విదేశాలకు ఎప్పుడన్నా టూర్లకు వెళ్లాలనుకోవంచాలా మందికి ఎంతో ఆసక్తిగా ఉంటుంది. అయితే అలాంటి ఆసక్తి ఉన్నా కొంతమంది విదేశాలకు వెళ్లలేకపోతుంటారు.దీనికి కారణం విదేశాలకు వెళ్లాలంటే భారీగా బడ్జెట్ పెట్టుకోవాల్సి రావడం. ఇందులో భాగంగానే మీరు అత్యంత తక్కువ ధరకే విమాన టికెట్లను బుక్ చేసే మార్గాలను కూడా అన్వేషిస్తుంటారు. అయితే ఇది అంతకష్టమైన పనేమి కాదు. మీరు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా అత్యంత తక్కువ ధరకే విమానయాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అటువంటి మార్గాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.
జియో పుట్బాల్ ఆఫర్, కొత్తగా ఉంది కదా,ఆఫర్ ఇంకా కొత్తగా ఉంటుంది !
Google Flights
ఈ యాప్ ద్వారా మీరు ప్రపంచంలో ఎక్కడికైనా ప్రయాణించేందుకు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. మీకు ఇందులో ప్రతిరోజూ బెస్ట డీల్ ఆప్సన్లు కనిపిస్తాయి. దీంతో పాటు ఇందులో ఫలితాలు కూడా మీకు ఫాస్ట్ గా కనిపిస్తాయి.
ITA Matrix
ఇది కూడా గూగుల్ అనుబంధ సంస్థ.ఇందులో మీకు కొన్ని రకాల అదనపు సెర్చ్ ఆప్సన్లు ఉంటాయి. విమానశ్రయాన్ని మార్చుకోవడం అలాగే అక్కడ ఎంత సేవు వెయిట్ చేయాల్సి ఉంటుంది దీనికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా లాంటి విషయాలు మీరు ఈ సర్వీస్ ద్వారా తెలుసుకోవచ్చు.
Skyscanner
ఇది కూడా మీకు చాలా సహయకారిగా ఉంటుంది. ఇందులో మీకు అన్ని రకాల ఆప్సన్లు ఉంటాయి. ఈ సైట్లో ధరలకు సంబంధించి అనేక రకాలైన డీల్స్ మీకు కనిపిస్తాయి. మీకు ఏ రోజు తక్కువ ధరకు టికెట్లు లభిస్తాయనేదానిపై మీ మొబైల్ కి అలర్ట్ కూడా లభిస్తాయి. అయితే ఈ యాప్ మీరు మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Momondo
మీకు అత్యంత తక్కువ ధరలో టికెట్లను అందించే మరొక సైటు ఇది. ఇందులో మీరు దాదాపు రూ. 2 వేలు దాకా సేవ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ప్రయాణించే సమయాన్ని బట్టి మీకు డిస్కౌంట్ ధరలు ఉంటాయి.
Priceline
ఇది కూడా మీకు చాలా సహయకారిగా ఉంటుంది. ఇందులో మీకు అన్ని రకాల ఆప్సన్లు ఉంటాయి. ఈ సైట్లో ధరలకు సంబంధించి అనేక రకాలైన డీల్స్ మీకు కనిపిస్తాయి. మీకు ఏ రోజు తక్కువ ధరకు టికెట్లు లభిస్తాయనేదానిపై మీ మొబైల్ కి అలర్ట్ కూడా లభిస్తాయి. అయితే ఈ యాప్ మీరు మీ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Kiwi
ఇది కొన్ని సమయాల్లో మాత్రమే మీకు ఆఫర్లను అందుబాటులో ఉంచుతుంది. మీరు ఇతర సైట్లలో టికెట్లను బుక్ చేసుకునే సమయంలో ఈ సైటును కూడా సందర్శించి మీ టికెట్ ధరలను పోల్చి చూసుకోవచ్చు. ఇందులో తక్కువకే ఉంటే వెంటనే బుక్ చేసుకునే అవకాశం ఉంది.
ఎప్పటికప్పుడు ఈ మెయిల్
వీటితో పాటు మీకు టికెట్ల ధరలను ఎప్పటికప్పుడు ఈ మెయిల్ చేసే సైట్లు కూడా ఉన్నాయి. అయితే దీన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు కొంత రుసుం వారికి చెల్లించాల్సి ఉంటుంది. మీరు యాక్టివేట్ చేసుకున్న తరువాత ప్రాంతాలను బట్టి మీకు టికెట్ల ధరలను ఈ మెయిల్ చేస్తారు.
విమాన టికెట్ ఆఫర్ల ధరలను..
Scott's Cheap Flights, Flystein లాంటి సైట్లు మీకు ఈ మెయిల్ ద్వారా విమాన టికెట్ ఆఫర్ల ధరలను ప్రతిరోజూ పంపిస్తాయి. ఇందులో మీరు ఏ ఆప్సన్లు అయితే సెలక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించిన సమస్త సమాచారం మీ ముందు ఈ సైట్లు మీ ముందుంచాతాయి.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.