Home
How to

హోటల్‌ రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు ఉన్నాయనే భయమా... స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా గుర్తించవచ్చు..!

గతంలో పోలిస్తే అనేక మంది విహార యాత్రలకు వెళ్తున్నారు. దీంతోపాటు వివిధ పనుల కోసం నగరాలకు, కొత్త ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో సమీపంలోని హోటల్స్‌ను బుక్‌ చేసుకుంటున్నారు. కొన్ని రూమ్స్‌లో స్పై లేదా సీక్రెట్‌ కెమెరాలను (secret camera) అమర్చి.. ఆ వీడియోలతో బెదిరింపులకు దిగిన అనేక ఘటనలకు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళలకు ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏ ప్రాంతం సురక్షితమైనదో తెలియక మహిళలు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందని, అన్ని హోటల్ రూమ్స్‌లో కెమెరాలు ఉంటున్నాయని ధ్రువీకరించడం లేదు కానీ.. గతంలో చోటు చేసుకున్న కొన్ని ఘటనల కారణంగా ముఖ్యంగా మహిళల్లో అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఏదైనా సందర్భంలో హోటళ్లకు వెళ్లాల్సి వస్తే కొన్ని చిట్కాల ద్వారా అక్కడ కెమెరాలు ఉన్నాయా లేదా అనే విషయం గుర్తించేందుకు అవకాశం ఉంది.

How to find secret cameras in hotel room

స్మార్ట్‌ఫోన్‌ ద్వారా సీక్రెట్‌ కెమెరాల గుర్తింపు :
స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కూడా రూమ్స్‌లోని సీక్రెట్‌ కెమెరాలను గుర్తించేందుకు వీలుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్‌, iOS లో ఇప్పటికే కొన్ని యాప్‌లు ఉన్నాయి. వీటి ద్వారా కూడా స్పై కెమెరాలను గుర్తించవచ్చు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటల్స్‌లో ఎక్కువగా నివాసం ఉండేవారికి ఈ చిట్కాలు ఉపయోగపడతాయి.

స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌ లైట్‌ ద్వారా సీక్రెట్ లేదా స్పై కెమెరాలను గుర్తించేందుకు అవకాశం ఉంది. ఎలాంటి సీక్రెట్‌ కెమెరాలు అయినా ఏదో ఒక లైట్‌ను రిఫ్లెక్ట్‌ చేస్తాయి. దీనిని స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్‌ ద్వారా కనుగొనవచ్చు. ఇందుకోసం తొలుత రూమ్‌లోని లైట్లు అన్ని ఆఫ్‌ చేయాలి. అనంతరం ఫోన్‌ ఫ్లాష్‌ లైట్‌ను ఆన్‌ చేసి.. రూమ్‌ అంతా వెతకాల్సి ఉంటుంది.

ముఖ్యంగా రూమ్‌లోని మిర్రర్‌, స్మోక్‌ డిటెక్టర్‌లు, ఎయిర్‌ వెంట్స్‌, గడియారాలు, డెకరేషన్‌, USB ఛార్జింగ్‌ పోర్ట్‌లు సహా కెమెరాలు అమర్చేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు చేయాలి. చిన్న లెన్స్‌ లేదా ఇతర రిఫ్లక్టింగ్‌ లైట్‌లను గుర్తించినా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలతో :
దీంతోపాటు స్మార్ట్‌ఫోన్‌ కెమెరాల ద్వారా కూడా ఈ తరహా సీక్రెట్‌ కెమెరాలను గుర్తించేందుకు అవకాశం ఉంది. అనేక స్పై కెమెరాలు ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ను విడుదల చేస్తాయి. మన కళ్లకు ఈ లైట్‌లు కనిపించే అవకాశం తక్కువ.. కానీ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాల ద్వారా వీటిని గుర్తించేందుకు అవకాశం ఉంది.

ఇందుకోసం హోటల్‌ రూమ్‌లో లైట్‌లు అన్నీ ఆఫ్‌ చేయాలి. అనంతరం సీక్రెట్‌ కెమెరాలు అమర్చేందుకు వీలున్న ప్రతి ప్రదేశంలో స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ద్వారా తనిఖీ చేయాలి. ఆ రూమ్‌లో ఏమైనా కెమెరాలు ఉంటే ఆ ప్రాంతంలో చిన్న చుక్కలు లేదా మెరుస్తున్నట్లు అనిపించినా అనుమానించవచ్చు.

వైఫై, బ్లూటూత్‌ కనెక్షన్‌తో :
దీంతోపాటు వైఫై నెట్‌వర్క్‌ల ద్వారా కూడా ఈ తరహా కెమెరాలను గుర్తించేందుకు వీలుంది. స్పై లేదా సీక్రెట్‌ కెమెరాలను డేటాను ఇతర డివైజ్‌లకు బదిలీ చేసేందుకు వైఫై లేదా బ్లూటూత్‌ కనెక్షన్‌ అవసరం ఉంటుంది. అందువల్ల మీరు నివాసం ఉంటున్న ప్రాంతంలో అనుమానాస్పదంగా IP Camera లేదా Camera వంటి పేర్లతో వైఫై కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి.

దీనిపై సంబంధిత వర్గాలకు ఫిర్యాదు చేయాలి. వీటితోపాటు ఈ కెమెరాలను గుర్తించేందుకు ఆండ్రాయిడ్‌, iOS స్టోర్‌లో కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ల ద్వారా హోటల్‌ లేదా ఇతర కొత్త ప్రాంతాల్లో స్పై కెమెరాలను గుర్తించవచ్చు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
How to find secret cameras in hotel rooms using smartphones here are the tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X