COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లో లోపాలు ఉన్నాయా?? అయితే ఇలా సరిచేయండి...

|

కరోనా కట్టడి కోసం ప్రభుత్వం వ్యాక్సిన్ లను పంపిణీ చేస్తోంది. మీరు కోవిడ్ -19 యొక్క కోవిషీల్డ్, కోవాక్సిన్ లేదా స్పుత్నిక్ వ్యాక్సిన్ ను పొందిన తదుపరి దశలో కోవిన్ పోర్టల్‌కు వెళ్లి టీకా సర్టిఫికెట్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్టిఫికేట్ అనేది తరువాతి ప్రయాణానికి తప్పనిసరి అవుతుంది. దీని కారణంగా సర్టిఫికెట్‌లో మీ యొక్క సమాచారం సరిగ్గా ఉందొ లేదో అని చూసుకోవడం మరింత ముఖ్యమైనదిగా ఉంది. మీరు మీ టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేశారా? ఇందులో మీ పేరు తప్పుగా పేర్కొనబడిందా? లేదా లింగం లేదా పుట్టిన తేదీ తప్పుగా ఉంటే కనుక ఆ సందర్భంలో మీరు https://www.cowin.gov.in/ లోని కోవిన్ పోర్టల్‌కు వెళ్లి ఈ వివరాలను సరిచేయవచ్చు.

మీ COVID-19 టీకా వివరాలను మార్చే విధానం

మీ COVID-19 టీకా వివరాలను మార్చే విధానం

COVID-19 టీకా యొక్క సర్టిఫికెట్‌లోని లోపాన్ని సరిదిద్దడానికి కోవిన్ ఇప్పుడు కొత్తగా ఒక ఎంపికను జోడించారు. " రైజ్ ఏ రిక్వెస్ట్" పేరుతో వచ్చిన ఈ కొత్త ఫీచర్ మీ యొక్క కోవిన్ టీకా సర్టిఫికెట్లలో మీ పేరు, పుట్టిన సంవత్సరం మరియు లింగానికి సంబందించిన అనుకోని లోపాల దిద్దుబాట్లను సరిచేయవచ్చు.

 

Android 12 బీటా 2 లో కొత్తగా లభించే ప్రైవసీ ఫీచర్స్ వివరాలు ఇవిగో...Android 12 బీటా 2 లో కొత్తగా లభించే ప్రైవసీ ఫీచర్స్ వివరాలు ఇవిగో...

 క్రొత్త ఫీచర్‌

కాబట్టి ఇప్పుడు ఈ క్రొత్త ఫీచర్‌ను ప్రారంభించడంతో ప్రతి ఒక్కరూ మీ COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లో ఏదైనా అభ్యర్థనను లేవనెత్తవచ్చు మరియు ఏదైనా లోపాన్ని సరిదిద్దవచ్చు. అయితే మార్పులు ఒక్కసారి మాత్రమే చేయవచ్చని మీరు గమనించాలి. కాబట్టి మొదటిసారి విడుదలైన సర్టిఫికెట్‌ను పూర్తిగా తనిఖీ చేసి ఆపై కోవిన్ పోర్టల్‌లో మీ యొక్క అభ్యర్థనను ఉంచవచ్చు.

కోవిన్ వెబ్‌సైట్‌

COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లోని మీ యొక్క అభ్యర్థనను ఉంచడానికి మరియు లోపాన్ని పరిష్కరించడానికి కింద ఉన్న 5 సాధారణ దశలను అనుసరించండి.


స్టెప్ 1: కోవిన్ వెబ్‌సైట్‌కు వెళ్లి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి మరియు లాగిన్ అవ్వడానికి OTP ఇన్ పుట్ చేయండి.

స్టెప్ 2: అకౌంట్ విభాగానికి వెళ్లి "రైజ్ ఏ రిక్వెస్ట్" పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: తరువాత మీరు లేదా మీ యొక్క సభ్యుల పేరును ఎన్నుకోవాలి. మీరు ఒక మొబైల్ నంబర్‌తో నలుగురు సభ్యులను జోడించవచ్చు.

స్టెప్ 4: తరువాత సర్టిఫికేట్ "కరెక్షన్" ఎంపికపై క్లిక్ చేసి కొనసాగించు ఎంపికపై నొక్కండి.

స్టెప్ 5: పేరు, పుట్టిన సంవత్సరం మరియు లింగం వంటి వివరాలలో మీరు సరిచేయదలిచిన ఫీల్డ్‌ను ఎంచుకోండి. సరైన వివరాలను నమోదు చేసిన తరువాత మీ యొక్క అభ్యర్థనను నమోదు చేయడానికి కొనసాగించు ఎంపిక మీద నొక్కండి.

ఇలా చేయడంతో మీ వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఇప్పుడు సరైన వివరాలతో అప్ డేట్ చేయబడుతుంది.

 

Best Mobiles in India

English summary
How to Fix Errors in The COVID-19 Vaccine Certificate: Follow These Steps

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X