ఈ కోడ్‌ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు

|

ప్రస్తుత రోజులలో స్మార్ట్‌ఫోన్ ను ఉపయోగించని వారు ఉండరు అలాగే దానిని ప్రతి ఒక్కరూ తమతోపాటు 24/7 ఉంచుకుంటూ వినియోగిస్తూ ఉంటారు. అయితే మొబైల్‌ను ఉపయోగిస్తున్న వారు ఎవరితో మాట్లాడుతున్నారు మొదలైనవాటిపై గూఢచర్యం చేయడాన్ని లక్ష్యంగా చేసుకోనే మొదటి పరికరంగా ఉంటుంది. అందువల్ల వైరస్‌లు, ట్రోజన్ హార్స్‌లు, మాల్‌వేర్ వంటివి మరిన్ని ముందుకు వస్తూ ఉంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న అధిక మంది వినియోగదారులలో మీరు కూడా ఉంటే కనుక మీరు ట్రాక్ చేయబడుతున్నారా లేదా హ్యాక్ చేయబడుతున్నారా అని మీరు కనుగొనాలని చూస్తుంటే కనుక కింద ఉన్న పద్దతులను అనుసరించి కనుగొనవచ్చు.

 
ఈ కోడ్‌ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు

మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనే విధానం

మీరు ఉపయోగిస్తున్న మీ యొక్క మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనాలి అని మీరు ప్రయత్నిస్తుంటే కనుక కొన్ని కోడ్‌లు మరియు కొన్ని ఫంక్షన్‌ల సాయంతో కనుగొనవచ్చు. మీరు ట్యాప్ చేయబడుతున్నారని మీకు అనుమానం ఉంటే కనుక మీ యొక్క డయల్ ప్యాడ్‌లో ఈ కోడ్‌లను టైప్ చేసి సులభంగా కనుగొనవచ్చు.

ఈ కోడ్‌ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు

*#21#

*#21# కోడ్‌తో మీ మెసేజ్ లు, కాల్‌లు లేదా ఇతర డేటా ఫార్వార్డ్ చేయబడిందా లేదా వేరే నంబర్‌కి మళ్లించబడిందా అని మీరు చూస్తారు. ఒకవేళ ఈ డేటా ఫార్వార్డ్ చేసినట్లయితే కనుక మీరు మీ స్క్రీన్‌పైనే ఈ సమాచారం ఫార్వార్డ్ చేయబడే నంబర్‌తో పాటు అన్ని రకాల ఫార్వార్డ్ రకాలను కూడా చూస్తారు.

*#62#

ఒకవేళ మీ నంబర్ నో-సర్వీస్ లేదా నో-ఆన్సర్ అని చెబుతున్నట్లు ఎవరైనా వ్యక్తులు మీకు చెబితే కనుక మీరు ఈ కోడ్‌ని ఉపయోగించవచ్చు. ఇది మీ కాల్‌లు, మెసేజ్లు మరియు డేటా దారి మళ్లించబడుతున్నాయో లేదో మీకు తెలియజేస్తుంది. ఈ సమాచారం మీ సెల్ ఫోన్ ఆపరేటర్ నంబర్‌కు మళ్లించబడిందో లేదో కూడా ఇది వెల్లడిస్తుంది. అయితే దీని కోసం చాలా సమయం తీసుకుంటుంది.

##002#

ఈ కోడ్‌ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు

ఈ కోడ్ సాయంతో వినియోగదారులు వారి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల నుండి అన్ని రకాల దారి మళ్లింపులను స్విచ్ ఆఫ్ చేయడానికి అనుమతిస్తుంది. మీరు రోమింగ్‌ని ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నప్పుడు మరియు అవాంఛిత కాల్‌ల కోసం డబ్బు చెల్లించకూడదనుకున్న సమయంలో కూడా ఇది మీకు డబ్బును ఆదా చేస్తుంది.

*#06#

ఈ కోడ్ సాయంతో యూజర్లు తమ ఫోన్ యొక్క IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫైయర్) నెంబర్ ను కనుగొనవచ్చు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ లేదా CEIR వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్ స్థానాన్ని ట్రాక్ చేయడానికి ఈ నంబర్‌ను ఉపయోగించవచ్చు. ఈ నంబర్ ఫోన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు లేదా కొత్త SIM కార్డ్‌ని కలిగి ఉన్నప్పటికీ దాన్ని ట్రాక్ చేయడంలో మీకు సహాయం చేస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Find Out Who are Trying Hacked Your Mobile Phone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X