ఐఫోన్ ఛార్జింగ్ ఫాస్ట్ కావాలంటే ఎలా ?
నేటి ఆధునిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం గడవని పరిస్థితి. అన్నింటికీ ఫోన్ పైన్నే అతిగా ఆధారపడుతోన్న నేపథ్యంలో వాటి పై మరింత ఒత్తిడి పెరిగి బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవడం వంటి సమస్యలు ఉత్ఫన్నమవ
నేటి ఆధునిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం గడవని పరిస్థితి. అన్నింటికీ ఫోన్ పైన్నే అతిగా ఆధారపడుతోన్న నేపథ్యంలో వాటి పై మరింత ఒత్తిడి పెరిగి బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవడం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫోన్లను మరింత వేగవంతంగా ఛార్జ్ చేసుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అన్వేషిస్తున్నారు. ఐఫోన్ వినియోగదారులు లో ఛార్జింగ్ సమస్యలతో ఒక్కోసారి బాగా సఫర్ అవుతుంటారు. ఈ మధ్య వచ్చిన ఐఫోన్ ఎక్స్ కూడా ఛార్జింగ్ విషయంలో అనేక సమస్యలను ఎదుర్కుంది.

అయితే ఆపిల్ యూజర్లు 18W, 29W, 30W, 61W, or 87W USB-C power adapters,Apple USB-C to Lightning cable వంటి వాటిని ఉపయోగించడం ద్వారా ఛార్జింగ్ ఫాస్ట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు.

Using 2A power bank
ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలైన పవర్ బ్యాంకులు దొరుకుతున్నాయి. అయితే మీరు మీ ఐఫోన్ కి Using 2A power bank వాడటం ద్వారా ఛార్జింగ్ వీలైనంత ఫాస్ట్ గా అవుతుంది.

Using Apple iPad charger
వినియోగదారులు Apple iPad charger ఉపయోగించడం ద్వారా కూడా ఛార్జింగ్ ఫాస్ట్ అవుతుంది. latest iPad Pro (2018) USB Type-C portతో వచ్చింది. కాబట్టి వినియోగదారులు ఓ సారి గుర్తించుకోండి

Using any Android fast-charging adapter
ఈ మధ్య చాలా వరకు ఆండ్రాయిడ్ ఫోన్లు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తున్నాయి. అయితే ఆండ్రాయిడ్ కేబుల్స్ ఐఫోన్లకు పనిచేయవు. అయితే ఈ సమయంలో ఆండ్రాయిడ్ అడాప్టర్ ఉపయోగించడం ద్వారా ఛార్జింగ్ ప్రయత్నించవచ్చు.

iPhone X, XS and XS Max
ఆపిల్ నుంచి వచ్చిన ఈ ఐఫోన్లన్నీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వచ్చాయి. కాబట్టి మీరు వీటికి ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ పరికరాలనే వాడాలి. మాములువి వాడితే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications








