ఆన్‌లైన్‌ ద్వారా రైల్వే క్రిమినల్ ఫిర్యాదులను ఎలా నమోదు చేయవచ్చు

|

భారతీయ రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా భద్రతను మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తోంది. రైల్వే ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణికులు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక వెబ్‌సైట్ మరియు యాప్ ను రూపొందించింది. దేశవ్యాప్తంగా క్రిమినల్ ఫిర్యాదులను దాఖలు చేయడానికి మరియు పరిష్కరించడానికి ప్రయాణికులకు మరియు రైల్వే పోలీసులకు ఇది బాగా ఉపయోగపడుతుంది.

వెబ్‌సైట్
 

వెబ్‌సైట్: http://www.railways.delhipolice.gov.in/

యాప్: ఆండ్రాయిడ్‌ ఫోన్ లలో సహ్యాత్రి యాప్

గిన్నిస్ రికార్డు సృష్టించిన OV6948 చిన్నకెమెరా సెన్సార్‌గిన్నిస్ రికార్డు సృష్టించిన OV6948 చిన్నకెమెరా సెన్సార్‌

సర్వీస్

కొత్తగా ప్రవేశపెట్టిన ఈ సర్వీస్ ద్వారా క్రిమినల్ ఫిర్యాదులను నమోదు చేయడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా రైల్వే పోలీసులు దీనిని యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వున్న వాంటెడ్ నేరస్థుల కార్యకలాపాలతో వారి యొక్క పూర్తి సమాచారంతో కూడిన రికార్డు కూడా వెబ్‌సైట్‌లో ఉంది. దీనితో పాటు పోగొట్టుకున్న వస్తువులు, తప్పిపోయిన వ్యక్తులు, గుర్తు తెలియని మృతుల వివరాలు మరియు ఇతర నియమ నిబంధనలకు సంబంధించిన సమాచారం ఇందులో లభిస్తుంది.

ios13లో యాప్ లను డెలిట్ చేయడం ఎలా?ios13లో యాప్ లను డెలిట్ చేయడం ఎలా?

వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు ఎలా చేయాలి

వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు ఎలా చేయాలి

http://www.railways.delhipolice.gov.in/ వెబ్‌సైట్ ను ఓపెన్ చేసిన తరువాత అందులో కనిపించే సిటిజెన్ సర్వీసెస్ ట్యాప్ పై క్లిక్ చేయండి. తరువాత ఫిర్యాదు చేయడానికి వివిధ రకాల ఎంపికలు ఉంటాయి. అందులో మీరు ఫిర్యాదు చేయవలసిన ఎంపికను ఎంచుకోండి. ఉదాహరణకు రైలు ప్రయాణంలో ఏదైనా వస్తువులను జారవిడిచిన లేక పోగొట్టుకున్న,రైల్వే ట్రాక్ మీద ఏవైనా డెడ్ బాడీలను(మృతదేహాలను) గుర్తించిన వాటి సరైన ఎంపికను ఎంచుకొని అన్ని రకాల ఫిర్యాదులను నింపి ఒక నివేదికను కంప్లైంట్ ద్వారా ఇవ్వవచ్చు.

అమెజాన్ ఫైర్ టీవీలో ఆపిల్ టీవీ యాప్‌అమెజాన్ ఫైర్ టీవీలో ఆపిల్ టీవీ యాప్‌

యాప్ ద్వారా ఫిర్యాదులు ఎలా చేయాలి
 

యాప్ ద్వారా ఫిర్యాదులు ఎలా చేయాలి

-- ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు మొదటిగా గూగుల్ ప్లే స్టోర్ ద్వారా సహ్యాత్రి యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోండి.

-- అందులో సిటిజెన్ సర్వీసెస్ ట్యాప్ పై క్లిక్ చేయండి.

-- ఇక్కడ ఫిర్యాదు చేయడానికి సరైన ఎంపికను ఎంచుకోండి.

-- మీరు పంపవలసిన పూర్తి సమాచారాన్ని నింపి మీ యొక్క పూర్తి సమాచారంతో కూడిన వివరాలను పంపాలి.

Gmailలో మీ ఇమెయిల్‌ను ఎలా షెడ్యూల్ చేయాలి??Gmailలో మీ ఇమెయిల్‌ను ఎలా షెడ్యూల్ చేయాలి??

జియో-ట్యాగింగ్ ఫీచర్‌

యాప్ ద్వారా కొత్త ఫిర్యాదులను నమోదు చేయడమే కాకుండా గూగుల్ మ్యాప్స్ జియో-ట్యాగింగ్ ఫీచర్‌ను ఉపయోగించి దగ్గరలో వున్న పోలీస్ స్టేషన్ మరియు జిఆర్‌పి వివరాలను గుర్తించడానికి సహ్యాత్రి యాప్ ప్రయాణికులకు సహాయం చేస్తుంది. యాప్ యొక్క ఇతర ఫీచర్ లలో క్యూఆర్ కోడ్ స్కానర్, అత్యవసర కాల్ మరియు ఇతర పౌర సర్వీస్ లకు లింక్ టాట్పార్ ను ఈ యాప్ లో కలిగి ఉంటుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to File Online Railway Criminal complaints

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X