స్వ‌యంగా మొబైల్ ద్వారా PAN Card డౌన్‌లోడ్ చేసుకోవ‌డం ఎలా !

|

ఇటీవ‌లి రోజుల్లో ప్ర‌తి భార‌తీయుడికి PAN Card(ప‌ర్మెనెంట్ అకౌంట్ నంబ‌ర్‌) అనేది త‌ప్ప‌నిస‌రిగా మారింది. బ్యాంకు లావాదేవీల ప్ర‌క్రియ‌లో భాగంగా అంద‌రూ త‌మ ఖాతాల‌కు పాన్ కార్డును లింక్ చేసుకోవ‌డం జ‌రుగుతుంది. ఈ ఆల్ఫా న్యూమరిక్ పాన్ నంబ‌ర్ ద్వారా ప్ర‌భుత్వానికి ప్ర‌తి ఒక్క‌రి లావాదేవీల‌కు సంబంధించిన వివ‌రాల్ని ట్రాక్ చేయ‌డానికి సులువుగా ఉంటుంది. అయితే, ఈ Pan Cardకు సంబంధించి డౌన్‌లోడ్ చేసుకునే ప్ర‌క్రియ తెలియ‌క చాలా మంది ఇబ్బందులు ప‌డుతుంటారు. కానీ, ఆన్‌లైన్ వేదిక‌గా అది డౌన్‌లోడ్ చేసుకోవ‌డం చాలా సులువు.. అందుకోసం చేయాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం.

pan card download

Pan Card డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్
* ముందుగా ప్ర‌భుత్వ ఇన్‌కం ట్యాక్స్ విభాగానికి చెందిన NSDL అధికారిక‌ వెబ్‌సైట్ లింక్ (https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html) లోకి వెళ్లాలి.
* ఆ లింక్‌లోకి ఎంట‌ర్ అయిన త‌ర్వాత పేజీలో మీకు రెండు ఆప్ష‌న్‌లు క‌నిపిస్తాయి. అక్నాలెడ్జ్‌మెంట్ నంబ‌ర్ లేదా పాన్ నంబ‌ర్ అని ఉంటాయి. అందులో పాన్ నంబ‌ర్ అనే ఆప్ష‌న్ ను ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత మీ పాన్ నంబ‌ర్, ఆధార్ నంబ‌ర్‌, పుట్టిన నెల‌, సంవ‌త్స‌రం వివ‌రాలు అడుగుతూ ఓ పేజీ ఓపెన్ అవుతుంది. వాటిలో మొద‌ట పాన్ నంబ‌ర్ అని సూచించే బాక్సులో ప‌ది డిజిట్స్ ఆల్ఫా న్యూమ‌రిక్ పాన్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. దాని కింది ఉండే మ‌రో బాక్సులో 12 అంకెల ఆధార్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి.
* అనంత‌రం మ‌రో బాక్సులో మీ పుట్టిన నెల‌, సంవ‌త్స‌రం ఎంపిక చేసుకుని, క్యాప్చా కోడ్ టైప్ చేయాలి.
* ఆ త‌ర్వాత వివ‌రాలన్నీ స‌రిగా ఎంట‌ర్ చేశారో లేదో చెక్ చేసుకుని స‌బ్‌మిట్ బ‌ట‌న్ నొక్కాలి.
* స‌బ్‌మిట్ చేసిన త‌ర్వాత మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఒక ఓటీపీ వ‌స్తుంది. ఆ ఓటీపీ ని ఎంట‌ర్ చేసి వ్యాలిడేట్ చేయాలి.
* ఆ త‌ర్వాత ఏదైనా ఫార్మాట్‌పై క్లిక్ చేయ‌డం ద్వారా పాన్‌కార్డు డౌన్‌లోడ్ చేయబడుతుంది.
* అయితే, మీ పాన్ కార్డ్ పాతదైతే, మీరు దీన్ని డౌన్‌లోడ్ చేయడానికి రూ.8.26 చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.

