ఆన్‌లైన్‌ ద్వారా సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నమోదు చేయడం ఎలా?

|

గూగుల్ సెర్చ్ చేయడం లేదా సోషల్ మీడియాను ఉపయోగించడం కోసం చాలా మంది ప్రజలు ఇంటర్నెట్ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ ద్వారా క్యాబ్‌లను బుకింగ్ చేయడం, బ్యాంకింగ్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ నుండి ఏదైనా కొనడం వంటి అనేక ఇతర సేవలను ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా మనకు మంచి సౌలభ్యాన్ని తీసుకువస్తున్నాయి కానీ వీటితో పాటుగా ఆన్‌లైన్ స్కామ్‌లు, బ్యాంకింగ్ మోసాలు వంటి భద్రతా చిక్కులను కూడా కలిగి ఉన్నాయి.

ఆన్‌లైన్ స్కామ్‌
 

ఆన్‌లైన్ స్కామ్‌

ఆన్‌లైన్ స్కామ్‌ల బారిన పడిన వారి యొక్క ఫిర్యాదులను స్వీకరించడానికి భారత ప్రభుత్వం ఆన్‌లైన్ సైబర్ క్రైమ్ ఫిర్యాదు పోర్టల్‌ను ప్రారంభించింది. ఇది పౌరులను ఆన్‌లైన్‌లో ఫిర్యాదులను నమోదు చేయడానికి మరియు దాని యొక్క పురోగతిని అనుసరించడానికి అనుమతిస్తుంది.

Samsung Galaxy A71 లాంచ్ ఆఫర్స్ చూడతరమా!!!

సైబర్‌క్రైమ్‌

సైబర్‌క్రైమ్‌

మీరు ఎప్పుడైనా ఏదైనా ఆన్‌లైన్ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు లేదా ఇతర రకాల సైబర్‌క్రైమ్‌ల బారిన పడి మోసపోయి ఉంటే కనుక ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఫిర్యాదులను నమోదు చేయడానికి కింద గల దశల వారీ మార్గదర్శిని అనుసరించండి.

5G నెట్‌వర్క్‌ కోసం క్వాల్కమ్ యొక్క కొత్త X60 మోడెమ్ చిప్‌

కంప్లయింట్

*** 'Https://cybercrime.gov.in/'ను ఓపెన్ చేసి అందులో గల 'ఫైల్ ఏ కంప్లయింట్' బటన్ మీద క్లిక్ చేయండి.

*** తరువాత ఓపెన్ అయ్యే పేజీలో గల నిబంధనలు మరియు షరతులను అంగీకరించండి.

*** తరువాత 'రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్' బటన్ మీద క్లిక్ చేయండి.

లాగిన్
 

*** 'సిటిజెన్ లాగిన్' ఎంపికను ఎంచుకోండి. అందులో మీ యొక్క రాష్ట్రం, వినియోగదారుడి పేరు మరియు మొబైల్ నంబర్ వంటి ముఖ్య వివరాలను ఎంటర్ చేయండి.

*** మీ యొక్క మొబైల్ నంబర్ కు అందుకున్న OTP ని ఎంటర్ చేసి కింద భాగంలో గల గణిత ప్రాబ్లంను సాల్వ్ చేసి కింది భాగంలో గల 'సబ్మిట్' బటన్ మీద క్లిక్ చేయండి.

*** తదుపరి దశలో మీరు కీలక వివరాలను నమోదు చేయవలసి ఉంటుంది. ఇందులో భాగంగా ఫారం నాలుగు భాగాలుగా విభజించబడి ఉంటుంది. అవి వరుసగా సంఘటన వివరాలు, అనుమానిత వివరాలు, ఫిర్యాదుల వివరాలు సమర్పించిన తరువాత 'సబ్మిట్' బటన్ మీద క్లిక్

చేయండి.

సంఘటన వివరాల పేజీలో

*** సంఘటన వివరాల పేజీలో ఫిర్యాదు యొక్క వర్గం, ఫిర్యాదు యొక్క ఉప-వర్గం, సంఘటన యొక్క తేదీ & సమయం / కంటెంట్ / స్వీకరించడం / చూడటం వంటివి ఉంటాయి. ఇందులో రిపోర్టింగ్ ఆలస్యం కావడానికి గల కారణం మరియు సంఘటన ఎక్కడ జరిగింది వంటి

వివరాలను నమోదు చేయండి.

*** మీరు సోషల్ మీడియా అకౌంట్ వివరాలు, వెబ్‌సైట్ URL ను నమోదు చేయాలి. అలాగే నేరానికి సంబంధించిన సాక్ష్యాలను కూడా సమర్పించవలసి ఉంటుంది.

*** తరువాత 'సేవ్ అండ్ నెక్స్ట్' బటన్ మీద క్లిక్ చేయండి

*** దీని తరువాత పేరు మరియు గుర్తింపు రుజువు లేదా చిరునామా వంటి అనుమానిత వివరాలను నమోదు చేయండి.

ఫిర్యాదుల

*** ఫిర్యాదుల వివరాల వద్ద ఇమెయిల్ ID, ఫోటో మొదలైన మీ వివరాలను నమోదు చేసి తదుపరి దశకు వెళ్లండి.

*** ఇప్పుడు మీరు నమోదు చేసిన ప్రతి వివరాలను ధృవీకరించండి. అలాగే అవి ఉత్తమమైనవి అని నిర్ధారించుకోండి మరియు ఫిర్యాదును విజయవంతంగా దాఖలు చేయడానికి 'కంఫార్మ్ మరియు సబ్మిట్' బటన్‌ను నొక్కండి.

*** చివరి దశలో 'డౌన్‌లోడ్ PDF' బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ ఫిర్యాదు యొక్క PDF ఫైల్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to File a Cyber Crime Complaint Online in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X