వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

|

ప్రముఖ మెసేజ్ యాప్ వాట్సాప్ తన ప్లాట్‌ఫామ్‌లో అందరు ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డార్క్ మోడ్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ డార్క్ మోడ్ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యొక్క అన్ని ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌
 

వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌

ప్రారంభంలో రెండు ప్లాట్‌ఫారమ్‌ల బీటా వెర్షన్‌లలో లభిస్తుంది. ఈ ఫీచర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన వెర్షన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. తక్కువ-కాంతి వాతావరణంలో కంటి ఒత్తిడిని తగ్గించడానికి మరియు రాత్రి సమయంలో మీ ఫోన్ ద్వారా ఇబ్బందికరమైన క్షణాలను నివారించడానికి డార్క్ మోడ్ రూపొందించబడిందని వాట్సాప్ తెలిపింది.

Dish TV,D2h ఆపరేటర్ల టీవీ కనెక్షన్ కొత్త NCF ధరలు ఇవే...

వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్

వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్

వాట్సాప్ యొక్క డార్క్ మోడ్ ఫీచర్ కొంతవరకు బ్యాటరీ లైఫ్ ను ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది. ఫేస్‌బుక్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2019 లో మొదటిసారిగా వాట్సాప్ యొక్క డార్క్ మోడ్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి వినియోగదారుడి కొరకు తమ కార్యాచరణను రూపొందించడానికి కంపెనీకి దాదాపు ఒక సంవత్సరం పట్టింది.

BSNL Rs.551 ప్లాన్: రోజుకు 5GB డేటా ప్రయోజనాలతో

వాట్సాప్ డార్క్ మోడ్‌ డిజైన్ వివరాలు

వాట్సాప్ డార్క్ మోడ్‌ డిజైన్ వివరాలు

ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌లో డార్క్ మోడ్ రాకను మొదట కంపెనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా సూచించింది. ఇది ప్రొఫైల్ ఇమేజ్‌ను డార్క్ బ్యాక్‌గ్రౌండ్ మరియు వాట్సాప్ లోగోతో భర్తీ చేసింది. ఆలస్యంగా వాట్సాప్ ఒక బ్లాక్‌పోస్ట్‌ను ప్రచురించింది. ఇది వాట్సాప్ కోసం డార్క్ మోడ్‌ను ఎలా డిజైన్ చేసిందో వివరిస్తుంది.

Oppo Kash: అప్పు కావాలా? ఇప్పుడు దీని ద్వారా సులభంగా పొందవచ్చు!!!

రీడబిలిటీ
 

రీడబిలిటీ

వాట్సాప్ డార్క్ మోడ్‌ను డిజైన్ చేస్తున్నప్పుడు రెండు ప్రత్యేక రంగాలపై దృష్టి సారించి తన పరిశోధనలో వివిధ రకాల ప్రయోగాలను చేసింది. అందులో ముఖ్యంగా రీడబిలిటీ మరియు ఇన్ఫర్మేషన్ హైరార్కీ మోడ్‌ ల మీద చాలా ప్రయోగాలు చేసింది. రీడబిలిటీలో వివిధ రకాల కలర్ లను ఎన్నుకునేటప్పుడు వాట్సాప్ కంటి అలసటను తగ్గించాలని మరియు ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్‌లోని సిస్టమ్ డిఫాల్ట్‌లకు దగ్గరగా ఉండే కలర్ లను ఉపయోగించాలని కోరుకుంది.

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

ఇన్ఫర్మేషన్ హైరార్కీ

ఇన్ఫర్మేషన్ హైరార్కీ

తదుపరిది ఇన్ఫర్మేషన్ హైరార్కీ. వాట్సాప్ వినియోగదారులు ప్రతి స్క్రీన్‌పై సులభంగా దృష్టిని కేంద్రీకరించడానికి సహాయం చేయాలనుకున్నారు. అందుకోసం చాలా ముఖ్యమైన సమాచారం అని నిర్ధారించుకోవడానికి కలర్ మరియు ఇతర డిజైన్ అంశాలను ఉపయోగించడం ద్వారా దాన్ని సాధించింది.

ఈ వారంలో లాంచ్ అయ్యే స్మార్ట్‌వాచ్ లు ఇవే...

కలర్ కాంబినేషన్‌

కలర్ కాంబినేషన్‌

కలర్ కాంబినేషన్‌ను ఎంచుకోవడానికి వాట్సాప్ త్వరలో వినియోగదారులకు మరొక ప్రతేక ఆప్షన్‌ను అందిస్తుందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్‌లోని డార్క్ మోడ్ పిక్ బ్లాక్ కలర్‌ను అందించదు. దానికి బదులుగా బూడిద కలర్ లభిస్తుంది. కానీ వెబ్‌లోని వివిధ నివేదికలు సంస్థ త్వరలో వినియోగదారులకు సాలిడ్ కలర్స్ ఆప్షన్‌ను ప్రవేశపెడుతుందని సూచిస్తున్నాయి.

iQOO 3: నెట్‌వర్క్‌ కనెక్టివిటీ,గేమ్ ఛేంజర్ స్మార్ట్‌ఫోన్‌లలో రారాజు

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

వాట్సాప్‌లో డార్క్ మోడ్‌ను ప్రారంభించడం ఎలా?

ఆండ్రాయిడ్10 మరియు iOS 13 లోని వినియోగదారులు సిస్టమ్ సెట్టింగులను ప్రారంభించడం ద్వారా డార్క్ మోడ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని ప్రారంభించడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి.

*** ఆండ్రాయిడ్ 9 పైను వాడుతున్న వినియోగదారులు మొదటగా వాట్సాప్‌ను ఓపెన్ చేసి అందులోని సెట్టింగులను ఓపెన్ చేయండి.

*** తరువాత అందులోని చాట్స్ విభాగంను ఎంచుకోండి

*** తరువాత థీమ్ విభాగంలోకి వెళ్లి అందులోని డార్క్ మోడ్‌ను ఎంచుకోండి.

ప్రతి ఒక్కరూ డార్క్ మోడ్‌ ఫీచర్ ను ఆనందించడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఫీచర్ రాబోయే రోజుల్లో వాట్సాప్ యొక్క తాజా వెర్షన్‌లో విడుదల అవుతుంది అని కంపెనీ పోస్ట్‌లో పేర్కొంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Enable WhatsApp Dark Mode Feature on your Android Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X