Home
How to

iOS 18 వెర్షన్‌లో డిలీట్‌, డ్యామేజీ అయిన ఫోటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు..!

ఆపిల్‌ ఇటీవల iOS 18 పబ్లిక్‌ బీటా వెర్షన్‌ను విడుదల చేసింది. ఈ వెర్షన్‌ ఐఫోన్ యూజర్లకు అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఫోన్‌ ఇంటర్‌ఫేస్‌లో అనేక కస్టమైజేషన్‌ ఆప్షన్‌లతోపాటు ఫోటోస్‌ యాప్‌లో అనేక అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది. ఈ ఫోటోస్‌ యాప్‌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తుంది. దీంతోపాటు మరో ముఖ్యమైన ఫీచర్‌ను ఈ యాప్ కలిగి ఉంటుంది. Recovered ఆల్బమ్‌ పేరుతో ఉన్న ఈ ఫీచర్‌ పోగొట్టుకున్న లేదా డ్యామేజీ అయిన ఫోటోలు, వీడియోలను మళ్లీ చూపుతుంది.

9to5mac నివేదిక ఈ కొత్త ఆల్బమ్‌ iPadOS 18, macOS Sequoia లోనూ అందుబాటులో ఉంటుంది. గతంలో పొగొట్టుకున్న ఫోటోలు, వీడియోలను ఈ ఫీచర్ గుర్తిస్తుంది. ఈ ఫోటోలు recovered ఆల్బమ్‌లో కనిపిస్తాయి. డేటాబేస్‌లో సమస్యలు లేదా ఇతర కారణాల వల్ల ఫోటోలు సరిగ్గా సేవ్‌ చేయబడని సందర్భంలో ఫోటోలు డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది.

how to find deleted or damages photos and video on iOS 18

స్టెప్‌ 1 : ఐఫోన్‌ లోని ఫోటోస్‌ యాప్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం ఆల్బమ్‌ పైన క్లిక్ చేయాలి.
స్టెప్‌ 2 : అనంతరం ఆల్బమ్‌ నుంచి కిందకు స్క్రోల్‌ చేయాలి. మరియు Utilities సబ్‌ మెను కోసం సెర్చ్‌ చేయాలి.

స్టెప్‌ 3 : అనంతరం రికవర్డ్‌ ఆల్బమ్‌ పైన ట్యాప్‌ చేయాలి. మరియు ఫేస్‌ ఐడీ లేదా టచ్‌ ఐడీ ద్వారా ధ్రువీకరించాలి.
స్టెప్‌ 4 : అక్కడ కనిపించిన ఫోటో లేదా వీడియోను ఎంచుకోవాలి. అనంతరం శాశ్వతంగా డిలీట్‌ చేయాలా లేదా Restore to library అనే ఆప్షన్‌లు కనిపిస్తాయి.

how to find deleted or damages photos and video on iOS 18

iOS 18 బీటా వెర్షన్‌ను కావాల్సినవారు డౌన్‌లోడ్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌ లోకి వెళ్లాలి. అనంతరం జనరల్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ నుంచి iOS 18 పబ్లిక్‌ బీటా వెర్షన్‌ను ఎంచుకొని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ వెర్షన్‌లో బగ్స్‌ మరియు ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల అదనపు ఫోన్‌లో మాత్రమే ఈ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది.

iOS 18 లో బ్యాటరీ టెక్నాలజీ :
ప్రస్తుతం ఐఫోన్ 15 సిరీస్‌లో ఛార్జింగ్‌పై పరిమితి విధించేందుకు మరియు బ్యాటరీ పనితీరును మెరుగుపరిచేందుకు అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. అయితే 80 శాతం వరకు మాత్రమే ఛార్జింగ్‌ పరిమితులు విధించే అవకాశం ఉంది. అదే iOS 18లో మరింత అప్‌గ్రేడ్‌ ఫీచర్‌లను కలిగి ఉంది. ఛార్జింగ్‌ను 85 శాతం, 90 శాతం, 95 శాతం వద్ద పరిమితిని విధించుకొనే అవకాశం ఉంది.

దీంతోపాటు iOS 18 గత OS వెర్షన్‌ల కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ఐఫోన్ యూజర్‌లు స్లో ఛార్జర్‌లను వినియోగిస్తున్న సమయంలో వారిని అప్రమత్తం చేస్తుంది. బ్యాటరీ మెనూలోని సెట్టింగ్స్‌ వద్ద ఈ ఫీచర్‌ను గుర్తించవచ్చు. గ్రాఫ్‌లో స్లో ఛార్జర్‌ వినియోగం గురించి తెలియజేస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to find deleted or damages photos and video on iOS 18
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X