వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో ఫోటో ఎడిటర్ ద్వారా ఫోటోలను సవరించడం ఎలా??

|

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వెబ్ వినియోగదారుల కోసం కొత్తగా కొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టింది. టెక్ దిగ్గజం ఇటీవల మొబైల్ యాప్ కోసం రెండు కొత్త ఫీచర్లను జోడించినట్లు ప్రకటించింది. అలాగే వెబ్ వెర్షన్ కోసం కూడా ఒక కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ ఇన్‌స్టంట్ మెసేజ్ యాప్ డెస్క్‌టాప్ ఎడిటర్, స్టిక్కర్ సజెషన్ మరియు లింక్ ప్రివ్యూ ఎంపికను జోడించింది.

 

కొత్త ఫీచర్‌

ఈ కొత్త ఫీచర్‌లతో వినియోగదారులు డెస్క్‌టాప్‌లోనే ఫోటోలను సవరించగలరు. అంతేకాకుండా ప్లాట్‌ఫారమ్‌లోని లింక్ ప్రివ్యూలను చూడగలరు మరియు సంభాషణ సమయంలో యాప్ స్టిక్కర్ సజెషన్లను సూచిస్తుంది. మెరుగైన అనుభవాన్ని అందించడానికి గత కొన్ని నెలలుగా కొన్ని ఫీచర్లను జోడించేందుకు వాట్సాప్ వెబ్‌లో మార్పులు చేసినట్లు వాట్సాప్ తెలిపింది.

డెస్క్‌టాప్ ఫోటో ఎడిటర్

డెస్క్‌టాప్ ఫోటో ఎడిటర్

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ యొక్క వెబ్ వెర్షన్‌కు మీడియా ఎడిటర్ ఫీచర్‌ను జోడించింది. ఇప్పటి వరకు ఎవరైనా ఇమేజ్‌లను ఎడిట్ చేయాలనుకుంటే యాప్ మొబైల్ వెర్షన్‌లో మాత్రమే ఇది సాధ్యమయ్యేది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా తమ కంప్యూటర్ లేదా వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లో కూడా ఫోటోలను తమకు నచ్చినట్లు సవరించి తమ ప్రియమైన వారికి పంపవచ్చు. డెస్క్‌టాప్ ఫోటో ఎడిటర్ ఫీచర్ డెస్క్‌టాప్ యాప్ సహాయంతో ఫోటోలను పంపే ముందు వాటిని ఎడిట్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తుంది. ఇంతకు ముందు ఈ పనిని పెయింట్ లేదా మరేదైనా ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌తో చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారులు స్టిక్కర్లను కూడా మరింత సులభంగా జోడించవచ్చు. ఇప్పటి వరకు ఈ ఫీచర్ ఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే ఇప్పుడు వెబ్ వెర్షన్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది.

ఉపయోగించే విధానం
 

ఉపయోగించే విధానం

** ముందుగా టెక్స్ట్ ఫీల్డ్‌లోని కెమెరా గుర్తు మీద క్లిక్ చేయండి.

** ఇందులో కొత్త ఫోటో లేదా వీడియో ఎంపికను ఎంచుకోండి.

** మీరు మీ యొక్క సిస్టంలో ఇప్పటికే ఉన్న ఫోటో మరియు వీడియోను కూడా ఎంచుకోవచ్చు.

** మీరు ఫోటో మరియు వీడియోకు ఏమి జోడించాలనుకుంటున్నారో ఎంచుకోండి.

 

డెస్క్‌టాప్ యాప్ సహాయంతో ఫోటో ఎడిటర్ డ్రా చేసే విధానం

డెస్క్‌టాప్ యాప్ సహాయంతో ఫోటో ఎడిటర్ డ్రా చేసే విధానం

** స్క్రీన్ పైభాగంలో ఉన్న డ్రా విభాగం మీద క్లిక్ చేయండి.

** ఫ్రీహ్యాండ్ డ్రాయింగ్‌లను రూపొందించడానికి మీరు ఇప్పుడు మీ వేలిని ఉపయోగించవచ్చు.

** కలర్ ను ఎంచుకోవడానికి మీ ఫింగర్ ని పైకి క్రిందికి స్లైడ్ చేయండి.

** ఇప్పుడు మీరు గీసే దేనికైనా కలర్ ను ఎంచుకోవచ్చు.

 

స్టిక్కర్లు లేదా ఎమోజీలను జోడించే విధానం

స్టిక్కర్లు లేదా ఎమోజీలను జోడించే విధానం

** స్టిక్కర్ లేదా ఎమోజి ఎంపికపై క్లిక్ చేయండి.

** మీరు ఉపయోగించాలనుకుంటున్న లేదా పంపాలనుకుంటున్న స్టిక్కర్‌పై నొక్కండి.

** అంశాన్ని తరలించడానికి మరియు లాగడానికి దాన్ని పట్టుకుని నొక్కండి

** మీరు దాన్ని చిన్నగా లేదా పెద్దదిగా చేయడానికి లోపలికి లేదా బయటకి చిటికెడు చేయవచ్చు

 

Best Mobiles in India

English summary
How To Edit Photos Through Photo Editor In Whatsapp Web Version

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X