మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో స్పకర్ సమస్యలా..?
ఓవర్ హీటింగ్, నెట్‌వర్క్ ఎర్రర్, చార్జింగ్ ఇష్యూ, కెమెరా ఇష్యు, యాప్ క్రాష్ ఇలా రకరకాల సమస్యలు స్మార్ట్‌ఫోన్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి.
స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరుగుతున్న కొద్ది వాటిలో సమస్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవర్ హీటింగ్, నెట్‌వర్క్ ఎర్రర్, చార్జింగ్ ఇష్యూ, కెమెరా ఇష్యు, యాప్ క్రాష్ ఇలా రకరకాల సమస్యలు స్మార్ట్‌ఫోన్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. వీటితో పాటు మరో సమస్య కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్లను వేధిస్తోంది. అదే స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్పీకర్ ఇష్యు...

సౌండ్ నెమ్మదిగా రావటం, స్పీకర్ పనిచేయకపోవటం..
ఫోన్ స్పీకర్ నుంచి సౌండ్ నెమ్మదిగా రావటం, స్పీకర్ పనిచేయకపోవటం, వాల్యుమ్ సెట్టింగ్స్ స్పందించకపోవటం లాంటివి ఇంటర్నల్ స్పీకర్ సమస్య తాలుకా సంకేతాలే. సామ్‌సంగ్, నోకియా, ఎల్‌జీ, యాపిల్, మైక్రోమాక్స్, షియోమీ వంటి బ్రాండెడ్ ఫోన్‌లలో తలెత్తే ఇంటర్నల్ స్పీకర్ సమస్యను సులువుగా పరిష్కరించుకునేందుకు ఉత్తమ మర్గాలను ఇప్పుడు చూద్దాం....

సమస్య వాల్యుమ్ సెట్టింగ్స్‌లో ఉన్నట్లయితే...
సమస్య వాల్యుమ్ సెట్టింగ్స్‌లో ఉన్నట్లయితే ముందుగా మీ ఫోన్ సైలెంట్ లేదా వైబ్రేటర్ మోడ్‌లో ఉందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే మోడ్‌ను మార్చుకుంటే సరిపోతుంది. మీ ఫోన్‌లో ఉచిత అవుట్ గోయింగ్ కాల్స్ సౌకర్యం ఉన్నట్లయితే మీ మిత్రులకు ఫోన్ చేసి వాల్యుమ్‌ను చెక్ చేసుకోండి. అవసరమనుకుంటే ఇన్-కాల్ వాల్యుమ్‌ను పెంచుకోండి.

సమస్య మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నట్లయితే
పై సూచనలను పాటించినప్పటికి స్పీకర్ సమస్య మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నట్లయితే ఫోన్ స్పీకర్‌తో పాటు మైక్‌ను ఓ సారి చెక్ చేయండి. ఏదైనా సమస్య డిటెక్ట్ అయినట్లయితే ఫోన్‌ను సమీపంలోని మొబైల్ రిపేర్ సెంటర్ వద్దకు తీసుకువెళ్లి రిపేర్ చేయించుకోండి.

సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా...
కొన్ని సందర్భాల్లో ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా సౌండ్ సమస్యలు తెలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు. మీ ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి *#0*#కు డయల్ చేయటం ద్వారా ఫోన్ హార్డ్ వేర్ సమస్యలను తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications