మీరు వాడుతోన్న సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి Serial Keyలను తెలుసుకోవటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

టెక్నాలజీతో మమేకమవుతోన్న చాలా మంది నెటిజనలు తమ రోజువారి కమ్యూనికేషన్ అవసరాలను తీర్చుకునే క్రమంలో అనేక సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించుకోవటం జరుగుతోంది. ఇంటర్నెట్‌లో లభ్యమవుతోన్న సాఫ్ట్‌వేర్‌లలో చాలా వరకు సాఫ్ట్‌వేర్‌లు ఉచితంగానే లభ్యమవుతున్నాయి. ఉచితంగా లభ్యమయ్యే సాఫ్ట్‌వేర్‌లను కొంత కాలం వరకే పూర్తిగా యాక్సిస్ చేసుకునే వీలుంటుంది. వీటి సర్వీసులను పూర్తిస్థాయిలో యాక్సిస్ చేసుకోవాలంటే కొంత కాలం తరువాత రీన్యూవల్ ప్రొడక్ట్ కీని తప్పనిసరిగా ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

మీరు వాడుతోన్న సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి Serial Keyలను తెలుసుకోవటం ఎలా

సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ఆయా సీరియల్ 'కీ'లను చాలా వరకు వెబ్‌సైట్‌లు అందుబాటులో ఉంచటం జరుగుతోంది. అయితే వీటిని సాధారణ కీవర్డ్స్ ద్వారా సెర్చ్ చేయటం కుదరటం లేదు. ఇలాంటి సమస్య ఎదురైనపుడు ఏమాత్రం సంకోచించకుండా గూగుల్ ద్వారా మీ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న గూగుల్ డేటాబెస్ సెర్చింగ్ ట్రిక్‌ను ఉపయోగించుకుని సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి ప్రొడక్ట్ కీలను సంపాదించవచ్చు. ఆ ప్రొసీజర్ ఏంటో ఇప్పుడు తెలసుకుందాం...

256 జిబి స్టోరేజ్ కెపాసిటితో కొత్త స్మార్ట్‌ఫోన్‌,ధర ఫీచర్ల వివరాలు

94FBR అనే కోడ్‌ను చివర యాడ్ చేస్తే..
ముందుగా మీ కంప్యూటర్ నుంచి గూగుల్‌ను ఓపెన్ చేయండి. ఆ తరువాత సెర్చ్ కాలమ్‌లో సాఫ్ట్‌వేర్ పేరును ఎంటర్ చేసి చివర 94FBR అనే కోడ్‌ను యాడ్ చేయండి. ఉదాహరణకు మీరకు open office అనే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ప్రొడక్ట్ కీని పొందాలనుకుంటున్నట్లయితే గూగుల్ సెర్చ్ పేజీలో open office 94FBR అని టైప్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఓపెన్ అయ్యే సెర్చ్ రిజల్ట్స్‌లో మీ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ప్రొడక్ట్ కీలను నేరుగా మీరు చూడగలుగుతారు. తదుపరి స్టెప్‌లో భాగంగా ఆ 'కీ'లను కాపీ చేసి చేసుకుని సంబంధిత సాఫ్ట్‌వేర్ టెక్స్ట్ ఫీల్డ్‌లో పేస్ట్ చేసినట్లయితే ఆయా సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి పూర్తి యాక్సిస్ మీకు లభిస్తుంది.

ప్రొడక్ట్, యాక్టివేషన్ ఇంకా సీరియల్ కీలను సులువుగా పొందవచ్చు..పైన పేర్కొన్న ప్రొసీజర్‌ను ఫాలో అవటం ద్వారా సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన ప్రొడక్ట్, యాక్టివేషన్ ఇంకా సీరియల్ కీలను సులువుగా పొందేందుకు వీలుంటుంది. ఈ కూల్ గూగల్ సెర్చ్ ట్రిక్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయగలరు.

English summary
Here is method by which you can easily find serial key of any software 2018 on internet. Mostly these softwares are third party software. And the product key is inturn paid for the user and at the end of day software is freeware only for few days.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot