Home
How to

స్మార్ట్‌ఫోన్ స్పీకర్‌లో సమస్యలా..?

ఓవర్ హీటింగ్, నెట్‌వర్క్ ఎర్రర్, చార్జింగ్ ఇష్యూ, కెమెరా ఇష్యు, యాప్ క్రాష్ ఇలా రకరకాల సమస్యలు స్మార్ట్‌ఫోన్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి.

By Sivanjaneyulu Bommu

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరుగుతున్న కొద్ది వాటిలో సమస్యల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఓవర్ హీటింగ్, నెట్‌వర్క్ ఎర్రర్, చార్జింగ్ ఇష్యూ, కెమెరా ఇష్యు, యాప్ క్రాష్ ఇలా రకరకాల సమస్యలు స్మార్ట్‌ఫోన్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. వీటితో పాటు మరో సమస్య కూడా స్మార్ట్‌ఫోన్ యూజర్లను వేధిస్తోంది. అదే స్మార్ట్‌ఫోన్ ఇంటర్నల్ స్పీకర్ ఇష్యు.

Read More : వాట్సాప్‌కు షాకిచ్చిన Hike, అందుబాటులోకి వీడియో కాల్స్ ఆఫ్షన్

సౌండ్ నెమ్మదిగా రావటం..

సౌండ్ నెమ్మదిగా రావటం..

ఫోన్ స్పీకర్ నుంచి సౌండ్ నెమ్మదిగా రావటం, స్పీకర్ పనిచేయకపోవటం, వాల్యుమ్ సెట్టింగ్స్ స్పందించకపోవటం లాంటివి ఇంటర్నల్ స్పీకర్ సమస్య తాలుకా సంకేతాలే. సామ్‌సంగ్, ఎల్‌జీ, యాపిల్, మైక్రోమాక్స్, షియోమీ వంటి బ్రాండెడ్ ఫోన్‌లలో తలెత్తే ఇంటర్నల్ స్పీకర్ సమస్యను సులువుగా పరిష్కరించుకునేందుకు 5 ఉత్తమ మర్గాలను ఇప్పుడు చూద్దాం....

వాల్యుమ్ సెట్టింగ్స్‌లో సమస్య అయితే..

వాల్యుమ్ సెట్టింగ్స్‌లో సమస్య అయితే..

సమస్య వాల్యుమ్ సెట్టింగ్స్‌లో ఉన్నట్లయితే ముందుగా మీ ఫోన్ సైలెంట్ లేదా వైబ్రేటర్ మోడ్‌లో ఉందేమో చెక్ చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే మోడ్‌ను మార్చుకుంటే సరిపోతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాల్యుమ్‌ను పెంచి చూడండి..

వాల్యుమ్‌ను పెంచి చూడండి..

మీ ఫోన్‌లో ఫ్రీ అవుట్ గోయింగ్ కాల్స్ ఉన్నట్లయితే మీ మిత్రులకు ఫోన్ చేసి వాల్యుమ్‌ను చెక్ చేసుకోండి. అవసరమనుకుంటే ఇన్-కాల్ వాల్యుమ్‌ను పెంచుకోండి.

సమస్య రిపీట్ అవుతున్నట్లయితే ...

సమస్య రిపీట్ అవుతున్నట్లయితే ...

పై సూచనలను పాటించినప్పటికి స్పీకర్ సమస్య రిపీట్ అవుతున్నట్లయితే ఫోన్ స్పీకర్‌తో పాటు మైక్‌ను ఓ సారి చెక్ చేయండి. ఏదైనా సమస్య డిటెక్ట్ అయినట్లయితే ఫోన్‌ను సమీపంలోని మొబైల్ రిపేర్ సెంటర్ వద్దకు తీసుకువెళ్లి రిపేర్ చేయించుకోండి.

సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా..

సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా..

కొన్ని సందర్భాల్లో ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ లోపం కారణంగా సౌండ్ సమస్యలు తెలెత్తే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చు.

 ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి

ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి

మీ ఫోన్ డయల్ ప్యాడ్ నుంచి *#0*#కు డయల్ చేయటం ద్వారా ఫోన్ హార్డ్ వేర్ సమస్యలను తెలుసుకోవచ్చు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

More from GizBot

Best Mobiles in India

English summary
How to Fix Smartphone internal Speaker Problems. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X