Home
How to

స్మార్ట్‌ఫోన్‌ నీటిలో పడిందా.. వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా రోజు గడవని పరిస్థితి ప్రస్తుతం చాలా మందిలో నెలకొంది. వ్యక్తిగత అవసరాల నుంచి వృత్తిపరమైన పనుల వరకు స్మార్ట్‌ఫోన్‌లను అనేక మంది ఉపయోగిస్తున్నారు. రోజులో ఉదయం నిద్రలేచింది మొదలు, రాత్రి నిద్రపోయే వరకు ఫోన్‌తోనే (Smartphone) గడుపుతున్న వారు కూడా చాలా మందే ఉన్నారు. అంతలా ఫోన్‌లను ఉపయోగిస్తు్‌న్నారు. అయితే అలాంటి స్మార్ట్‌ఫోన్‌ ఎప్పుడైనా నీటిలో పడిపోతే, ఇలాంటి సమయాల్లో అనేక మంది తీవ్ర ఆందోళనకు గురవుతారు.

ఫోన్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్‌ చేయవద్దు :
ఆందోళనకు పక్కన పెట్టి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నీటిలో ఫోన్‌ పడిపోయిన వెంటనే బయటకు తీసి, ఫోన్‌ పనిచేస్తుందో లేదో తెలుసుకొనేందుకు ఫోన్‌ ఆన్‌ చేస్తుంటారు. దీని వల్ల ఫోన్‌ లోపల సర్క్యూట్లకు విద్యుత్‌ సరఫరా జరిగి, పూర్తిగా డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్‌ ను ఆన్‌ చేయవద్దు.

How to fix water damaged smartphone

అయితే ఫోన్‌ నీటిలో పడిపోతే ఏం చేయాలి :
ఫోన్‌ నీటిలో పడిపోతే వెంటనే స్విచ్‌ ఆఫ్‌ చేయాలి. వీలైనంత వరకు నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నం చేయాలి. ఫోన్‌ కేస్‌, సిమ్‌ కార్డు, మెమొరీ కార్డులు తీసివేయాలి. బ్యాటరీ బయటకు తీసేందుకు అవకాశం ఉంటే తీసేయాలి. ఫోన్‌ ను కాటన్‌ క్లాత్‌ లేదా టిష్యూ పేపర్‌ తో తుడవాలి.

అసలే వద్దు :
ఫోన్‌ నుంచి నీటిని బయటకు తీసివేసేందుకు చాలా మంది యూజర్లు ఎండలో పెట్టడం, వేడిచేయడం, హెయిర్‌ డ్రయర్‌ ను వినియోగిస్తుంటారు. అధిక వేడి కారణంగా ఫోన్‌ అంతర్గత విభాగాలు డ్యామేజీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దు.

బియ్యంలో పెడుతున్నారా? :
నీటిలో ఫోన్‌ లో పడిపోతే చాలా మంది బియ్యంలో పెట్టాలని సలహా ఇస్తుంటారు. బియ్యం కొంత వరకు ఫలితం చూపించినా, ఫోన్‌ లో నీటిగా పూర్తిగా తీసేందుకు అవకాశం లేదు. తడి ఫోన్‌ ను బియ్యంలో పెట్టడం వల్ల పోర్టులు, స్పీకర్‌ లోకి బియ్యం పిండి చేరే అవకాశం ఉంది.

ఇవి కొంచెం బెటర్‌ :
బియ్యానికి బదులుగా సిలికా జెల్‌ ప్యాకెట్లు కొంత ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి. ఫోన్‌ ను కనీసం 48 గంటల వరకు ఛార్జింగ్‌ చేయకూడదు, ఆన్‌ చేయకూడదు.

మంచి రేటింగ్‌ కలిగిన ఫోన్‌లు కూడా :
ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌ లు IP68, IP69 రేటింగ్‌ తో కూడిన డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ గా ఉంటున్నాయి. ఉప్పు నీరు లేదా కొన్ని రసాయనాలు కలిగిన నీటిలో పడితే ఈ రేటింగ్‌ కలిగిన ఫోన్‌లు కూడా డ్యామేజీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లడం ఉత్తమం :
మీరు అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా ఫోన్‌ లో నీరు ఉన్నట్లు అనిపించినా, ఆన్‌ కాకపోయినా సర్వీస్‌ సెంటర్‌ కు తీసుకెళ్లడం ఉత్తమం. అయితే మీరు వారంటీ కింద మరమ్మతు చేయించేందుకు చాలా వరకు అవకాశం ఉండదు.

More from GizBot

Best Mobiles in India

English summary
How to fix water damaged smartphone here are the best tips in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X