Just In
Don't Miss
- Movies
'వెంకీమామ' తొలిరోజు వసూళ్లు.. మామాఅల్లుళ్ళ ప్రభావం ఎలా ఉందో చూడండి
- News
దారితప్పిన యువతి, సాయం చేస్తానని ముందుకొచ్చిన ఆటోడ్రైవర్, లాడ్జ్‌కు తీసుకెళ్లి లైంగికదాడి...
- Sports
కోహ్లీలా కష్టపడితేనే: వెస్టిండిస్ ఆటగాళ్లకు కోచ్ సూచన
- Lifestyle
శనివారం మీ రాశిఫలాలు 14-12-2019
- Automobiles
ట్రైబర్ ఎంపీవీలో టర్భో ఇంజన్ తీసుకొస్తున్న రెనో
- Finance
మ్యాట్రిమోని సైట్ సాయంతో దొరికిపోయిన ‘షేర్’ కిలాడీలు!
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
మీ Google Drive అకౌంట్లో స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేసుకోవటం ఎలా..?
గూగుల్ అందిస్తోన్న అత్యుత్తమ ఆన్లైన్ సర్వీసుల్లో 'గూగుల్ డ్రైవ్' (Google Drive) ఒకటి. గూగుల్ యూజర్లు ఈ సర్వీసును ఉపయోగించుకోవటం ద్వారా 15జీబి క్లౌడ్ స్టోరేజ్ స్సేస్‌ను ఉచితంగా వినియోగించుకునే వీలుంటుంది. ఈ 15జీబీ స్టోరేజ్ స్పేస్‌ను ఒక్క గూగుల్ డ్రైవ్ అకౌంట్‌కే కాకుండా జీమెయిల్ అకౌంట్ అలానే గూగుల్ ఫోటోస్‌తో కలిపి వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జీమెయిల్ అకౌంట్‌ను ప్రైమరీ అకౌంట్‌గా వినియోగించుకుంటున్నట్లయితే ఆ 15జీబిల డేటా త్వరగా ఫిల్ అయ్యేందుకు ఆస్కారం ఉంది.
ఏపీ, తెలంగాణా వాసులకు తియ్యని శుభవార్తను అందించిన ఓలా

ఫైళ్లను క్లియర్ చేసుకోవటం ద్వారా..
ఉచిత స్టోరేజ్ లిమిట్‌ను దాటేసిన తరువాత గూగుల్ అకౌంట్లను నిర్వహించుకోవాలంటే మీకు రెండే రెండు ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అందులో ఒకటి అదనపు స్టోరేజ్‌ను కొనుక్కోవటం మరొకటి డ్రైవ్‌లోని స్పేస్‌ను ఫ్రీ-అప్ చేసుకోవటం. ఎప్పటికప్పుడు గూగుల్ స్టోరేజ్ స్పేస్ కొనుక్కోవటం అనేది అన్ని సందర్భాల్లో సాధ్యమయ్యే పనికాదు. ఇలా కాకుండా గూగుల్ డ్రైవ్‌లోని అనవసరమైన ఫైళ్లను క్లియర్ చేసుకోవటం ద్వారా స్టోరేజ్ స్పేస్‌ను ఎప్పటికప్పుడు ఫ్రీగా ఉంచుకోవచ్చు. నేటి ప్రత్యేక కథనంలో భాగంగా గూగుల్ డ్రైవ్ యాప్ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ స్పేస్‌ను ఫ్రీ-అప్ చేసుకునే మార్గాలను మీకు తెలియజేయటం జరుగుతోంది..

ప్యానల్లో సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని..
ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నుంచి గూగుల్ డ్రైవ్ యాప్‌ను ఓపెన్ చేసి ఉంచండి. యాప్ ఓపెన్ అయిన తరువాత మెయిన్ స్ర్కీన్ పై టాప్ లెఫ్ట్ కార్నర్లో కనిపించే ‘three horizontal line' సింబల్ పై క్లిక్ చేసినట్లయితే నేవిగేషన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఈ ప్యానల్లో సెట్టింగ్స్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

Cacheని క్లియర్ చేసుకోవటం ద్వారా..
సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లిన తరువాత Clear Cache ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే డ్రైవ్‌లోని అనవసర ఫైల్స్ మొత్తం రిమూవ్ చేయబడతాయి. దీంతో కొంత మేర ఖాళీ స్పేస్ డ్రైవ్‌లో ఏర్పడుతుంది. పైన పేర్కొన్న ప్రొసీజర్ మొత్తం విజయవంతంగా పూర్తయిన తరువాత యాప్ నుంచి బయటకు వచ్చి మరోసారి యాప్‌ను ఓపెన్ చేయండి. మరోసారి యాప్‌లోకి వెళ్లిన తరువాత తొలగించాలనుకుంటోన్న ఫైళ్లను సెలక్ట్ చేసుకుని "Trash" ఐకాన్ పై క్లిక్ చేయటం ద్వారా అవి డిలీట్ కాబడతాయి.

పాత మెయిల్స్‌ను డిలీట్ చేయటం ద్వారా..
తదుపరి స్టెప్‌లో భాగంగా మీ జీమెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేసి పాత మెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని సెలక్ట్ చేసుకుని "Trash" ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే అవి కూడా ట్రాష్ క్యాన్‌లోకి చేరిపోతాయి. దీంతో మరికొంత స్టోరేజ్ స్పేస్ ఖాళీ అవుతుంది.

గూగుల్ ఫోటోస్ అకౌంట్లోకి వెళ్లి..
పాత మెయిల్స్‌ను డిలీట్ చేసిన తరువాత మీ గూగుల్ ఫోటోస్ అకౌంట్లోకి వెళ్లి అక్కడ మీకు అవసరంలేని ఫోటోలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా డిలీట్ చేసేయండి. దీంతో మరికొంత స్పేస్ మీకు కలిసోస్తుంది. ఇలా రెగ్యులర్‌గా చేస్తుండటం వల్ల మీ గూగుల్ డ్రైవ్‌లోని స్టోరేజ్ స్పేస్ ఎప్పటికప్పుడు ఖాళీ అవుతుంటుంది.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790