Just In
- 8 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 10 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 13 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Youtubeలో Short వీడియోలను డౌన్‌లోడ్ చేయడం ఎలా! ఇది చదవండి!
Youtube 2021లో యూట్యూబ్ Shorts (షార్ట్ వీడియో) ఫీచర్ పరిచయం చేసింది. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్లు నిమిషం కంటే తక్కువ నిడివి ఉన్న చిన్న వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయవచ్చు. దీంతో అందరూ తక్కువ నిడివిలో ఆసక్తికర వీడియోలు అప్‌లోడ్ చేస్తుండటంతో YouTube షార్ట్ వీడియోలు క్రమంగా జనాదరణ పొందాయి. మరియు వీడియోలపై అధికంగా వ్యూస్ సంపాదించడానికి కూడా ఇదొక సులభమైన మార్గంగా ఏర్పడింది.

ఇటీవల చాలా మంది క్రియేటర్‌లు తమ చిన్న వీడియోలను టెక్, కామెడీ, నాలెడ్జ్, డ్యాన్స్ మొదలైన వివిధ విభాగాలలో షార్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే, ప్లాట్‌ఫాంపై అప్‌లోడ్ అయిన షార్ట్ వీడియోల్లో ఏదైనా మీకు నచ్చినట్లయితే.. దాన్ని మీరు ఇంటర్నెట్ లేకపోయినా చూసుకోవాలని అనుకున్నట్లయితే డౌన్‌లోడ్ చేసుకునే మార్గం కూడా ఉంది. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత, ఆ వీడియో మీ గ్యాలరీలోకి వస్తుంది. అప్పుడు మీరు ఆ షార్ట్ వీడియోను నేరుగా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ షార్ట్‌లను నిమిషాల్లో ఎలా డౌన్‌లోడ్ చేసుకునే ప్రక్రియను మేం మీకు అందిస్తున్నాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చదవి మీరు కూడా డౌన్‌లోడింగ్ నేర్చుకోండి.

అనేక వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేయవచ్చు:
YouTube షార్ట్‌లను mp4 ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసేందుకు Shortsnoob, 8Downloader లేదా Savetube వంటి అనేక ఆన్‌లైన్ టూల్స్ మరియు సాఫ్ట్‌వేర్స్ అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్ ద్వారా YouTube షార్ట్‌లను డౌన్‌లోడ్ చేయడానికి ఈ దశలను అనుసరించండి.

షార్ట్స్ డౌన్‌లోడింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్:
* ముందుగా మీకు నచ్చిన, మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న షార్ట్ వీడియో పైన షేర్ బటన్ క్లిక్ చేయాలి. అప్పుడు మీకు కాపీ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి లింక్‌ను కాపీ చేసుకోవాలి.
* ఆ తర్వాత , https://shortsnoob.com/ ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. డౌన్‌లోడ్ షార్ట్ అనే సెక్షన్‌లో లింక్‌ను పేస్ట్ చేసి సెర్చ్ బటన్ నొక్కాలి.
* దీంతో మీకు వీడియో డౌన్‌లోడ్ చేయడానికి పలు ఫార్మాట్లతో కూడిన ఒక ఆప్షన్ వస్తుంది.
* అందులో మీకు నచ్చిన ఫార్మాట్ ఎంపిక చేసుకుని డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా వీడియో మీ డివైజ్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.

అదేవిధంగా, యూట్యూబ్‌లో అశ్లీల వీడియోలు మీ పిల్లల కంట పడకుండా నియంత్రించే మార్గాన్ని కూడా తెలుసుకుందాం:
యూట్యూబ్‌లో రెస్ట్రిక్టెడ్ మోడ్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా అశ్లీల వీడియోలను మీ పిల్లల కంట పడకుండా నిరోధించవచ్చు. రెస్ట్రిక్టెడ్ మోడ్ యాక్టివేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం.

మొబైల్‌లో YouTube Restricted Mode ఎలా ఆన్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
* ముందుగా మీ మొబైల్‌లో యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేయాలి.
* ఆ తర్వాత యూట్యూబ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
* అనంతరం జనరల్ సెట్టింగ్స్‌ను ఎంపిక చేసుకోవాలి.
* జనరల్ సెట్టింగ్స్‌లో మీకు కింద భాగంలో రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆప్షన్ కనిపిస్తుంది.
* యాక్టివేట్ రెస్ట్రిక్టెడ్ మోడ్ అనే ఆప్షన్‌ను ఆన్ చేయాలి.
* ఈ ప్రక్రియ పూర్తి అయితే మీ మొబైల్ యూట్యూబ్ రెస్ట్రిక్టెడ్ మోడ్ యాక్టివేట్ అయినట్లు నిర్ధారించుకోవాలి.

డెస్క్‌టాప్‌లో YouTube Restricted Mode ఎలా ఆన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం:
* ముందుగా వెబ్ బ్రౌజర్‌లో YouTube.com అని టైప్ చేసి, యూట్యూబ్‌లోకి వెళ్లాలి.
* ఆ తర్వాత పై భాగంలో కనిపించే యువర్ ప్రొఫైల్ అనే సెక్షన్ పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత మీకు అనేక ఆప్షన్‌లు కనిపిస్తాయి. వాటిలో కింద భాగంలో రెస్ట్రిక్టెడ్ మోడ్ సెక్షన్ ఉంటుంది.
* ఆ రెస్ట్రిక్టెడ్ మోడ్ సెక్షన్‌లోకి వెళ్లాలి.
* అనంతరం రెస్ట్రిక్టెడ్ మోడ్ యాక్టివేట్ చేయడానికి మీకో ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే రెస్ట్రిక్టెడ్ మోడ్ ఆన్ అవుతుంది.
* ఈ ప్రక్రియ పూర్తి అయితే మీ డెస్క్‌టాప్‌లో యూట్యూబ్ రెస్ట్రిక్టెడ్ మోడ్ యాక్టివేట్ అయినట్లు నిర్ధారించుకోవాలి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470