జియో కొత్త సిమ్‌ను ఉచితంగా ఇంటి వద్దకే డెలివరీ ద్వారా పొందడం ఎలా??

|

భారతదేశం అంతటా ఇప్పటికీ ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనావైరస్ కేసులు కొత్తగా నమోదు అవుతున్నందున చాలా మంది తమ యొక్క ఇంటి నుండి బయటకు రావడం ప్రమాదకరంగా భావిస్తున్నారు. ఈ మహమ్మారి పరిస్థితి కారణంగా చాలా కంపెనీలు తమ సేవలను కొనసాగించడానికి ఆన్‌లైన్ మార్గాన్ని ప్రవేశపెట్టాయి. రిలయన్స్ జియో కూడా ఈ విషయంలో ఇదే పద్దతిని అవలంబిస్తున్నది. ఈ టెలికాం ఆపరేటర్ వినియోగదారులకు కొత్త జియో సిమ్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి మరియు నేరుగా ఇంటి వద్దకు డెలివరీ చేయడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఆన్‌లైన్‌లో కొత్త జియో సిమ్‌ను బుక్ చేసుకోవడానికి మరియు ఇంటి వద్దకు ఉచితంగా డెలివరీ పద్దతిలో పొందాలని చూస్తున్నారా? అయితే ఈ కింది విధానాన్ని అనుసరించండి.

How To Get a Jio New SIM For Free By Home Delivery

జియో సిమ్‌ను ఉచితంగా ఇంటి వద్దకే పొందే విధానం

స్టెప్ 1: మొదటగా అధికారిక రిలయన్స్ జియో వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: https://www.jio.com/en-in/jio-postpaid-prepaid-home-delivery-book-appoint.html వెబ్‌సైట్‌లో ఎగువన చూపించే జియో సిమ్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: మీ యొక్క పూర్తి పేరు మరియు మొబైల్ నంబర్‌తో సహా మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయండి.

స్టెప్ 4: జనరేట్ OTP పై క్లిక్ చేయండి.

స్టెప్ 5: మీ మొబైల్ నంబర్‌కు పంపిన ఆరు అంకెల OTP ని నమోదు చేయండి.

స్టెప్ 6: వెబ్‌సైట్ సిమ్ - పోస్ట్‌పెయిడ్ మరియు ప్రీపెయిడ్ రకాన్ని ఎంచుకునే ఎంపికను చూపుతుంది.

స్టెప్ 7: జియో పోర్ట్ లేదా కొత్త కనెక్షన్ వంటి ఎంపికలను కూడా జియో అందిస్తుంది. మీకు బాగా సరిపోయే ఎంపికను మీరు ఎంచుకోవచ్చు.

స్టెప్ 8: వెబ్‌సైట్ లో తరువాత మీ యొక్క చిరునామా, పిన్ కోడ్ మరియు ఇంటి నంబర్‌తో సహా ఇతర వివరాలను జోడించాల్సి ఉంటుంది.

స్టెప్ 9: ఈ వివరాలను జోడించిన తర్వాత "కొత్త జియో సిమ్ అభ్యర్థనను సమర్పించండి" ఎంపికపై క్లిక్ చేయండి.

స్టెప్ 10: మీ అభ్యర్థన విజయవంతంగా ప్రాసెస్ చేయబడినట్లు వెబ్‌సైట్ ఒక మెసేజ్ ను చూపుతుంది: "జియోపై మీ ఆసక్తికి ధన్యవాదాలు. మీ ప్రస్తుత నంబర్‌ను Jio కి పోర్ట్ చేయాలనే మీ అభ్యర్థన విజయవంతంగా సమర్పించబడింది. మా ఎగ్జిక్యూటివ్ త్వరలో మిమ్మల్ని సంప్రదిస్తారు. "

అవసరమైన డాక్యూమెంట్స్

How To Get a Jio New SIM For Free By Home Delivery

కొత్త జియో సిమ్ డెలివరీ సమయంలో ధృవీకరణ కోసం మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ (POI) మరియు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) ని వెంట ఉంచుకోవాలి. మీరు కింది డాక్యుమెంట్‌లలో ఒకదాన్ని సమర్పించవలసి ఉంటుంది.

ఆధార్ కార్డు

ఓటరు ID

పాస్‌పోర్ట్

డ్రైవింగ్ లైసెన్స్

Best Mobiles in India

English summary
How To Get a Jio New SIM For Free By Home Delivery

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X