ఫేస్‌బుక్ వీడియోలు డౌన్‌లోడ్ చేయండిలా..

Written By:

మనం రోజులో ఎక్కువ భాగం గడిపేది ఫేస్‌బుక్‌లోనే అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఫేస్ బుక్ ఇప్పుడు మన దైనందిన జీవితంలో భాగమయిపోయింది. రోజు ఉదయాన్నేగుడ్ మార్నింగ్ అలాగే రాత్రికి గుడ్ నైట్ చెప్పడం షరా మాములే.అయితే ఫేస్‌బుక్‌లో రోజు కొన్ని వేల వీడియోలు మనకు కనపడుతుంటాయి. వాటిని మనం చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటాం. అయితే వాటిలో నచ్చినవి మనం డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఎలానో తెలియక కిందా మీదా పడుతుంటాం. అయితే వాటిని ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలుసుకుందాం.

Read more : సముద్రం అడుగున 25 అంతస్థుల భవనాలు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లాష్ వీడియో డౌన్లోడర్ అను ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని

ఫ్లాష్ వీడియో డౌన్లోడర్ అను ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్ ని ఉపయోగించి ఫేస్ బుక్ వీడియోలే కాకుండా యు ట్యూబ్ మరియు వివిధ వీడియో మరియు ఫ్లాష్ గేమింగ్ సైట్ల నుండి వీడియోలను, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ కోసం క్లిక్ చేయండి

వెబ్ పేజీ లోనికి వెళ్ళినపుడు బాణం గుర్తు నీలం రంగు లోకి

యాడ్ ఆన్ ఇన్ స్టాల్ చేసిన తరువాత యుఆర్ యల్ బార్ ప్రక్కన బాణం గుర్తు కనిపిస్తుంది. ఫ్లాష్ వీడియోలు గల వెబ్ పేజీ లోనికి వెళ్ళినపుడు బాణం గుర్తు నీలం రంగు లోకి మారుతుంది. అప్పుడు దాన్ని నొక్కి వీడియో డౌన్లోడ్ ని ప్రారంభించవచ్చు.

ఎటువంటి సాఫ్ట్‌వేర్ లేకుండా డౌన్ లోడ్ చేసుకోవాలంటే

ఇక ఎటువంటి సాఫ్ట్‌వేర్ లేకుండా డౌన్ లోడ్ చేసుకోవాలంటే మీరు ఏ వీడియోని డౌన్ లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో దగ్గరకు వెళ్లండి.

వీడియోని ఓ సారి ప్లే

ఆ వీడియోని ఓ సారి ప్లే చేయండి ప్లే చేసినప్పుడు మీకు పైన యూఆర్‌ఎల్ బార్‌ కనిపిస్తుంది.

యూఆర్‌ఎల్ బార్‌ www ప్లేస్‌లో mను

ఆ వీడియో ప్లే అవుతుండగా దానికి సంబంధించిన యూఆర్‌ఎల్ బార్‌ www ప్లేస్‌లో mను టైప్ చేయండి

టైప్ చేయగానే మీకు స్క్రీన్ మీద

అలా టైప్ చేయగానే మీకు స్క్రీన్ మీద మీరు డౌన్ లోడ్ చేయాలనుకున్న వీడియో ఇలా కనిపిస్తుంది.

మౌస్ మీద రైట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తే

వీడియో ప్లే అవుతున్న సమయంలో మౌస్ మీద రైట్ సైడ్ బటన్ క్లిక్ చేస్తే మీకు సేవ్ వీడియో ఆప్సన్ కనిపిస్తుంది.

ఎక్కడ సేవ్ చేయాలి అని

దాన్ని క్లిక్ చేస్తే మీకు కావలిసిన డిస్క్ లో ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది.మీరు పేరు టైప్ చేసి ఆ వీడియోని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

దాన్ని మీరు ఎప్పుడైనా

దాన్ని మీరు ఎప్పుడైనా మీకు కావలిసిన టైంలో ప్లే చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to download video from facebook without any software
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot