స్మార్ట్‌ఫోన్‌ అధికంగా హ్యాంగ్ అవుతున్నదా?? స్టోరేజ్ ను క్లీన్ చేయడం ఎలాగో తెలుసా?

|

మార్కెట్‌లో అధిక స్టోరేజ్ స్పేస్‌తో అనేక స్మార్ట్‌ఫోన్ వేరియంట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు వాడుతున్న ప్రస్తుత మీ యొక్క ఫోన్ స్టోరేజ్ 128 GB లేదా 64 GB కంటే తక్కువగా ఉంటే కనుక పెద్ద గేమ్ లేదా ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బార్‌లో 'అవుట్ ఆఫ్ స్టోరేజ్' మెసేజ్ ను చూడడం మొదలవుతుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో మంచి విషయం ఏమిటంటే వారికి చాలా కస్టమైజేషన్ ఎంపికలు లభిస్తాయి. కానీ వారికి కొంచెం కలవరపెట్టే విషయం ఏమిటంటే క్రమంగా ఇంటర్నల్ మెమరీ ఫుల్ అవుతూనే ఉంటుంది. అయితే కొన్ని సులభమైన మార్గాలను అనుసరించడంతో ఇంటర్నల్ స్టోరేజ్ ను ఖాళీ చేయడం ద్వారా ఫోన్ పనితీరును మెరుగుపరచవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో అన్ని ఫైల్‌లు మరియు యాప్‌లు ఉండాల్సిన అవసరం ఉండదని మీరు కనుగొనవచ్చు. అలాగే మీరు దేనినీ తొలగించాలనుకోవడం లేదు అనుకుంటే కనుక కొన్ని సాధారణ చిట్కాలతో శుభ్రపరిచి కొంత అదనపు మెమరీని పొందడానికి మీరు ఇప్పటికీ మంచి మార్గాన్ని ఎంచుకోవచ్చు.

మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ ను ఖాళీ చేసే విధానం

మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ ను ఖాళీ చేసే విధానం

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో సెట్టింగ్‌స్ విభాగానికి వెళ్లండి.

స్టెప్ 2: స్టోరేజ్ విభాగాన్ని ఎంచుకోండి.

స్టెప్ 3: మీరు ఫైల్ కేటగిరీల జాబితాను చూస్తారు మరియు ఎంత స్థలం మిగిలి ఉంది అన్న విషయాన్ని కనుగొంటారు.

స్టెప్ 4: ‘ఫ్రీ అప్ స్పేస్' ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 5: గూగుల్ ఫైల్స్ యాప్ (ఇన్‌స్టాల్ చేయబడితే) లేదా ‘ఐటెమ్‌లను తీసివేయండి' ఫీచర్‌ను ఎంచుకునే ఆప్షన్ మీకు లభిస్తుంది.

స్టెప్ 6: రిమూవ్ ఐటెమ్స్ ఫీచర్ మీరు బ్యాకప్ చేసిన ఫోటోలు మరియు వీడియోలను డిలీట్ చేసే ఆప్షన్ ఇస్తుంది.

స్టెప్ 7: అదనంగా మీరు డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌లు మరియు తక్కువ ఉపయోగించిన యాప్‌లను కూడా తీసివేయవచ్చు.

 

కాష్ మెమరీని క్లియర్ చేయడం

కాష్ మెమరీని క్లియర్ చేయడం

ఫోన్ మెమరీలో ఎక్కువ భాగం కాష్‌కి వెళుతుంది. కాబట్టి ముందుగా దాన్ని క్లియర్ చేయండి. సెట్టింగ్‌లకు వెళ్లి స్టోరేజ్ కు వెళ్లండి. ఇక్కడ మీరు కాష్‌ని చూస్తారు. దాన్ని క్లియర్ చేయండి. ఇది మీ ఫైల్‌లలో దేనినీ తొలగించదు. అదనంగా మీ స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ను విడిపించడానికి మరొక ఎంపిక స్మార్ట్ స్టోరేజ్ టోగుల్ ద్వారా స్మార్ట్ స్టోరేజ్ టోగుల్ ఆన్ చేసినప్పుడు పరికరం 30, 60 లేదా 90 రోజుల తర్వాత బ్యాకప్ చేసిన ఫోటోలను స్వయంచాలకంగా తొలగిస్తుంది. స్టోరేజ్ నిండినప్పటికీ బ్యాకప్ చేసిన ఫైల్‌లను ఇది ఆటోమేటిక్‌గా తొలగిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌ల నుండి ఉపయోగించని యాప్‌లను తొలగించే విధానం

స్మార్ట్‌ఫోన్‌ల నుండి ఉపయోగించని యాప్‌లను తొలగించే విధానం

స్టెప్ 1: మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్లే స్టోర్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: ఇప్పుడు ఎగువ ఎడమ మూలలో ఉన్న మెనూని ఓపెన్ చేసి మై యాప్స్ మరియు గేమ్‌ల విభాగానికి వెళ్లండి.

స్టెప్ 3: ఎగువ మెను లైన్ నుండి 'ఇన్‌స్టాల్ చేయబడిన' విభాగం మీద నొక్కండి.

స్టెప్ 4: ఇక్కడ టాప్ లైన్‌లో, ఈ డివైజ్‌లో, కుడి వైపున చూడండి. ఇది మీకు జాబితాను ఫిల్టర్ చేసే ఆప్షన్‌ని ఇస్తుంది.

స్టెప్ 5: ఇక్కడ 'చివరిగా ఉపయోగించబడింది' ఎంచుకోండి.

స్టెప్ 6: మీరు ఎక్కువగా ఉపయోగించిన యాప్‌లు పైన చూపబడతాయి. జాబితాలో క్రింద చూపిన యాప్‌లు అవసరాన్ని బట్టి తీసివేయబడతాయి.

 

Best Mobiles in India

English summary
How to Free up Storage on Your Smartphone

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X