యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా??
ఇండియా యొక్క కేంద్రప్రభుత్వం తన 2021-22 సంవత్సరం యొక్క బడ్జెట్ ను ఉదయం 11:00 గంటలకు ప్రవేశపెట్టింది. ఈ సారి బడ్జెట్ ను పూర్తిగా కాగిత రహితంగా పూర్తిగా డిజిటల్ ప్రక్రియలో అందించడం ఇదే మొదటిసారి. ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారుల కోసం యూనియన్ బడ్జెట్ యాప్ అనే ప్రత్యేక యాప్ ను ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్ వినియోగదారులకు బడ్జెట్ సంబంధిత సమాచారం మరియు కొన్ని పత్రాలను యాక్సెస్ చేయడంలో సహాయపడుతుంది. దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) తో పాటు ఆర్థిక వ్యవహారాల విభాగం (DEA) అభివృద్ధి చేసింది.

యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ ద్వారా బడ్జెట్ మీద ఆసక్తిగల వినియోగదారులు 14 రకాల యూనియన్ బడ్జెట్ డాక్యుమెంట్ ల విషయాలను తెలుసుకోవడానికి వారికి యాక్సిస్ ను అందిస్తుంది. ఈ డాక్యుమెంట్ లలో వార్షిక ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఫైనాన్స్ బిల్లు, గ్రాంట్స్ ఫర్ గ్రాంట్స్ (DG) వంటి మరిన్ని ఉన్నాయి. పార్లమెంటులో బడ్జెట్ సమర్పించిన తర్వాత ఈ డాకుమెంట్స్ అన్ని కూడా ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయబడ్డాయి.

యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసే విధానం
స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్‌కు వెళ్ళండి.
స్టెప్ 2: తరువాత ఇందులో "యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్" అనే పదం టైప్ చేయండి.
స్టెప్ 3: తరువాత యాప్ ల జాబితా కనిపిస్తుంది. ఇందులో మీరు NIC ఇ-గోవ్ మొబైల్ యాప్ ల ద్వారా యూనియన్ బడ్జెట్ యాప్ ను ఎంచుకోవాలి.
స్టెప్ 4: స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ ను పొందడానికి ఇన్‌స్టాల్ బటన్ మీద నొక్కండి.

స్టెప్ 5: మీరు యాప్ స్టోర్ లో దీనిని కనుగొనలేకపోతే కనుక మీరు యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ www.indiabudget.gov.in కు వెళ్ళవచ్చు.
స్టెప్ 6: అక్కడ మీరు మొబైల్ యాప్ ల కోసం ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌కు దారి మళ్లించే లింక్‌లను నొక్కవచ్చు.


Click it and Unblock the Notifications