Home
How to

ఆండ్రాయిడ్ ఫోన్‌‌లో Guest Modeను వినియోగించుకోవటం ఏలా..?

అలాంటి వాళ్లి చేతికి మన ఫోన్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

By Sivanjaneyulu Bommu

కొన్ని సందర్భాల్లో మొహమాటం కొద్ది మన వ్యక్తిగత స్మార్ట్‌ఫోన్‌లను ఇతరులకు ఇవ్వవల్సి వస్తుంటుంది. కొంత మంది ఇతరుల ఫోన్‌‍లతో ఎంత వరకు ప్రవర్తించాలో అంతవరకే ప్రవర్తిస్తారు. కొందరు మాత్రం ఆ ఫోన్ మనది కాదని తెలిసినా ఆ ఫోన్‌లోని వ్యక్తగత డేటాను తెలుసుకోవాలన్న కుతూహలంతో యజమాని ప్రమేయం లేకుండానే ఫోన్‌ను మొత్తం జల్లెడపట్టేస్తారు. ఇలాంటి వాళ్లి చేతికి మన ఫోన్ ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే..?

ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైతే..?

ఇలాంటి పరిస్థితి మీకు ఎదురైనపుడు గెస్ట్ మోడ్ పీచర్ ద్వారా ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని వేరొకరు చూడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ ఫీచర్ ఫోన్‌లోని పర్సనల్ డేటాకు పూర్తిస్ధాయి భద్రతను కల్పిస్తుంది. మీ ఈ-మెయిల్స్ అదేవిధంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల అపడేట్స్‌ను అవతలి వ్యక్తి కంట పడకుండా చర్యలు తీసుకుంటుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపై ఫోన్‌లలో..

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపై ఫోన్‌లలో..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో గెస్ట్‌ యూజర్‌ మోడ్‌‌ను ఉపయోగించటం ద్వారా ఫోన్‌ను ఎక్కువ మంది యూజర్లు వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా, మీ ఫోన్‌లోని సమాచారాన్ని ఇతరులు ఎంత వరకు వీక్షించాలో కూడా నిర్ధేశించుకోవచ్చు. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపై ఫోన్‌లలో గెస్ట్‌ మోడ్‌ను ఏలా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

గెస్ట్‌ యూజర్‌ మోడ్‌‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే..?

గెస్ట్‌ యూజర్‌ మోడ్‌‌ను ఎనేబుల్ చేసుకోవాలంటే..?

ముందుగా మీ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఫోన్‌లోని నోటిఫికేషన్ బార్‌లోకి వెళ్లండి.
టాప్ రైట్‌లో కనిపించే మీ అవతార్ పై రెండు సార్లు టాప్ చేయండి.
వాటిలో Add guest ఐకాన్ పై టాప్ చేసి ఉంచండి.
ఇప్పుడు మీ ఫోన్ గెస్ట్ మోడ్‌లోకి మారిపోతుంది.

గెస్ట్ మోడ్ సెషన్‌ను డిసేబుల్ చేయాలంటే..?

గెస్ట్ మోడ్ సెషన్‌ను డిసేబుల్ చేయాలంటే..?

గెస్ట్ మోడ్ సెషన్ పూర్తి అయిన వెంటనే తిరిగి మీ గూగుల్ అకౌంట్‌లోకి వచ్చేందుకు నోటిఫికేషన్ బార్‌లోకి వెళ్లి టాప్ రైట్‌లో కనిపించే మీ అవతార్ పై రెండు సార్లు టాప్ చేయండి. your Google account, Add guest, Add user పేర్లతో మూడు ఐకాన్‌లు మీకు కనిపిస్తాయి. వాటిలో your Google account ఐకాన్ పై టాప్ చేసినట్లయితే తిరిగి మీ అకౌంట్ లోకి వచ్చేస్తారు. అంతేకాదు, గెస్ట్ సెషన్ లో బ్రౌజ్ చేసిన డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.

Best Mobiles in India

English summary
How to enable and disable guest mode in Android phone. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X