ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

వీడియోలు చూడటమనేది అనేది నేటి ఆన్‌లైన్ కార్యకలాపాల్లో ఓ భాగంగా మారిపోయింది. తాజాగా విడుదలైన గణంకాల ప్రకారం.. ప్రతి 10 మందిలో 6గురు ఆన్‌లైన్ వీడియోలను రకరకాల మాద్యమాల ద్వారా వీక్షిస్తున్నారట. ప్రతి 60 సెకన్లకు 400 గంటల నిడివి గల వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ కాబడుతోందట.

ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

సగటు యూజర్ ఒక్కో సెషన్‌కు 40 నిమిషాల సమయాన్ని యూట్యూబ్ వీడియోలను వీక్షించేందుకు కేటాయిస్తున్నాడట. ఇక్కడ మనం ఒక్క యూట్యూబ్ గురించే చర్చించుకుంటున్నాం. యూట్యూబ్ తరహాలోనే డజన్ల కొద్ది వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు మార్కెట్లో హల్‌చల్ చేస్తేన్నాయి. వీటిలో కూడా లక్షల సంఖ్యలో వీడియోలు అ‌ప్‌లోడ్ అవుతున్నాయి. చూసిన వీడియోలనే మళ్లీ మళ్లీ చూసేందుకు Internet డేటాను వేస్ట్ చేసుకోకుండా, సులువైన పద్ధతిలో ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకునే విధానాన్ని స్టెప్ బై స్టైప్ గైడ్ రూపంలో మీకు వివరిస్తున్నాం...

ఎలాంటి వెబ్‌సైట్ నుంచైనా వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

స్టెప్ 1

ముందుగా jdownloader అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి JDownloader 2 అనే ప్రోగ్రామ్ ఫైల్‌ను మీ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేయండి.

స్టెప్ 2

ప్రోగ్రామ్ విజయవంతంగా ఇన్‌స్టాల్ అయిన వెంటనే మీరు ఎక్కడి నుంచి వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆ వెబ్‌‌సైట్‌కు వెళ్లండి.

స్టెప్ 3

ఆ వెబ్‌‌సైట్‌లోకి వెళ్లిన తరువాత మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్న వీడియోకు సంబంధించి URLను కాపీ చేసుకుని, JDownloader 2 ప్రోగ్రామ్‌లో పేస్ట్ చేయండి.

స్టెప్ 4

ఇప్పుడు JDownloader 2 ప్రోగ్రామ్ ఆటోమెటిక్‌గా ఆ లింక్‌ను గుర్తించి, ఆ వీడియోను డౌన్‌లోడ్ చేసేస్తుంది. ఆ వీడియోలను మీకు కావల్సిన చోట స్టోర్ చేసుకుని ఎన్ని సార్లు అయినా చూసుకోవచ్చు.

English summary
How to download a streaming video from any website. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting