YouTube షార్ట్ వీడియోలలో మీకు నచ్చిన వాటిని డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

ప్రపంచం మొత్తం మీద చిన్న వీడియోలకు ఆదరణ ఎక్కువ పెరిగింది. టిక్ టాక్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందో కానీ ప్రతి ఒక్కరు తీరిక సమయాలలో చిన్న వీడియోలను చూడడానికి ఇష్టపడుతున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ అయింది. కానీ దానికి ప్రత్యాన్మాయంగా అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. యూట్యూబ్ కూడా తన ప్లాట్‌ఫారమ్‌లో 2021 సంవత్సరంలో యూట్యూబ్ షార్ట్స్ పేరుతో చిన్న వీడియో ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించింది. ఈ YouTube షార్ట్స్ వీడియోలు వినియోగదారులను అమితంగా ఆకర్షించడమే కాకుండా అధికంగా ప్రజాదరణను పొందింది. ఈ విభాగంలో 60 సెకనుల వ్యవధితో చిన్న వీడియోలను చేయడానికి అనుమతిస్తుంది. టెక్నాలజీ, హాస్యం, విజ్ఞానం, డాన్స్ వంటి అనేక విభాగాలలోని వీడియోలను అప్‌లోడ్ చేయడానికి సృష్టికర్తలకు ఇది ఒక మంచి వేదిక.

How to Download Your Favorite YouTube Short Videos?

యూట్యూబ్ ప్రవేశపెట్టిన షార్ట్‌వీడియో ఎంపిక చాలా లీడ్స్‌లో ఫీచర్ చేయబడిన కారణంగా వివిధ రకాల వీడియోలను వీక్షించడం సాధ్యమవుతుంది. వినియోగదారులు కొన్నిసార్లు షార్ట్‌వీడియోలలో వీక్షించే వీడియోను డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారు. కానీ చాలా మందికి ఈ చిన్న వీడియో డౌన్‌లోడ్ గురించి తెలియదు. మొబైల్ మరియు ల్యాప్‌టాప్‌లలో యూట్యూబ్ షార్ట్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి ఆన్‌లైన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వరుసగా వెబ్‌సైట్, మొబైల్ యాప్ మరియు పీసీ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు కూడా మీకు నచ్చిన చిన్న వీడియోను డౌన్‌లోడ్ చేయడానికి కష్టపడుతుంటే కనుక డౌన్‌లోడ్ విధానాన్ని తెలుసుకోవడానికి కింద ఉన్న పద్దతులను అనుసరించండి.

వెబ్‌సైట్ ద్వారా యూట్యూబ్ షార్ట్‌వీడియోలను డౌన్‌లోడ్ చేసే విధానం

How to Download Your Favorite YouTube Short Videos?

mp4 ఫార్మాట్‌లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి Shortsnoob, 8Downloader లేదా Savetube వంటి ఆన్‌లైన్ లో సాఫ్ట్‌వేర్ టూల్స్ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్ ద్వారా YouTube షార్ట్‌వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి కింద ఉన్న దశలను అనుసరించండి.

* యూట్యూబ్ షార్ట్‌వీడియోలను ఓపెన్ చేయండి, తరువాత షేర్ బటన్‌పై క్లిక్ చేసి, లింక్‌ను కాపీ చేయండి.

* ఇప్పుడు https://shortsnoob.com/కి వెళ్లి YouTube షార్ట్ వీడియో లింక్‌ను అతికించండి.

* సెర్చ్ బటన్‌ను నొక్కండి మరియు డౌన్‌లోడ్ చేయడానికి ఇది మీకు వివిధ ఫార్మాట్‌లను చూపుతుంది.

* మీకు నచ్చిన ఫార్మాట్‌ను ఎంచుకోని 'డౌన్‌లోడ్' ఎంపిక మీద నొక్కండి. వీడియో మీ డివైస్ లో డౌన్‌లోడ్ చేయబడుతుంది.

మొబైల్ యాప్ ద్వారా యూట్యూబ్ షార్ట్ వీడియోలను డౌన్‌లోడ్ చేసే విధానం

YouTube షార్ట్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడానికి బహుళ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మేము Shorts Video Downloader యాప్‌ని ఉపయోగిస్తున్నాము. వీడియో డౌన్‌లోడ్ విధానాన్ని తెలుసుకోవడానికి కింది సూచనలను అనుసరించండి.

How to Download Your Favorite YouTube Short Videos?

* యూట్యూబ్ షార్ట్ వీడియోలను ఓపెన్ చేసి షేర్ బటన్‌పై క్లిక్ చేసి, లింక్‌ను కాపీ చేయండి.

* ఇప్పుడు Shorts Video Downloader యాప్‌ను ఓపెన్ చేసి యాప్ సెర్చ్ పట్టీలో లింక్‌ను అతికించండి.

* వీడియోను డౌన్‌లోడ్ చేసుకోవడానికి 'డౌన్‌లోడ్' బటన్‌ను క్లిక్ చేయండి. తరువాత అది డౌన్‌లోడ్ అవ్వడం ప్రారంభమవుతుంది.

* వీడియో మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ చేయబడుతుంది.

Best Mobiles in India

English summary
How to Download Your Favorite YouTube Short Videos?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X