pan card download

మ‌రో ప్రాసెస్ ద్వారా కూడా పాన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు:
* ముందుగా ప్ర‌భుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను (https://www.pan.utiitsl.com/PAN_ONLINE/ePANCheckCard.action) క్లిక్ చేయాలి.
* అనంత‌రం మీ పాన్ నంబ‌ర్‌, పుట్టిన నెల‌, సంవ‌త్స‌రం ఇత‌ర వివ‌రాల కోరుతూ ఓ పేజీ ఓపెన్ అవుతుంది.
* అందులో సైట్ కోరిన వివ‌రాల‌ను టైప్ చేసి, కింది భాగంలో ఉండే క్యాప్చా కోడ్ కూడా ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి.
* ఆ త‌ర్వాత మీ మొబైల్ లేదా ఈ మెయిల్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ నొక్కాలి.
* ఇప్పుడు మీ పాన్ కార్డ్ ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. మీ పాన్ కార్డ్ పాతదైతే, మీరు దీన్ని డౌన్‌లోడ్ చేయడానికి రూ.8.26 చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.
* అయితే ప్ర‌స్తుతం ఈ ప్ర‌క్రియ‌ను ఐటీ విభాగం నిలిపివేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా.. మ‌రో విష‌యం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పాన్ కార్డు ఫైల్ మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ అయిన త‌ర్వాత దాన్ని మీరు ఓపెన్ చేడానికి పాస్ వ‌ర్డ్ అడుగుతుంది. ఆ పాస్‌వ‌ర్డ్ ఏదో అని మీరు దిగులు చెందాల్స‌న ప‌ని లేదు. ఆ ఫైల్ ఓపెన్ చేయ‌డానికి పాస్‌వ‌ర్డ్‌గా మీ పుట్టిన తేదీ, నెల‌, సంవ‌త్స‌రం (DDMMYYYY) ఫార్మాట్‌లో అంకెలు క్లిక్ చేయాల్సి ఉంటుంది.

pan card download

అదేవిధంగా ఆన్‌లైన్‌లో సిబిల్ స్కోరు ఎలా చూసుకోవాలో కూడా తెలుసుకుందాం:
మీరు ఇల్లు లేదా కారు కొనాలనుకుంటున్నారా? మీ వద్ద దానికి సరిపోయే అంత డబ్బులు లేకపోతే కనుక లోన్ పొందడం కోసం తరచుగా బ్యాంకుని ఆశ్రయిస్తారు. అయితే బ్యాంకుకు వెళ్లే ముందు CIBIL స్కోర్‌ని చూసుకోవడం ఉత్తమం. CIBIL క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (ఇండియా) లిమిటెడ్ అని అర్థం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదించిన ఏజెన్సీ. ఇది వినియోగదారులు చేసే జాబ్స్ మరియు వ్యాపారంని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క క్రెడిట్ నివేదికలు మరియు స్కోర్‌లను అందిస్తుంది. ఇప్పుడు ఆ సిబిల్ స్కోరు ఎలా తెలుసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం.

CIBIL స్కోర్‌ను ఆన్‌లైన్‌లో తనిఖీ చేసే విధానం
స్టెప్ 1: ముందుగా అధికారిక CIBIL వెబ్‌సైట్ (https://www.cibil.com/)కి వెళ్లండి.
స్టెప్ 2: 'మీ CIBIL స్కోర్ పొందండి' ఎంపికను ఎంచుకోండి.
స్టెప్ 3: క్రిందికి స్క్రోల్ చేసి FAQ విభాగాన్ని ఎంచుకోండి. CIBIL క్రెడిట్ రిపోర్ట్ పొందడానికి నేను ఎంత చెల్లించాలి అని చెప్పే చివరి ప్రశ్నపై క్లిక్ చేయండి?
స్టెప్ 4: ఇక్కడ ఉచిత CIBIL క్రెడిట్ రిపోర్ట్ ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 5: తరువాత ఓపెన్ అయ్యే పేజీలో మీ ఫ్రీ CIBIL స్కోర్ ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 6: తెరుచుకునే పేజీలో మీకు ఇప్పటికే అకౌంట్ లేకుంటే కనుక ముందుగా మీరు కొత్త అకౌంటును సృష్టించాలి. పేజీలో మీ పేరు, మీ ఇమెయిల్ చిరునామా, మీరు ఉపయోగించాలనుకుంటున్న ID మరియు మీ మొబైల్ నంబర్ వంటి వివరాలను పూరించండి. మీరు మీ పాన్, పాస్‌పోర్ట్ నంబర్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ లేదా రేషన్ కార్డ్ నంబర్‌ను ఉపయోగించవచ్చు.
స్టెప్ 7: మీరు ఈ వివరాలన్నింటినీ నమోదు చేసిన తర్వాత 'అంగీకరించు' మరియు 'కొనసాగించు' ఎంపికలపై క్లిక్ చేయండి.
స్టెప్ 8: ఇప్పుడు మీ యొక్క వివరాలను ధృవీకరించడానికి మీ మొబైల్ నంబర్‌కు అందుకున్న OTPని టైప్ చేసి ఆపై 'కొనసాగించు' బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 9: ఇప్పుడు 'గో టు డాష్‌బోర్డ్' ఎంపికను ఎంచుకుని మీ క్రెడిట్ స్కోర్‌ను తనిఖీ చేయండి.
స్టెప్ 10: ఇప్పుడు మీరు myscore.cibil.com అనే వెబ్‌సైట్‌కి మళ్లించబడతారు.
స్టెప్ 11: ఇప్పుడు మెంబర్ లాగిన్ ఎంపికపై క్లిక్ చేయండి.
స్టెప్ 12: మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. లాగిన్ అయిన తరువాత మీ CIBIL స్కోర్ డాష్‌బోర్డ్‌లో చూపబడుతుంది.

Best Mobiles in India

English summary
How to download a PAN card through online

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X