Google Pay ద్వారా FASTag అకౌంట్లను రీఛార్జ్ చేయడం ఎలా?

|

గూగుల్ పే ఇప్పుడు తమ వినియోగదారుల కోసం మరొక కొత్త ఫీచర్‌ను జోడించింది. దీని ద్వారా వారు ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లను రీఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్ పెమెంట్స్ సర్వీస్ యొక్క తాజా అప్డేట్ ఈ కొత్త ఎంపికలను జోడిస్తోంది.

గూగుల్ పే

కొత్త అప్డేట్ తో గూగుల్ పే యూజర్లు యుపిఐని ఉపయోగించి వారి ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లను రీఛార్జ్ చేయగలరు. ఈ అకౌంట్ రీఛార్జ్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఎక్కువ సమయం క్యూలలో వేచిఉండకుండా ఉండడానికి ఇది వారికి సహాయపడుతుంది. రీఛార్జ్ చేయడానికి గూగుల్ పే యూజర్లు చేయవలసినది ఒకటే ఒకటి తమ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లను గూగుల్ పే యాప్ కు లింక్ చేయడం. ఇది మీ యొక్క పేమెంట్లను రీఛార్జ్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి మరింత సౌకర్యంగా ఉంటుంది.

 

 

 

RS.10ల టాక్ టైమ్ ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్ కాకపోతే....RS.10ల టాక్ టైమ్ ప్లాన్‌లను తిరిగి తీసుకువచ్చిన ఎయిర్‌టెల్ కాకపోతే....

గూగుల్ పే: ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఎంపికను ఎలా ప్రారంభించాలి

గూగుల్ పే: ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఎంపికను ఎలా ప్రారంభించాలి

*** గూగుల్ పేలో మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ను రీఛార్జ్ చేయడానికి మీరు మొదట ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ ను లింక్ చేయాలి.

*** అలా చేయడానికి మీరు గూగుల్ పే యాప్ ను ఓపెన్ చేసి ఫాస్ట్ ట్యాగ్ ఆప్షన్ కోసం వెతకాలి.

*** దీనిని "బిల్ పెమెంట్స్" విభాగంలో చూడవచ్చు. దీనిని రూపాయి గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా కనుగొనవచ్చు.

*** ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ ఎంపికను ఎంచుకోండి మరియు మీ ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసిన బ్యాంకును ఎంచుకోండి.

 

 

వోడాఫోన్ రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు....వోడాఫోన్ రూ.269 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు....

 

గూగుల్ పే - ఫాస్ట్ ట్యాగ్

గూగుల్ పే - ఫాస్ట్ ట్యాగ్

ప్రస్తుతానికి గూగుల్ పే కేవలం రెండు ఎంపికలను మాత్రమే అందిస్తుంది. అవి ICICI ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ మరియు IDFC ఫస్ట్ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్. గూగుల్ ముందు ముందు ఈ సేవకు ఫాస్ట్ ట్యాగ్ జారీ చేసే మరిన్ని సంస్థలకు మద్దతునిచ్చే అవకాశం ఉంది. తదుపరి స్క్రీన్ మీద మీ వాహన నంబర్‌ను నమోదు చేసి మీ బ్యాంక్ అకౌంట్ తో చెల్లించడానికి కొనసాగండి అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులు ఒక బటన్ నొక్కడం ద్వారా మద్దతు ఉన్న బ్యాంకులు జారీ చేసిన ఫాస్ట్ ట్యాగ్ల కోసం వారి ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్ బ్యాలెన్స్ ను కూడా తనిఖీ చేయవచ్చు.

 

 

DTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కైDTH చందాదారులకు HD ఛానెల్‌లను అధికంగా అందిస్తున్న టాటా స్కై

ఫాస్ట్ ట్యాగ్

ఫాస్ట్ ట్యాగ్

ఫాస్ట్ ట్యాగ్ అనేది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేత నిర్వహించబడుతున్న ఎలక్ట్రానిక్ టోల్ పేమెంట్ వ్యవస్థ. ప్రీపెయిడ్ లేదా సేవింగ్స్ అకౌంట్ నుండి నేరుగా లింక్ చేయబడిన టోల్ పెమెంట్స్ చేయడానికి ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీపై ఆధారపడుతుంది. ఈ నెల జనవరి 15 నుండి వాహన యజమానులందరికీ ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి అయింది. ఇది గత నెలలో అమల్లోకి వస్తుందని ఉహించినప్పటికీ దీనిని రెండు సార్లు పొడిగించారు. ఇప్పటివరకు 7 మిలియన్ ట్యాగ్‌లు జారీ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Best Mobiles in India

English summary
How to Enable FASTag Recharge Through Google Pay

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X