మీ బ్రౌజింగ్ హిస్టరీని ఎవరు చూడకుండా ఉండాలంటే..?

|

మీ బ్రౌజింగ్ డేటాకు సంబంధించి హిస్టరీ ఇంకా కీవర్డ్స్ ఇతరులకు కనపించకుండా చేయాలంటే ప్రైవేట్ బ్రౌజింగ్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవటం ఉత్తమం. ముఖ్యంగా ప్రైవేటు బ్రౌజింగ్ ఆప్షన్ అనేది మనం వేరే వాళ్ల కంప్యూటర్ అంటే ఫ్రెండ్స్ లేదా ఇంటర్నెట్ సెంటర్‌లలో వెబ్ బ్రౌజింగ్ చేసే సమయంలో దోహదపడుతుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రైవేట్ బ్రౌజింగ్ చిట్కాను అనుసరించటం ద్వారా మన బ్రౌజింగ్ సమాచారాన్ని ఇతరులు తెలుసుకునే ఆస్కారం ఉండదు.

Read More : 2017లో రాబోతున్న 5 నోకియా ఫోన్‌లు

క్రోమ్ బ్రౌజర్ టిప్స్..

క్రోమ్ బ్రౌజర్ టిప్స్..

మీరు ఉపయోగిస్తున్నది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయినట్లయితే.. ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new window' ఆప్షన్ క్రింద కనిపించే ‘new incognito window' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 2

స్టెప్ 2

న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు. ctrl+Shift+N షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారా కూడా ‘new incognito window' ప్రైవేట్ ట్యాబ్'లోకి ప్రవేశించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ టిప్స్
 

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ టిప్స్

మీరు ఉపయోగిస్తున్నది ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ అయినట్లయితే.. ఫైల్ మెనూలోకి ప్రవేశించి.. ‘new tab' ఆప్షన్ క్రింద కనిపించే ‘ ‘new private window' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు.

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ టిప్స్

ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్ టిప్స్

సాధారణ ఫైర్‌ఫాక్స్ బ్రౌజింగ్ మోడ్‌లో పొందే అన్ని ఫీచర్లను ప్రైవేటు బ్రౌజింగ్ మోడ్‌లో పొందవచ్చు. ctrl+Shift+P షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారాను ‘న్యూ ప్రైవేట్ ట్యాబ్'లోకి ప్రవేశించవచ్చు.

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్  సేఫ్టీ బ్రౌజింగ్..

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ సేఫ్టీ బ్రౌజింగ్..

మీరు ఉపయోగిస్తున్నది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ అయినట్లయితే.. సేఫ్టీ(Saftey) మెనూలోకి ప్రవేశించి.. ‘In Private Browsing' ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి. న్యూ ప్రైవేటు విండో ట్యాబ్‌ను ఓపెన్ చేసి బ్రౌజింగ్ చేయటం ద్వారా మీరు చూసిన వెబ్‌సైట్‌ల తాలుకా సమాచారం ఏది కంప్యూటర్లో సేవ్ అవ్వదు. ctrl+Shift+P షార్ట్‌కట్‌ను అమలు చేయటం ద్వారా కూడా ‘In Private Browsing'లోకి ప్రవేశించవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
How to Enable Private Browsing on Any Web Browser. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X