టచ్ స్ర్కీన్‌‌లో సమస్యలా..?

విలువైన టిప్స్ మీ కోసం...

|

కీప్యాడ్ ఆపరేటింగ్‌తో పోలిస్తే టచ్‌‍స్ర్కీన్ ఆపరేటింగ్ మరింత సులభతరంగా ఉండటంతో అత్యధిక శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లనే ఎంపిక చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో టచ్ స్ర్కీన్‌లు నెమ్మదైన పనితీరును కనబరుస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. ఇలా జరగటానికి చాలానే కారణాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఫోన్‌ను సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లే ముందు ఆఖరి ప్రయత్నంగా మీరు అప్లై చేసేందుకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్‌ను మీకు సూచించటం జరుగుతోంది...

ఫోన్‌ను  టర్నాఫ్ చేయండి..

ఫోన్‌ను టర్నాఫ్ చేయండి..

ముందుగా డివైస్‌ను టర్నాఫ్ చేయండి. కొద్ది సెకన్ల తరువాత తిరిగి మళ్లి ఆన్ చేయండి. ఇలా చేయటం వల్ల టచ్ స్ర్కీన్‌కు సంబంధించి సాఫ్ట్‌వేర్ సమస్యలు ఏవైనా తొలగిపోయే అవకాశముంది.

ఇలా ప్రయత్నించినప్పటికి...

ఇలా ప్రయత్నించినప్పటికి...

టచ్‌స్ర్కీన్ పనిచేయకపోయినట్లయితే, డివైస్‌ను మరోసారి టర్నాఫ్ చేసి బ్యాటరీని తొలగించండి. ఇదే సమయంలో ఫోన్‌లోని సిమ్ ఇంకా మెమరీ కార్డ్‌లను కూడా తొలగించి కొన్ని నిమిషాల తరువాత మరలా వాటిని యాదా స్థానాల్లో అమర్చి మళ్లి ఫోన్‌ను ఆన్ చేసి చూడండి. కొన్ని సందర్భాలలో సిమ్ కార్డ్‌లలో తలెత్తే సమస్యల కారణంగా కూడా టచ్ స్ర్కీన్ వ్యవస్థ స్తంభించే అవకాశముంది.

 స్ర్కీన్‌ను క్లిన్ చేయండి

స్ర్కీన్‌ను క్లిన్ చేయండి

ఐసోప్రొపైల్ ఆల్కాహాల్ ఇంకా ఒక చిన్న బ్రష్ సహాయంతో ఫోన్  స్ర్కీన్‌ను క్లిన్ చేయండి. స్ర్కీన్ పైన ఏమైనా మరకలు ఉన్నట్లుయితే తొలగిపోతాయి. కొన్ని సందర్భాల్లో స్ర్కీన్ పై ఏర్పడిన డస్ట్ కారణంగా కూడా టచ్ స్ర్కీన్ స్పందించకపోవచ్పచు.

సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయండి...

సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయండి...

ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయటం వల్ల కూడా పరిష్కారం లభించవచ్చు. చివరి ప్రయత్నంగా ఫోన్‌ను రీసెట్ చేయండి. ఇలా చేయటం వల్ల ఫోన్ పూర్తిగా రీఫ్రెష్ అవుతుంది కాబట్టి సమస్యకు పరిష్కారం లభించవచ్చు. అయితే ఫోన్‌ను రీసెట్ చేసేమందుకు డేటాను బ్యాకప్ చేసుకోవటం మర్చిపోకండి.

సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లండి

సర్వీసింగ్ సెంటర్‌కు తీసుకువెళ్లండి

పైన పేర్కొన్న సూచనలను అమలచేసినప్పటికి సమస్య అలానే ఉన్నట్లయితే ఫోన్ తయారీదారుకు సంబంధించి సర్వీసింగ్ సెంటర్‌కు ఫోన్‌ను తీసుకువెళ్లండి.

Best Mobiles in India

English summary
how to fix smartphone touch screen. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X