FastSave యాప్ ఆ పోస్ట్ బ్యాక్‌‌గ్రౌండ్‌లో ఉన్న కంటెంట్‌ను ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ చేసేస్తుంది.

స్టెప్ 4
డౌన్‌లోడ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులను యాక్సిస్ చేసుకోవాలంటే ఫైల్ మేనేజర్‌లోకి వెళ్లి InstaSave అనే ఫోల్డర్‌ను ఓపెన్ చేస్తే సరిపోతుంది.

పాఠకులకు ముఖ్యమైన గమనిక...
ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసేముందు మీరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు పెట్టుకోవల్సి ఉంటుంది. అదేంటంటే, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఎటువంటి అఫీషియల్ మార్గాలు అందుబాటులో లేవు. అయితే పలు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ ప్రొసీజర్‌ను పూర్తి చేయవల్సి ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
But in spite of such popularity, Instagram users are often seen complaining about some of the platform’s inabilities and lack of features such as allowing users to download Instagram photos and videos within their official app, which in fact is a great measure for protecting individual’s privacy and property.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X