Home
How to

ఫోన్ పోయిందా.. ఈ విషయం తెలియక చాలా మంది వెంటనే కొత్త ఫోన్‌లు కొనుగోలు చేస్తున్నారు..!

స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం మనిషి జీవితంలో సుమారు ఓ భాగం అయిపోయింది. కాలింగ్‌, డేటా అవసరాలతోపాటు బ్యాంకింగ్‌ ఇతర పనులను స్మార్ట్‌ఫోన్‌ ద్వారా సులభంగా పూర్తి చేస్తున్నాం. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌ లేనిదే చాలా మందికి రోజు గడవని పరిస్థితి నెలకొంది. దీంతోపాటు వ్యక్తిగత వివరాలను స్మార్ట్‌ఫోన్‌లో భద్రపరుస్తున్నాం. అయితే అలాంటి ఫోన్‌ను పోగొట్టుకోవడం లేదా దొంగిలించబడితే ఏం చేయాలో చాలా మందికి అవగాహన లేదు. స్మార్ట్‌ఫోన్‌లోని డేటా సహా ఇతర వివరాల భద్రతపై ఆందోళన చెందుతున్నారు.

కొంత మంది సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదు చేస్తున్నాయి. మరికొంత మంది ఫిర్యాదు కూడా ఇవ్వడం లేదు. నేరుగా వెళ్లి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఫోన్‌ పొగోట్టుకుంటే దానిపై పూర్తిగా ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి ఉన్న టెక్నాలజీతో మీ ఫోన్‌ను రికవరీ చేసే (How to Find lost or Stolen Phones) అవకాశం ఉంది.

CEIR website helps to recovery of lost or stolen phones

ఫోన్‌ను బ్లాక్‌ చేయవచ్చు :
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోన్‌కు సంబంధించిన వివరాలతో ఆ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేస్తే.. తొలుత మీ ఫోన్‌ను ఎవరూ వినియోగించకుండా బ్లాక్‌ చేస్తారు. అనంతరం మీ ఫోన్‌ ఎక్కడుందో గుర్తించి, మీకు అందిస్తారు. అయితే ఈ వెబ్‌సైట్‌లో ఎలా ఫిర్యాదు చేయాలి, అందుకు ఏమేం వివరాలు కావాలో ఈ కథనంలో తెలుసుకోండి.

పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్‌లను రికవరీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్ట్రి (CEIR) వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఫిర్యాదు చేసే ముందు మీ సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అందుకు సంబంధించిన రిసీప్ట్‌ను దగ్గర పెట్టుకోవాలి. పోగొట్టుకున్న ఫోన్‌కు సంబంధించిన IMEI నంబర్‌, ఆ ఫోన్‌లో ఉన్న సిమ్‌ కార్డు నంబర్‌లను కూడా కలిగి ఉండాలి.

CEIR website helps to recovery of lost or stolen phones

ఎలా ఫిర్యాదు చేయాలి..?
CEIR వెబ్‌సైట్‌లోకి ( www.ceir.gov.in ) వెళ్లాలి. బ్లాక్‌ స్టోలెన్‌ / లాస్ట్‌ మొబైల్‌ అనే ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి. అనంతరం అక్కడ మీ దగ్గరున్న IMEI, ఫోన్‌ నంబర్‌లు సహా ఇతర అవసరం అయిన వివరాలతో ఫిర్యాదు నమోదు చేయాలి. ఆధార్‌ కార్డు వంటి గుర్తింపు కార్డును జత చేయాలి. ఫిర్యాదు పూర్తయిన తర్వాత మీకు రిక్వస్ట్‌ ఐడీ వస్తుంది.

24 గంటల్లో ఏం జరుగుతుంది ?
మీ నుంచి ఫిర్యాదు అందిన 24 గంటల్లోకి మీరు పోగొట్టుకున్న ఫోన్‌ను ఇతరులు వినియోగంచకుండా బ్లాక్‌ చేస్తారు. అయితే ఆ ఫోన్‌లో కొత్త సిమ్‌ కార్డును వేసి, వినియోగించుకొనేందుకు ప్రయత్నం చేస్తే.. CEIR వెబ్‌సైట్‌కు అలెర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. దీని ఆధారంగా ఫోన్‌ ఏ ప్రాంతంలో ఉందో పోలీసులు ట్రాక్‌ చేస్తారు.

CEIR website helps to recovery of lost or stolen phones

అనంతరం మీ ఫోన్‌ను రికవరీ చేసేందుకు ప్రయత్నం చేస్తారు. మీ ఫోన్‌ మీ చేతికి వచ్చాక అన్‌బ్లాక్‌ చేసుకొనే వీలుంది. CEIR వెబ్‌సైట్‌ ద్వారా అన్‌బ్లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం అన్‌బ్లాక్‌ ఫౌండ్‌ ఫోన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ ఫోన్ కొనుగోలు చేసినప్పుడు IMEI వివరాలు వేరే చోట నమోదు చేసుకోవాలి. ఫోన్‌ పోగొట్టుకున్న సమయంలో రికవరీ చేసేందుకు ఈ వివరాలు ఎంతో అవసరం.

More from GizBot

Best Mobiles in India

English summary
How to Find lost or stolen phones with CEIR website here is the detailed guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X