మీ ఫోన్‌లో ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ పొందటం ఎలా..?

ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ పేరుతో సరికొత్త సదుపాయాన్ని గూగుల్ సంస్థ ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సర్వీసును తొలిగా గూగుల్ I/O 2016 డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో అనౌన్స్ చేసినప్పటికి రోల్ అవుట్ ప్రక్రియ మాత్రం నత్తనడకన సాగింది.

Read More : మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఇక మరింత సులభతరం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెస్టింగ్స్ అలానే అప్‌డేట్స్ అనంతరం

అనేక టెస్టింగ్స్ అలానే అప్‌డేట్స్ అనంతరం ఈ సర్వీసును జూన్‌లో నిర్వహించిన గూగుల్ I/O 2017 డెవలపర్స్ కాన్ఫిరెన్స్‌లో భాగంగా గూగుల్ అఫీషియల్‌గా లాంచ్ చేసింది. జూన్ నుంచి ఇప్పటి వరకు ఈ ఇన్‌స్టెంట్ యాప్స్ 50 కోట్ల ఆండ్రాయిడ్ డివైస్‌లకు చేరినట్లు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ గురించి క్లుప్తంగా...?

ఇంతకాలం ఆండ్రాయిడ్ యూజర్లు ఏదైనా యాప్ లేదా గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్‌కు వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవల్సి వచ్చేది. ఇక పై అలా చేయకుండా ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ సర్వీస్‌ను మీమీ ఫోన్‌లలో ఎనేబుల్ చేసుకున్నట్లయితే సంబంధిత యాప్స్ నేరుగా గూగుల్ సర్వర్ నుంచే మీ డివైస్‌లో రన్ అవుతాయి. దీంతో ప్రతి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవల్సిన అవసరం ఉండదు. ఇదే సమయంలో ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ పై కూడా పెద్దగా ప్రభావం ఉండదు.

ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ సర్వీసును మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే..?

ముందుగా మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి Google ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే అకౌంట్స్, సర్వీసెస్ పేరుతో రెండు విభాగాలు కనిపిస్తాయి. వాటిలో సర్వీసెస్ విభాగంలో కనిపించే Instant Apps ఆప్షన్ పై క్లిక్ చేసి ఆ సర్వీసును ఎనేబుల్ చేసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఇన్‌స్టెంట్ యాప్స్ సర్వీసు మీ ఫోన్‌లో ఎనేబుల్ కాబడుతుంది.

గూగుల్ సెర్చ్ నుంచే నేరుగా..?

ఆ తరువాత నుంచి ఇన్‌స్టెంట్ యాప్స్ రూపంలో లభించే ఏ యాప్‌ను అయినా మీరు పొందే వీలుంటుంది. గూగుల్ సెర్చ్ ద్వారా ఈ యాప్‌లను పొందే వీలుంటుంది. మీకు కావల్సిన యాప్ పేరును గూగుల్ సెర్చ్ చేసిన వెంటనే సెర్చ్ ఫలితాల్లో ఆ యాప్‌కు సంబంధించిన Instant App కనిపిస్తుంది. ఆ యాప్‌ను ఎంచుకున్నట్లయితే ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవ్వాల్సిన పనిలేకుండా నేరుగా సర్వర్ నుంచే రన్ అవుతుంది.

పాఠకులకు ముఖ్యమైన గమనిక

ప్రస్తుతానికి అన్ని యాప్స్ Instant App పద్థతిలో లభించట్లేదు. కేవలం కొద్ది యాప్స్ మాత్రమే ఇన్‌స్టెంట్ యాప్స్ పద్థతిలో లభిస్తున్నాయి. గమనించగలరు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Enable Android Instant Apps On Your Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot