Youtube లో 500 స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉన్నారా.. అయితే మీరు ఆ ఫీచ‌ర్‌కు అర్హులే!

|

ప్ర‌స్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రి ఇళ్ల‌లో Youtube వినియోగం భారీగా పెరిగిపోయింది. అందుకు త‌గ్గట్టూ Youtube వేదిక‌గా కంటెంట్ క్రియేట‌ర్ల సంఖ్య కూడా బాగానే పెరిగింది. ఎవ‌రికి వారు Youtube లో ఛానెల్స్ క్రియేట్ చేయ‌డం న‌చ్చిన అంశంపై వీడియోలు చేస్తూ క్రియేట‌ర్లుగా మారి ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు యూట్యూబ్‌లో కొత్త‌గా ఛానెల్ క్రియేట్ చేసుకున్న వారికి Community Tab Feature ఎలా పొందాలి అనే విష‌యంపై స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అలాంటి వారి కోసం ఆ క‌మ్యూనిటీ ఆప్ష‌న్ పొంద‌డానికి అర్హ‌త‌లు ఏమిటి, దాన్ని ఎలా సాధించాల‌నే విష‌యాల్ని ఇక్క‌డ మేం అందిస్తున్నాం. మీరు కూడా మీ యూట్యూబ్‌లో Community Tab Feature ఎలా పొందాల‌ని ఆస‌క్తిగా ఉంటే ఈ కింది ప్ర‌క్రియ‌ను ఫాలో అవండి.

youtube community feature

అస‌లు Community Tab Feature అంటే ఏమిటి!
Youtube లో ఛానెల్ ప్రారంభించిన ఎవ‌రైనా ఈ Community Tab Feature ను అందుకోవాలంటే ఓ ముఖ్య‌మైన విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే.. మ‌న ఛానెల్ క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ ను సాధించాలంటే ముందుగా మ‌న ఛానెల్‌కు త‌ప్ప‌నిస‌రిగా 500 మందికి పైగా స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉండాలి. 500 మంది స‌బ్‌స్క్రైబ‌ర్స్ ఉంటేనే ఈ ఫీచ‌ర్‌ను Youtube మ‌న‌కు సిఫార‌సు చేస్తుంది. లేదంటే చేయ‌దు.

సాధారణంగా Youtube అంటే వీడియో మాత్ర‌మే పోస్టులు చేస్తార‌ని అంద‌రికీ తెలుసు. కానీ, ఈ కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా మ‌న ఛానెల్‌లో మ‌రో రెండు ర‌కాల పోస్టులు చేయ‌వ‌చ్చు. అవేంటంటే.. ఫేస్‌బుక్ స‌హా ఇత‌ర సామాజిక మాధ్య‌మాల మాదిరి హెడ్‌లైన్ డిస్క్రిప్ష‌న్‌తో ఫోటో పోస్టులు చేయ‌వ‌చ్చు. దాంతో పాటుగా పోల్స్ (క్విజ్ మాదిరి) పోటీలు కూడా ఈ Community Tab Feature ద్వారా మ‌న ఛానెల్‌పై నిర్వ‌హ‌ణ చేయ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు రాష్ట్రంలో రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ గెలుస్తుంది.. అనే ప్ర‌శ్న ఇచ్చి దానికి నాలుగు ఆప్ష‌న్ల‌ను జ‌త చేయ‌వ‌చ్చు. త‌ద్వారా మీ స‌బ్‌స్క్రైబ‌ర్ల అభిప్రాయాల‌ను ఈ పోల్‌లో మీరు తెలుసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఈ విధంగా క‌మ్యూనిటీ ట్యాబ్ Youtube క్రియేట‌ర్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది.

youtube community feature

Community Tab Feature సాధించాలంటే ఏం చేయాలి!
ఈ ఫీచ‌ర్ సాధించాలంటే ముందుగా మ‌న స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ 500 దాటాలి. ఆ త‌ర్వాత మ‌నం క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్‌ను కోరుతూ యూట్యూబ్‌కు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం.

