Just In
- 2 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 5 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 7 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 8 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- News
ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం .. స్పందించిన మంత్రులు నారాయణ స్వామి,ధర్మాన.. ఏమన్నారంటే
- Sports
India vs Australia: ఈ విజయం కుర్రాళ్లదే!
- Finance
రెండ్రోజుల నష్టం ఒక్కరోజులో: సెన్సెక్స్ 834 పాయింట్లు జంప్: రిలయన్స్ సహా హెవీవెయిట్స్ అదుర్స్
- Lifestyle
అల్లం తేనెలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Movies
ఇంకా మోనాల్ అఖిల్ ట్రాక్‌ను వదలరా?.. యాంకర్ సుమ కూడా అంతే
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Mobile ఇంటర్నెట్ డేటా సమస్యలను పరిష్కరించే చిట్కాలు ఇవే!!!
స్మార్ట్ఫోన్లు అనేవి ప్రస్తుతం అందరి జీవితాలలో ఒక భాగం అయిపోయినాయి. ప్రసుత సమయాలలో ప్రపంచంతో కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ మంది ఇంటర్నెట్ కోసం మొబైల్ ఫోన్లపై ఆధారపడుతున్నారు. చాలా మంది ప్రస్తుతం ఇంటి వద్ద నుండి పని చేయడానికి మొబైల్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడం కోసం కూడా అధికంగా మొబైల్ ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. మీ యొక్క మొబైల్ డేటా అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోయిందా? అది పెద్ద సమస్యకు దారితీయకుండా మొబైల్ ఇంటర్నెట్ సమస్యలను త్వరగా పరిష్కరించడానికి మరియు మళ్లీ సజావుగా పని చేయడానికి గల చిట్కాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
చిట్కా 1: మొబైల్ డేటాను ఆపివేసి, మళ్లీ ప్రారంభించండి
మొబైల్ ఇంటర్నెట్ పని చేయని సందర్భంలో దానిని పరిష్కరించడానికి అన్నిటికన్నా సులభమైన మార్గం మీ స్మార్ట్‌ఫోన్‌లోని మొబైల్ డేటా ఎంపికను ఆపివేసి కొన్ని సెకన్ల తర్వాత దాన్ని మళ్లీ ప్రారంభించడం. దీని కోసం మీరు సెట్టింగుల మెనుకు వెళ్ళవచ్చు లేదా నోటిఫికేషన్ షేడ్ నుండి మొబైల్ డేటాను నేరుగా నిలిపివేయవచ్చు. చాలా ఫోన్లలో స్క్రీన్ పైభాగంలో నోటిఫికేషన్ ప్యానెల్ ఉంటుంది. అయితే కొన్ని స్మార్ట్ఫోన్లలో డిస్ప్లే యొక్క దిగువన నోటిఫికేషన్ షేడ్ కలిగి ఉంటుంది.
చిట్కా 2: ఫ్లైట్ మోడ్‌ను ప్రారంభించడం
మొబైల్ డేటాలో సమస్యలను పరిష్కరించడానికి ఫ్లైట్ మోడ్ ఎంపిక మరొక ఉత్తమమైన మార్గం. ఫ్లైట్ మోడ్‌ను సెట్టింగ్‌ల మెనూ ద్వారా ప్రారంభించవచ్చు లేదా నోటిఫికేషన్ ప్యానెల్ ద్వారా కూడా ఓపెన్ చేయవచ్చు. ఇది సిమ్ యొక్క అన్ని కనెక్షన్లను నిలిపివేస్తుంది. దీనిని ఆన్ చేసిన తరువాత ఫోన్ కాల్స్ కూడా స్వీకరించడం వీలుపడదు. ఫ్లైట్ మోడ్‌ను కొన్ని సెకన్ల పాటు ఎనేబుల్ చేసి ఆపై డిసేబుల్ చెయ్యండి.
చిట్కా 3: డేటా ప్లాన్ గడువు తనిఖీ చేయడం
మీ మొబైల్ డేటా పనిచేయడంలో ఏదైనా సమస్యలు ఎదురైతే కనుక మొదట మీరు చేయవలసినది మీ డేటా ప్లాన్‌ను తనిఖీ చేయడం. మీ మొబైల్ రీఛార్జ్ ప్యాక్ గడువు ముగిసిందో లేదో వెంటనే చూడాలి. గడువు ముగిసి ఉంటే సర్వీస్ యాక్టీవ్ చేయడానికి వెంటనే రీఛార్జ్ చేయండి. మొబైల్ డేటా సరిగ్గా పనిచేయకపోతే మీ డేటా ప్యాక్ యొక్క రోజువారీ FUP అయిపోయినట్లు కూడా ఉండవచ్చు. ఈ రోజుల్లో చాలా రీఛార్జ్ ప్లాన్ లు రోజువారీ డేటా క్యాప్‌తో వస్తున్నాయి. రోజువారీ డేటా క్యాప్ అయిపోయినట్లయితే డేటా ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.
చిట్కా 4: మీ సిమ్ కార్డును తీసి తిరిగి చొప్పించండి
మీ మొబైల్ డేటా స్పీడ్ ను పరిష్కరించడానికి మరొక ప్రభావవంతమైన మార్గం ఏమిటంటే మీ మొబైల్ ఫోన్ నుండి సిమ్ కార్డును తీసివేసి సిమ్‌ను తిరిగి మళ్లీ చొప్పించడం. మొబైల్ ఫోన్ నుండి సిమ్ కార్డును తీయడానికి మీకు సిమ్ ఎజెక్టర్ టూల్ అవసరం ఉంటుంది.
చిట్కా 5: మీ స్మార్ట్‌ఫోన్‌ను తిరిగి ప్రారంభించడం
మీ మొబైల్ ఇంటర్నెట్లోని స్పీడ్ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడే మరో సరళమైన మార్గం మీ స్మార్ట్‌ఫోన్‌ను ఆఫ్ చేసి తిరిగి ప్రారంభించడం. ఇది నెట్వర్క్ సమస్య అయినా లేదా మరేదైనా అయినా సరే ఫోన్‌ను పున: ప్రారంభించడంతో మొబైల్ ఫోన్లోని సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ల్యాప్‌టాప్‌లు, పిసిలు లేదా మరేదైనా గాడ్జెట్ విషయంలో కూడా ఇలాంటిదే ఉంటుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190