వాట్సాప్ స్టేటస్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవటం ఎలా..?

|

ఇన్‌స్టెంట్ మెసేజింగ్ విభాగంలో అగ్రగామి సంస్థగా అవతరించిన వాట్సాప్ రోజుకో కొత్త ఫీచర్‌తో మార్కెట్‌ను ఊపేస్తోంది. ఏడాది క్రితం వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చిన స్టేటస్ అప్‌డేట్ ఫీచర్
ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. వాట్సాప్ స్టేటస్ ఫీచర్‌ను వినియోగించుకోవటం ద్వారా తమ స్టేటస్‌ను వీడియో రూపంలో పోస్ట్ చేసుకునే వీలుంటుంది. ఈ స్టేటస్ ఒక్క రోజు తరువాత మాయమైపోతుంది....

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే
స్టేటస్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుందుకు సింపుల్ ప్రొసీజర్‌..
 

స్టేటస్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుందుకు సింపుల్ ప్రొసీజర్‌..

మన వాట్సాప్ అకౌంట్‌లలో ఇతరులకు సంబంధించి రోజూ వందలాది స్టేటస్ వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. వీటిలో కొన్నింటిని మనం చాలా ఇష్టపడుతుంటాం. అయితే వీటిని ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలో మనలో చాలా మందికి తెలియదు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా వాట్సాప్ స్టేటస్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకుందుకు సిద్ధంగా ఉన్న ఓ సింపుల్ ప్రొసీజర్‌ను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది..

ఫోన్‌లను రూట్ చేయకుండా..

వాస్తవానికి మనం చూసే ప్రతి వాట్సాప్ స్టేటస్ స్టోరీ మన ఫోన్‌లోనే స్టోర్ అయి ఉంటుంది. మనం ఇతరుల వాట్సాప్ స్టోరీ పై క్లిక్ చేసిన వెంటనే ఆ స్టోరీ మీ ఫోన్‌లో దాగి ఉన్న .statuses అనే హిడెన్ ఫోల్డర్‌లోకి ఆటోడౌన్‌లోడ్ కాబడుతుంది. ఈ ఫోల్డర్‌ను అన్‌హైడ్ చేయటం ద్వారా వాట్సాప్ స్టేటస్ వీడియోలను పొందవచ్చు. ఈ ఫోల్డర్‌ను అన్‌హైడ్ చేసే క్రమంలో ఫోన్‌లను రూట్ లేదా జైల్ బ్రేక్ చేయవల్సిన అవసరం లేదు.

డౌన్‌లోడ్ చేసుకునేందుకు అనేక యాప్స్..

ఇతరుల వాట్సాప్ స్టేటస్‌లకు సంబంధించి ఫోటోస్ అనే వీడియోలను మీ గ్యాలరీలోకి డౌన్‌లోడ్ చేసుకునేందుకు అనేక యాప్స్ ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇవి అఫీషియల్ యాప్స్ కాదు. థర్డీ పార్టీ యాప్స్ మాత్రమే. ‘Story Saver for Whatsapp' అనే ఉచిత యాప్‌ను గూగుల్ ప్టే స్టోర్ నుంచి మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే యాప్ ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్‌కు కనెక్ట్ అయిపోతుంది.

 

 

యాప్ కనెక్ట్ అయిన తరువాత..
 

యాప్ కనెక్ట్ అయిన తరువాత..

యాప్ కనెక్ట్ అయిన తరువాతి నుంచి మీ డౌన్ లోడ్ చేయాలనుకుంటోన్న స్టేటస్ పై క్లిక్ చేసి టాప్ రైట్ సైడ్ కార్నర్ లో కనిపించే డౌన్ లోడ్ సింబల్ పై క్లిక్ చేసినట్లయితే ఆ స్టేటస్ వీడియో ఫోన్ గ్యాలరీలోకి డౌన్ లోడ్ అయిపోతుంది. అయితే మీరు ఏదైనా వాట్సాప్ స్టేటస్ వీడియోను డౌన్ లోడ్ చేసుకునే ముందు తప్పనిసరిగా ఆ వ్యక్తి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల ఎటువంటి కాపీరైట్ సమస్యలు తలెత్తవు.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
All the major social media platforms such as Facebook, Whatsapp and Instagram decided to have a ‘Story’ feature in their apps wherein you can easily post pictures or videos that will disappear in a day, just like how it is in Snapchat.

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more