* ముందుగా Youtube ఛానెల్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత ఎడ‌మ‌వైపు మీకు వివిధ ర‌కాల ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వాటిని స్క్రోల్ డౌన్ చేస్తే చివ‌ర‌న సెండ్ Feedback అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
* సెండ్ ఫీడ్ బ్యాక్ (Send Feedback) ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకున్న వెంట‌నే మీకు ఒక న్యూ టేబుల్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు యూట్యూబ్‌కు ఓ చిన్న డిస్క్రిప్ష‌న్ రాయాలి. "మా ఛానెల్ స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ 500 చేరుకుంది. కాబ‌ట్టి మాకు క‌మ్యూనిటీ ట్యాబ్ ఫీచ‌ర్ అందించ‌గ‌ల‌రు." అని ఇంగ్లీష్‌లో రాసి సెండ్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఈ ప్ర‌క్రియ పూర్తి చేసిన త‌ర్వాత మీ ఛానెల్ కంపెనీ గైడ్‌లైన్స్ అన్ని స‌క్ర‌మంగా పాటిస్తున్న‌ట్ల‌యితే త‌ప్ప‌కుండా వారం లేదా ప‌ది రోజుల్లో క‌మ్యూనిటీ ట్యాబ్ అందుబాటులోకి వ‌స్తుంది.

youtube community feature
అదేవిధంగా ఇప్పుడు యూట్యూబ్‌లో స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ బ‌య‌టి వ్య‌క్తుల‌కు క‌న‌బ‌డ‌కుండా డిజేబుల్ ప్ర‌క్రియ ఎలాగో తెలుసుకుందాం:
యూట్యూబ్ ఛానెల్‌లో స‌బ్‌స్క్రైబ‌ర్స్ కౌంట్ త‌క్కువా.. ఎక్కువా అనేది ప‌క్క‌న పెడితే అలా నంబ‌ర్‌ బ‌య‌టి వారికి క‌న‌బ‌డ‌కుండా ఉండాల‌ని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం నంబ‌ర్ బ‌య‌ట‌కు క‌న‌ప‌డ‌కుండా చేసుకునే వెసులుబాటు యూట్యూబ్ క‌ల్పిస్తోంది. ఇప్పుడు అలా మ‌న స‌బ్‌స్క్రైబ‌ర్స్‌ కౌంట్ ఇత‌రుల‌కు క‌న‌బ‌డ‌కుండా ఉండేందుకు ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా తెలుసుకుందాం.

స‌బ్‌స్క్రైబ‌ర్స్ కౌంట్ ఇత‌రుల‌కు క‌న‌బ‌డ‌కుండా డిజేబుల్ చేసే ప్ర‌క్రియ:
* ముందుగా Youtube ఛానెల్ లేని వారు ఛానెల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత Channel లోకి వెళ్లి క‌స్ట‌మైజ్ ఛానెల్ (Customize Channel) ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.
* క‌స్ట‌మైజ్ ఛానెల్ (Customize Channel) ఆప్ష‌న్ ఎంపిక చేసుకున్న త‌ర్వాత స్క్రీన్‌పై ఎడ‌మ వైపున మ‌రికొన్ని ఆప్ష‌న్స్ మ‌నం క‌నుగొన‌వ‌చ్చు.
* ఎడ‌మ వైపు క‌నిపించే ఆప్ష‌న్స్‌లో సెటింగ్స్ (Settings) ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* ఆ త‌ర్వాత మ‌న‌కు టేబుల్ మాదిరి మ‌రో విండో ఓపెన్ అవుతుంది. అందులో ఎడ‌మ వైపున "Channel" అని ఉన్న‌ రెండో ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
* "Channel" ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకున్న త‌ర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ (Advance Settings) అనే సెక్ష‌న్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మ‌న‌కు కొన్ని ఆప్ష‌న్స్ కనిపిస్తాయి. వాటిలో డిస్‌ప్లే నంబ‌ర్ ఆఫ్ పీపుల్ స‌బ్‌స్క్రైబ్‌డ్ మై ఛానెల్ (Display Number Of People Subscribed My Channel)అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని డిజేబుల్ చేయాలి. అలా డిజేబుల్ చేయ‌డం ద్వారా మ‌న యూట్యూబ్ ఛానెల్ స‌బ్‌స్క్రైబ‌ర్ కౌంట్ అనేది బ‌య‌టి వ్య‌క్తుల‌కు క‌న‌బ‌డ‌కుండా చేయ‌వ‌చ్చు.

Best Mobiles in India

English summary
how to get a community tab on youtube

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X