స్మార్ట్‌ఫోన్‌లలో ట్విట్టర్ యాప్ నుండి వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

సోషల్ మీడియా యాప్ ల వినియోగం అధికంగా ఉన్న ఈ రోజులలో ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాటిలో ట్విట్టర్ కూడా ఒకటి ఉంది. ఏదైనా ఒక టెక్స్ట్, ఫొటోస్, వీడియోలు వంటివి మరిన్ని మోడ్‌ల ద్వారా ట్వీట్‌లను పోస్ట్ చేయడం ద్వారా వినియోగదారులు తమ యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందరితో పంచుకుంటూ ఉంటారు. ఈ యాప్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో స్క్రీన్‌షాట్ లను మరియు టెక్స్ట్ కంటెంట్‌లను షేర్ చేసే ప్రసిద్ధి చెందిన ఫీచర్స్ ఉన్నప్పటికీ కూడా మీరు ట్విట్టర్ లో మాత్రమే వీడియోలను కనుగొనడానికి కూడా ఇది ప్రసిద్ధి చెందింది.

 

ట్విట్టర్

ట్విట్టర్ లో అధికంగా వైరల్ అయ్యే ఏదైనా వీడియోలను మీ స్నేహితులతో షేర్ చేయాలనుకునే సందర్భాలు అనేకం ఉండవచ్చు. కానీ స్క్రీన్‌షాట్‌లను తీసి ఫోటోలను షేర్ చేసే విధానం కాకుండా వీడియోను నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవడం మెరుగ్గా ఉంటుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లోనే ట్విట్టర్ వీడియోలను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కనుక అది ఎలా చేయాలో తెలుసుకోవడానికి కింద సూచించే విధానాలను అనుసరించండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ట్విట్టర్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే విధానం

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ట్విట్టర్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే విధానం

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లేస్టోర్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2 : తరువాత 'Tweet2gif' యాప్‌ కోసం సెర్చ్ చేసి దాన్ని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు ట్విట్టర్‌ని ఓపెన్ చేసి మీకు నచ్చిన మరియు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న వీడియో కోసం చూడండి.

స్టెప్ 4: ఇప్పుడు షేర్ బటన్‌పై క్లిక్ చేసి ఆ వీడియో లింక్‌ను అక్కడ నుండి కాపీ చేసుకోండి.

స్టెప్ 5: తరువాత 'Tweet2gif' యాప్‌ని ఓపెన్ చేసి డౌన్‌లోడ్ విభాగంలో లింక్‌ను పేస్ట్ చేయండి.

స్టెప్ 6: మీరు దీన్ని సాధారణ వీడియోగా డౌన్‌లోడ్ చేయాలనుకుంటే 'డౌన్‌లోడ్ MP4'పై క్లిక్ చేయండి లేదా లూప్‌లో ఉన్న సౌండ్ లేని వీడియోగా కావాలనుకుంటే 'డౌన్‌లోడ్ Gif'పై క్లిక్ చేయండి.

స్టెప్ 7: ఇప్పుడు ఈ వీడియో మీ ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క గ్యాలరీ/ఫోటోల యాప్‌లో సేవ్ చేయబడుతుంది.

 

ఐఫోన్‌లో ట్విట్టర్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే విధానం
 

ఐఫోన్‌లో ట్విట్టర్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే విధానం

iOS కోసం మీ ఐఫోన్ హోమ్ స్క్రీన్‌లో వెబ్ లింక్‌ను సేవ్ చేయమని మేము సిఫార్సు చేస్తున్నాము. తద్వారా మీరు ఎప్పుడైనా ట్విట్టర్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


స్టెప్ 1: మీ ఐఫోన్‌లో Safari బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: 'twittervideodownloader.com' అని టైప్ చేయండి.

స్టెప్ 3: ఇప్పుడు దిగువన ఉన్న షేర్ చిహ్నంపై నొక్కండి.

స్టెప్ 4: క్రిందికి స్క్రోల్ చేసి 'హోమ్ స్క్రీన్‌కి జోడించు' ఎంపికపై నొక్కండి.

(ఇలా చేయడంతో ఇప్పుడు వెబ్‌లింక్ మీ ఐఫోన్ హోమ్ స్క్రీన్‌లో ఉంటుంది.)

స్టెప్ 5: ఇప్పుడు ట్విట్టర్ నుండి వీడియోని డౌన్‌లోడ్ చేయడానికి వీడియో లింక్‌ని కాపీ చేసి ఆ లింక్‌కి వెళ్లండి.

స్టెప్ 6: వీడియో లింక్‌ని డౌన్‌లోడ్ విభాగంలో అతికించి 'డౌన్‌లోడ్‌పై' నొక్కండి.

స్టెప్ 7: 'డౌన్‌లోడ్ వీడియో' బటన్‌ను నొక్కి పట్టుకోండి.

స్టెప్ 8: ఇప్పుడు పాప్-అప్ వచ్చినప్పుడు డౌన్‌లోడ్ లింక్డ్ ఫైల్‌పై నొక్కండి.

స్టెప్ 9: దిగువ భాగంలో ఉన్న డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసిన వీడియోను ఓపెన్ చేయండి.

స్టెప్ 10: షేర్ బటన్‌పై నొక్కండి మరియు చివరగా సేవ్ వీడియోపై నొక్కండి.

ఇప్పుడు వీడియో మీ ఐఫోన్ ఫోటోస్ యాప్‌లో ఉంటుంది.

 

Best Mobiles in India

English summary
How to Download Videos From Twitter on your Android and ios Smartphones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X