ఇంటర్నెట్ తో పనిలేకుండా యూట్యూబ్ వీడియోలను వీక్షించటం ఎలా..?

|

ఇంటర్నెట్ అందుబాటులో లేని ప్రాంతాలకు వెళ్లినపుడు యాప్ సర్వీసులను వినియోగించుకోవటం అనేది దాదాపుగా కష్టతరంగా మారిపోతుంది. ముఖ్యంగా రోజు యూట్యూబ్ వీడియోలను చేసే అలవాటు ఉన్న వారికి ఈ సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది పెద్ద సమస్యేమి కాదు. కొన్ని సింపుల్ టిప్స్ ను పాటించటం ద్వారా ఇంటర్నెట్‌తో పనిలేకుండా యూట్యూబ్ వీడియోలను వీక్షించవచ్చు. ఆ

ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆండ్రాయిడ్ యూజర్లకు..

ఆండ్రాయిడ్ యూజర్లకు..

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని యూట్యూబ్ యాప్‌ను ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ అయిన తరువాత మీకు కావల్సిన వీడియోను ఓపెన్ చేయండి. వీడియో ఓపెన్ అయిన తరువాత క్రింద భాగంలో Share, Download , Add to పేర్లతో మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి వాటిలో డౌన్‌లోడ్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే వీడియో డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ కాబడిన వీడియోలను ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ‌న్‌లైన్‌లో వీక్షించవచ్చు. అయితే, ఈ డౌన్‌లోడింగ్ సదుపాయాన్ని కేవలం కొద్ది వీడియోలకు మాత్రమే యూట్యూబ్ కల్పిస్తోంది.

విండోస్, మ్యాక్ ఇంకా లైనక్స్ డివైసుల్లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?
 

విండోస్, మ్యాక్ ఇంకా లైనక్స్ డివైసుల్లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

Windows, macOS ఇంకా Linux ఆధారిత డివైసుల్లో యూట్యూబ్ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే 4K Video Downloader అనే యాప్‌ను మీమీ డివైసుల్లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ యాప్ కావల్సిన రిసల్యూషన్ క్వాలిటీలో వీడియోలను డౌన్‌లోడ్ చేసి పెడుతుంది. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు చూద్దాం..

ముందుగా 4K Video Downloader యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఇన్ స్టాల్ అయిన తరువాత యూట్యూబ్ వీడియోకు సంబంధించిన యూఆర్ఎల్ ను కాపీ చేసుకుని యాప్ లో పోస్ట్ చేయాలి. తదుపరి స్టెప్ లో భాగంగా రిసల్యూషన్ ను ఎంపిక చేసుకుని Download బటన్ పై క్లిక్ చేసినట్లయితే వీడియో డౌన్ లోడ్ కాబడుతుంది.

మెగా సేల్స్‌తో దూసుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్మెగా సేల్స్‌తో దూసుకొస్తున్న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్

వెబ్ బ్రౌజర్ ద్వారా యూట్యూబ్ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?

వెబ్ బ్రౌజర్ ద్వారా యూట్యూబ్ వీడియోలను డౌన్ లోడ్ చేసుకోవాలంటే..?

ముందుగా VDYouTube అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్‌లోకి వెళ్లిన తరువాత యూట్యూబ్ వీడియోకు సంబంధించిన యూఆర్ఎల్ లింక్‌ను సంబంధిత కాలమ్‌లో పేస్ట్ చేసి GO బటన్ పై క్లిక్ చేయండి. ఆ తరువాత red Download బటన్ పై క్లిక్ చేసి వీడియో ఫార్మాట్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

Best Mobiles in India

Read more about:
English summary
If you’re travelling to a place with no Internet, it’s going to be difficult to get your daily YouTube fix. That’s just one of the many reasons why you might want to download YouTube videos.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X