మీ కంప్యూటర్‌లో డూప్లికేట్ ఫైల్స్‌ను ఏరిపారేయటం ఎలా..?
కంప్యూటర్లలో పేరుకుపోయి డూప్లికేట్ ఫైళ్లను రిమూవ్ చేసేందుకు కొన్ని ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి
రోజు మన కంప్యూటర్‌లో అనేక ఫైళ్లను కాపీ చేసి పేస్ట్ చేస్తుంటాం. ఈ సందర్భంలో బోలెడంత స్పేస్ వేస్ట్ అవుతుంది. కంప్యూటర్లలో పేరుకుపోయి డూప్లికేట్ ఫైళ్లను రిమూవ్ చేసేందుకు కొన్ని ఆప్షన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలో సలువైన పద్ధతులను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాం.
Read More : భారత్ కోసం గూగుల్ రూ.2000 ఫోన్

మొదటి పద్దతి
స్టెప్ 1
ముందుగా Duplicate Files Finder అనే ప్రోగ్రామ్‌ను ఇంటర్నెట్ నుంచి మీ పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే మీ పీసీలోని డూప్లికేట్ ఫైల్స్‌ను డిలీట్ చేసేందుకు ప్రోగ్రామ్‌ను ఓపెన్ చేయండి. ఇప్పడు Duplicate Files Finder ప్రోగ్రామ్‌కు సంబంధచి ఓ ప్రత్యేకమైన మెనూ మీ ముందు కనిపిస్తుంది.

మొదటి పద్దతి
స్టెప్ 2
Duplicate Files Finder మెనూలో కుడివైపు ఎడిట్ లిస్ట్ కనిపిస్తుంది. అందులో Add బటన్ పై క్లిక్ చేసి డూప్లికేట్ ఫైళ్లను ఏరివేయాలనుకుటున్న ఫోల్డర్‌ను సెలక్ట్ చేసుకుని OK బటన్ పై క్లిక్ చేయండి. ఫైల్ స్కానింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. స్కానింగ్‌లో భాగంగా డూప్లికేట్ ఫైల్స్ ట్రేస్ అయిన వెంటనే వాటిని మెనూలోని మెసేజ్ బాక్స్ డిస్‌ప్లే చేస్తుంది. అలా డిస్‌ప్లే అయిన
ఫైల్స్‌ను ఓపెన్ చేసి డిలీట్ చేస్తే సరిపోతుంది.

రెండవ పద్ధతి
స్టెప్ 1
Duplicate Cleaner అనే ప్రోగ్రామ్ ద్వారా కూడా మీ పీసీలోని డూప్లికేట్ ఫైల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు. ముందుగా Duplicate Cleaner యాప్‌ను ఇంటర్నెట్ నుంచి మీ పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. యాప్ ఓపెన్ అయినే వెంటనే స్కాన్ క్రైటీరియాను సెలక్ట్ చేసుకుని స్కాన్‌ను ప్రారంభించండి.

రెండవ పద్ధతి
స్టెప్ 2
స్కాన్ ప్రక్రియ పూర్తవటానికి కొన్ని నిమిషాలు పడుతుంది. అప్పటి వరకు నిరీక్షించండి. స్కాన్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే డూప్లికేట్ ఫైల్స్ మార్క్ కాబడి మీకు కనిపిస్తాయి. వాటిని డిలీట్ చేసుకుంటే సరిపోతుంది.


Click it and Unblock the Notifications








