ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం ఎలా?

|

ఇండియాలో జీతభత్యాల వ్యక్తులు మరియు స్వయం ఉపాధి వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. ఆధార్ ఇప్పటికీ ముఖ్యమైన డాక్యుమెంట్ గా ఉన్నందున మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్, EPF అకౌంట్ మరియు ముఖ్యంగా పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం చాలా అవసరం. ఇది చాలా తేలికైనది ముఖ్యంగా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే వారికి.

ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం ఎలా?

 

సాధారణంగా మీరు మీ ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసిన తరువాత దానిని ప్రింట్ చేసి దాని మీద సంతకం చేసి ఆదాయపు పన్ను కార్యాలయానికి పంపిన తరువాత ITR-V ను పొందుతారు. కానీ ఇప్పుడు ప్రతిదీ డిజిటల్‌గా సాగుతున్న నేటి యుగంలో మీ ఆధార్ మీ ITR-V ని ధృవీకరించడానికి మరో మార్గాన్ని ఇస్తుంది. దీన్ని ఎలా చేయాలో తెలుసుకోవడానికి కింద చదవండి.

ఆదాయపు పన్ను పోర్టల్‌లో నమోదు చేసుకోవటం:

ఆదాయపు పన్ను పోర్టల్‌లో నమోదు చేసుకోవటం:

దీనిని ప్రారంభించడానికి మీరు ఆదాయపు పన్ను పోర్టల్‌లో మీ అకౌంట్ను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకోవడానికి కుడి వైపున వున్న రిజిస్టర్ అనే ఎంపికను మొదటిసారి నమోదు చేసుకునే వారి కోసం మరియు ఇప్పటికే నమోదు చేసుకున్న వారికి లాగిన్ ఎంపికను ఎంచుకోవలసి ఉంటుంది. ఇందులో మీ యూజర్ ఐడి సాధారణంగా మీ పాన్ నంబర్ అయి ఉంటుంది.

మొదటిసారి నమోదు చేసుకునే వారు మీ పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ మరియు నివాస స్థలమును నమోదు చేయండి. దాని తరువాత కొనసాగించు ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తరువాత వచ్చే రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి. ఇందులో మీ పాన్ నంబర్ మరియు ఇతర వివరాలను జోడించవలసి ఉంటుంది. వీటి యొక్క ధృవీకరణ తర్వాత రిజిస్ట్రేషన్ విజయవంతం అయిన తర్వాత మీ ఖాతా సృష్టించబడుతుంది.

ఆదాయపు పన్ను రిటర్న్స్‌తో ఆధార్‌ను లింక్ చేయడం:
 

ఆదాయపు పన్ను రిటర్న్స్‌తో ఆధార్‌ను లింక్ చేయడం:

మీ ఆధార్‌ను ఆదాయపు పన్ను రిటర్న్‌లతో లింక్ చేయడానికి కింది పద్ధతులు ఫాలో అవ్వండి.

1. పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.

2. కుడి వైపున ఉన్న ‘ప్రొఫైల్ సెట్టింగులు' పై క్లిక్ చేయండి.

3. డ్రాప్‌డౌన్ మెనులోని ‘లింక్ ఆధార్' పై క్లిక్ చేయండి.

ఇక్కడ మీరు మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. ఆ OTP కోడ్ ను దృవీకరించబడిన తర్వాత మీ ఆధార్ మీ ఆదాయపు పన్ను రిటర్న్స్ ఖాతాతో అనుసంధానించబడుతుంది.

ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేయడం:

ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఆన్‌లైన్‌లో దాఖలు చేయడం:

ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఆన్‌లైన్‌లో దాఖలు చేయడానికి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి మరియు ‘ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు' అని తెలిపే లింక్ మీద క్లిక్ చేయండి. తరువాతి పేజీలో మీ పాన్ నంబర్ చూపబడుతుంది. ఆపై మీరు అసెస్‌మెంట్ ఇయర్, ITR ఫారం నేమ్ మరియు సబ్మిషన్ మోడ్‌ను ఎంచుకోవాలి. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2019-2020 . దాని తదుపరి డ్రాప్‌డౌన్‌లో ITR-1 ఫారమ్‌ను ఎంచుకోవాలి. మీ రాబడిని ధృవీకరించడానికి ఆధార్ OTP ను ఎంచుకోవాలి.

దాని తరువాత కొనసాగించడానికి నెక్స్ట్ బట్టన్ ను క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆదాయ వివరాలు, పన్ను మినహాయింపులు మరియు మీ పెట్టుబడుల గురించి ఇతర వివరాలను జోడించవలసి ఉంటుంది. మీరు చెల్లించాల్సిన పన్ను మొత్తం స్క్రీన్ పై కనిపిస్తుంది. మీరు పన్ను తిరిగి చెల్లించడానికి అర్హత ఉంటే మీరు పన్ను చెల్లించడానికి సబ్మిట్ బట్టన్ ను క్లిక్ చేయండి.

ఆధార్ ఉపయోగించి ITR-V ను ధృవీకరించడం:

ఆధార్ ఉపయోగించి ITR-V ను ధృవీకరించడం:

మీరు మీ ఆదాయపు పన్ను రిటర్నులను విజయవంతంగా దాఖలు చేసిన తరువాత మీ ఆధార్ ఉపయోగించి ITR-V ని ఇ-వెరిఫై చేయాలి. దీని కోసం పోర్టల్‌కు లాగిన్ అవ్వండి దాని తరువాత కర్సర్‌ను ‘మై అకౌంట్' మీద ఉంచండి. దాని యొక్క డ్రాప్‌డౌన్ లో కనిపించే ‘ఇ-వెరిఫై రిటర్న్' పై క్లిక్ చేయండి. తరువాతి పేజీలో అసెస్‌మెంట్ సంవత్సరాన్ని ఎన్నుకోవాలి. తరువాత ఐటిఆర్ ఫారం పేరు మరియు ఆపై ఇ-వెరిఫై ఎంపికపై క్లిక్ చేయండి. ఇది మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP ని పంపుతుంది. అది విజయవంతంగా దృవీకరించబడిన తర్వాత మీ ఆదాయపు పన్ను రిటర్న్ ధృవీకరించబడుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
how to file income tax returns

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X