Home
How to

స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సమస్య ఉందా.. కారణాలు ఏంటో తెలుసా..?

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ లో ఇంటర్నెట్‌ ను వినియోగిస్తున్నప్పుడు కొన్నిసార్లు అకస్మాత్తుగా డేటా కనెక్షన్ నిలిచిపోతుంది. ముఖ్యమైన పనుల్లో ఉండగా... ఇంటర్నెట్‌ నిలిచిపోతే.. అదనపు డేటా కోసం రీఛార్జ్‌ చేస్తుంటాం. అయితే కొన్నిసార్లు ఫోన్‌ లో ఇతర సమస్యల కారణంగా కూడా ఇంటర్నెట్‌ నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే డేటా పరిమితి మిగిలి ఉండి కూడా ఇంటర్నెట్‌ కనెక్ట్‌ కాకుంటే కొన్ని చిట్కాల ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి ఆన్‌ చేయాలి: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సమస్యలు ఫోన్‌ రీస్టార్ట్‌ చేయడం ద్వారా పరిష్కారం అవుతాయి. ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సమస్య ఉన్నప్పుడు కూడా ఫోన్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి కొన్ని నిమిషాలపాటు వేచి చూసి ఆన్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల హ్యాండ్‌సెట్‌ కొన్నిసార్లు సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది. ఫోన్‌ రీస్టార్ట్‌ చేయడం వీలుకాకుంటే.. Airplane Mode ఆన్‌ చేసి ఆఫ్‌ చేయాలి.

Do You Face internet connectivity problems in android smartphone

సా‌ఫ్ట్‌వేర్‌ మరియు యాప్స్‌ అప్‌డేట్‌ చేయాలి : ఎక్కువ కాలంపాటు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌, యాప్స్‌ను అప్‌డేట్‌ చేయకపోవడం ఫోన్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ అందించిన ఆండ్రాయిడ్‌, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఫలితంగా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సహా ఇతర సమస్యలకు తలెత్తే అవకాశం ఉండదు.

కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌ల తరహాలోనే ఫోన్‌లోని Cache ను క్లియర్‌ చేయాలి. ఎక్కువ కాలంపాటు Cache క్లియర్‌ చేయకపోవడం వల్ల కూడా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ వంటి సమస్యలు వస్తాయి. మరియు ఫోన్‌ కూడా బాగా నమ్మదిగా పనిచేసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు అవసరం లేని యాప్‌లను మూసివేయాలి.

డేటా వినియోగం :
ఆండ్రాయిడ్‌ ఫోన్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ యాప్‌లు పనిచేయడం వల్ల కూడా ఇంటర్నెట్‌ స్పీడ్‌ తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతోపాటు ఎక్కువ డేటా వినియోగిస్తున్న యాప్‌లను గుర్తించాలి. దీంతోపాటు సెట్టింగ్స్‌ ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తున్న యాప్‌లకు డేటా పరిమితిని విధించవచ్చు. ఫలితంగా మీరు వినియోగిస్తున్న యాప్‌లు గరిష్ఠ వేగంతో పనిచేసే అవకాశం ఉంది.

పైన చెప్పిన టిప్స్‌ పాటించిన అనంతరం కూడా ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటే.. నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రిసెట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం Reset Network Settings ను ఎంచుకోవాలి. అనంతరం రీసెట్‌ చేయాలి. అయితే ఇలా చేయడం వల్ల మీ వైఫై నెట్‌వర్క్‌ మరియు బ్లూటూత్‌ కనెక్షన్‌లు తొలిగిపోనున్నాయి. పాస్‌వర్డ్ వినియోగించి తిరిగి కనెక్ట్ కావాల్సి ఉంటుంది.

గిజ్‌ బాట్‌ తెలుగు వెబ్‌ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
how to fix internet connectivity problems in android smartphone here are the tips
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X