Google క్రోమ్ కొత్త ఫీచర్ 'మెమోరీస్' ను ప్రారంభించడం ఎలా?

|

ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం ఎక్కువ మంది గూగుల్ క్రోమ్ ను ఉపయోగిస్తున్నారు. ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ తన యొక్క వినియోగదారుల కోసం "మెమోరీస్" అనే క్రొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇది వినియోగదారులకు వారి వెబ్ కార్యాచరణను నిర్వహించడం మరింత సులభం చేస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారుడి వెబ్ కార్యాచరణ బుక్‌మార్క్‌లు, ట్యాబ్ గ్రూప్స్ మరియు క్రోమ్ హిస్టరీలను ఒకే చోట ప్రదర్శిస్తుంది.టెక్‌డోస్ నివేదిక ప్రకారం వినియోగదారుడి యొక్క వెబ్ కార్యాచరణ అంతా క్రోమ్ బ్రౌజర్‌లో కార్డ్ ఆధారిత వీక్షణలో ప్రదర్శించబడుతుంది. కాబట్టి వినియోగదారులు వారి మునుపటి వెబ్ కార్యాచరణ ద్వారా ఒకే చోట శోధించవచ్చు.

How to Enable Google Chrome Memories New Feature

గూగుల్ క్రోమ్ కోసం 'మెమోరీస్' ఫీచర్ పరీక్షించబడుతుందని గుర్తుంచుకోండి. ఇది ఇప్పుడు క్రోమ్ యొక్క సెట్టింగుల ట్యాబ్ నుండి ప్రారంభించబడదు. అయితే దీన్ని ప్రయత్నించడానికి ఆసక్తి ఉన్నవారికి ఇది గూగుల్ క్రోమ్ కానరీ వెర్షన్ 92.0.4479.0 లో లభిస్తుంది. గూగుల్ క్రోమ్ ప్రస్తుతం "మెమోరీస్" ఫీచర్‌తో ప్రయోగాలు చేస్తోంది. ఇతర ఫీచర్ల మాదిరిగానే ఇది కూడా ప్రతిఒక్కరికీ స్థిరమైన వెర్షన్‌లోకి వస్తుందని హామీ లేదు. గూగుల్ యొక్క వాస్తవిక అధికారిక ప్రకటన కోసం మరికొంత సమయం వేచి ఉండాలి.

గూగుల్ క్రోమ్ మెమోరీస్ ఫీచర్ ప్రారంభించే విధానం

How to Enable Google Chrome Memories New Feature

** గూగుల్ క్రోమ్ కోసం ఈ మెమోరీస్ క్రోమ్ కానరీలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని గుర్తుంచుకోండి.

** దీనిని ప్రారంభించడానికి మీ Windows, macOS, లేదా Linux డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్ కంప్యూటర్‌లో Chrome Canary వెర్షన్ 92.0.4479.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ను ప్రారంభించండి.

** అడ్రెస్ బార్ లో "chrome: // flags" అని టైప్ చేయండి. "Enter" కీని నొక్కండి.

** మీరు ఫ్లాగ్స్ స్క్రీన్ ను చూడాలి. సెర్చ్ బాక్స్ లో "మెమోరీస్" అని టైప్ చేయండి.

** "మెమోరీస్" ఫ్లాగ్ కనిపించిన తర్వాత దాన్ని ప్రారంభించండి. అప్పుడు మీరు బ్రౌజర్‌ను పున ప్రారంభించాలి. కాబట్టి మీ ఇతర ట్యాబ్‌లలోని డేటా సేవ్ చేయబడిందని నిర్ధారించుకోండి.

** చివరగా "రీలాంచ్" బటన్ పై క్లిక్ చేయండి.

** గూగుల్ క్రోమ్ కానరీ తిరిగి ప్రారంభించిన తర్వాత బుక్‌మార్క్‌లు, టాబ్ గ్రూప్స్ మరియు క్రోమ్ హిస్టరీతో సహా మీ అన్ని వెబ్ కార్యాచరణను ఒకే చోట చూడటానికి అడ్రస్ బాక్స్ లో "క్రోమ్: // మెమోరీస్" అని టైప్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Enable Google Chrome 'Memories' New Feature

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X