ఫేస్‌బుక్ మీ ఫోన్ డేటాను సేకరిస్తోందా..? అయితే ఇలా చేయండి

Posted By: BOMMU SIVANJANEYULU

ఫేస్‌బుక్ పై ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా వినిపిస్తోన్న మరో కాంట్రవర్శీ ప్రకారం ఫేస్‌బుక్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి కాల్ హిస్టరీతో పాటు కాంటాక్ట్స్ సమాచారం అలానే ఎస్ఎంస్ డేటాలను సేకరిస్తున్నట్లు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ ఆరోపణల పై వివరణ ఇచ్చుకున్న ఫేస్‌బుక్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింతగా మెరుగుపరిచే ఉద్దేశ్యంతోనే డేటాను కలెక్ట్ చేస్తున్నామని, ఆండ్రాయిడ్ డివైస్‌ల నుంచి సేకరించిన డేటాను థర్డ్ పార్టీ యాప్స్‌కు తాము షేర్ చేయటం లేదని ఫేస్‌బుక్ స్పష్టం చేసింది. ఏదేమైనప్పపటికి ఫేస్‌బుక్ ప్రైవసీ రిస్క్స్ నుంచి మీ ఆండ్రాయిడ్ డివైస్‌ను దూరంగా ఉంచుకునేందుకు ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి..

ఫేస్‌బుక్ మీ ఫోన్ డేటాను సేకరిస్తోందా..? అయితే ఇలా చేయండి

ఎలాంటి డేటాను కలెక్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే..?
మీ ఆండ్రాయిడ్ డివైస్ నుంచి ఫేస్‌బుక్ ఏ విధమైన డేటాను కలెక్ట్ చేస్తుందో తెలుసుకోవాలంటే ముందుగా డెస్క్‌టాప్ నుంచి https://register.facebook.com/download/ పేజీలోకి వెళ్లండి. ఈ పేజీలోకి వెళ్లిన వెంటనే జనరల్ అకౌంట్ సెట్టింగ్స్ మెనూ ఓపెన్ అయి ఉంటుంది. ఈ మెనూలో 'Download a copy' అనే లింక్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.

డేటా .zip ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది
ఈ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే 'Download your Information' పేజీలోకి మీరు రీడైరెక్ట్ కాబడతారు. ఈ పేజీలో 'Share My Archive' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ ఫేస్‌బుక్ డేటా డౌన్‌లోడింగ్‌కు సిద్ధమవతుంది. ఆ ప్రాసెస్ పూర్తయిన వెంటనే 'Download Archive' ఆప్షన్ ప్రత్యేక్షమవుతుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీ ఫేస్‌బుక్ డేటా .zip ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది. డౌన్‌లోడ్ అయిన ఫైల్‌ను ఎక్స్ ట్రాక్ట్ చేసకోవటం ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్ నుంచి ఫేస్‌బుక్ ఏ విధమైన డేటాను కలెక్ట్ చేస్తుందో తెలుసుకునే వీలుంటుంది.

వన్‌ప్లస్ 6 లీక్‌లు చెపుతున్న కొత్త ఫీచర్స్ ఇవే ...

Synced Contactsన టర్నాఫ్ చేసుకుంటే...
ఫేస్‌బుక్ మీ ఆండ్రాయిడ్ డివైస్ నుంచి కాంటాక్ట్స్ డేటాను కలెక్ట్ చేయకుండా ఉండాలంటే డేటా సింక్ ఆప్షన్‌ను టర్నాఫ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇలా చేయలాంటే యాప్ మొయిన్ స్ర్కీన్ టాప్ రైట్ కార్నర్ పై కనిపించే ప్రొఫైల్ పిక్షర్ పై క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో పీపుల్ ఆప్షన్‌లోకి వెళ్లి Synced Contactsన టర్నాఫ్ చేసుకుంటే సరిపోతుంది.

English summary
Do you use an Android smartphone? If so, get to know the data that is collected by Facebook and prevent the same from happening again from the steps given here.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot