Instagram ,Messenger లలో వానిష్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

|

వాట్సాప్‌లోకొత్తగా అదృశ్యమయ్యే మెసేజ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఫేస్‌బుక్ సంస్థ తన మెసెంజర్ మరియు ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లలో కూడా ఇలాంటి ఫీచర్‌ను తీసుకువచ్చింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఫీచర్ ను వానిష్ మోడ్ అంటారు. ఈ వానిష్ మోడ్‌ ఫీచర్ ను ఉపయోగించి పంపిన మెసేజ్లు అవతలి వారు చూసిన తర్వాత ఆటోమ్యాటిక్ గా అదృశ్యమవుతాయి. ఈ ఫీచర్ యొక్క కార్యాచరణ విషయానికి వస్తే వానిష్ మోడ్ అనేది వాట్సాప్ యొక్క డిసప్పిరింగ్ మెసేజ్ వలె దాదాపుగా పని చేస్తుంది. అయితే రెండింటి మధ్య అప్ప్రోచ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ లు సుమారు 7 రోజులు చాట్‌లో ఉంటాయి. కానీ వానిష్ మోడ్ మెసేజ్ లు తక్షణమే అదృశ్యమవుతాయి.

 
How to Enable New Vanish Mode Feature on Instagram and Messenger

ఇన్‌స్టాగ్రామ్ మరియు మెసెంజర్‌లలో వానిష్ మోడ్‌ ఫీచర్ ను ఉపయోగించే విధానం

 

ఇన్‌స్టాగ్రామ్ మరియు మెసెంజర్‌ రెండు యాప్ లలో వానిష్ మోడ్ ఫీచర్ ఒకే విధంగా పనిచేస్తుంది. వినియోగదారులు వాస్తవానికి క్రాస్ యాప్ వానిష్ మోడ్ మెసేజ్ లను కూడా పంపవచ్చు.

How to Enable New Vanish Mode Feature on Instagram and Messenger

*** ఇన్‌స్టాగ్రామ్ మరియు మెసెంజర్‌లలో వానిష్ మోడ్‌ను ప్రారంభించడానికి మొదట యాప్ ను ఓపెన్ చేయండి.

*** తరువాత వానిష్ మోడ్‌ను ప్రారంభించడానికి ఏదైనా చాట్ విండోను ఓపెన్ చేసి స్క్రీన్ యొక్క దిగువ నుండి స్వైప్ చేయండి.

*** వానిష్ మోడ్ ఆన్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మరియు మెసెంజర్ చాట్ విండోలో వానిష్ మోడ్‌ను స్పష్టంగా పేర్కొంటుంది.

*** అలాగే వానిష్ మోడ్‌ను ఆపివేయడానికి స్క్రీన్ యొక్క దిగువవైపు నుండి మళ్లీ స్వైప్ చేయండి.

Best Mobiles in India

English summary
How to Enable New Vanish Mode Feature on Instagram and Messenger

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X