ఆపిల్ సిరిని ఉపయోగించి కోల్పోయిన ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్, వాచ్‌లను కనుగొనడం ఎలా?

|

మీరు ఎంతగానో ఇష్టపడి మరియు కస్టపడి కొనుకున్న ఏదైనా ఒక పరికరాన్ని కోల్పోవడం అనేది సమస్యాత్మకంగా ఉంటుంది కదూ. ప్రత్యేకించి స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, స్మార్ట్‌వాచ్, ల్యాప్‌టాప్ లేదా మ్యూజిక్ ప్లేయర్ వంటి స్మార్ట్ డివైస్ కోల్పోతే మరింత బాధపడవలసి ఉంటుంది. అయితే యాపిల్ యూజర్లు కోల్పోయిన తమ ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్, మాక్ లేదా ఆపిల్ వాచ్‌ని కనుగొనడానికి ఫైండ్ మై ఫీచర్‌ ఎంతగానో సహాయపడుతుంది. అయితే వినియోగదారులు తమ ఆపిల్ డివైస్లలో పొందుపరిచిన వాయిస్ అసిస్టెంట్ - సిరిని ఉపయోగించి కూడా కనుగొనవచ్చు. అయితే సిరిని ఉపయోగించి మీ డివైస్ ను తక్షణమే గుర్తించడానికి మీ డివైస్ తప్పనిసరిగా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి. లేకపోతే పోయిన డివైస్ మళ్లీ ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్‌ను అందుకుంటుంది.

 
ఆపిల్ సిరిని ఉపయోగించి కోల్పోయిన ఐఫోన్, ఐపాడ్, వాచ్‌లను కనుగొనడం ఎలా?

ఆపిల్ తన సపోర్ట్ పేజీలో హ్యాండ్ గైడ్‌ను షేర్ చేసింది. ఇది యూజర్లు తమ కోల్పోయిన ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్, మాక్ మరియు ఆపిల్ వాచ్ పరికరాలను కనుగొనడంలో సహాయపడుతుంది. సిరిని ఉపయోగించి ఏదైనా డివైస్ ను కనుగొంటే కనుక కార్యాచరణ సజావుగా పనిచేయడానికి వినియోగదారులు తమ పరికరాలను వారి ఐక్లౌడ్ అకౌంటులకు లింక్ చేయాల్సి ఉంటుంది.

సిరిని ఉపయోగించి కోల్పోయిన ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్ టచ్, మ్యాక్ లేదా ఆపిల్ వాచ్‌ను కనుగొనే విధానం

సిరిని ఉపయోగించి కోల్పోయిన ఆపిల్ డివైస్ ను కనుగొనడం చాలా సులభం. అయితే కోల్పోయిన డివైస్ Wi-Fi లేదా సెల్యులార్ డేటాను ఉపయోగించి ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడితే మాత్రమే వారు తక్షణమే కనుగొనబడతారని వినియోగదారులు గమనించాలి.

ఆపిల్ సిరిని ఉపయోగించి కోల్పోయిన ఐఫోన్, ఐపాడ్, వాచ్‌లను కనుగొనడం ఎలా?

** వాయిస్ కమాండ్ "హే సిరి" ద్వారా సిరిని పిలవండి లేదా హోమ్ బటన్, సైడ్ బటన్ లేదా టాప్ బటన్ నొక్కండి.

** నా 'X' ను కనుగొనమని అడగండి (iPhone లేదా Apple Watch వంటి కోల్పోయిన పరికరం పేరుతో 'X' ని భర్తీ చేయండి).

** సిరి అప్పుడు ఫైండ్ మై యాప్‌లో లింక్ చేయబడిన డివైస్ లొకేషన్ ను మ్యాప్‌లో చూపుతుంది.

** అదనంగా సిరి ద్వారా గుర్తించడం సులభం చేయడానికి కోల్పోయిన పరికరంలో బీప్ ధ్వనిని కూడా ప్లే చేస్తుంది.

కోల్పోయిన డివైస్ ఆఫ్‌లైన్‌లో ఉంటే సిరి సంబంధం లేకుండా ఆదేశాన్ని పంపుతుంది మరియు ఆన్‌లైన్‌కు తిరిగి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఆ పరికరానికి పంపబడుతుంది. ఏదేమైనా వినియోగదారులు తమ పరికరాలు పోయినట్లు మరియు సులభంగా కనుగొనబడలేదని విశ్వసిస్తే, పోగొట్టుకున్న పరికరం గురించి తమ సమీప పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేసుకోవాలని సూచించారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Find Lost iPhone, iPad, iPod, Mac and Apple Watch Using Siri Voice Commands

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X